Nagarjuna: మా పెళ్లిళ్లకు రండి డబ్బులిస్తాం అంటారు, నాగార్జున వ్యాఖ్యలు వైరల్ - అంబానీ ప్రి-వెడ్డింగ్‌కు లింక్ చేస్తున్న జనం!
Nagarjuna: సీనియర్ హీరో నాగార్జున ఒక పాత ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. డబ్బులిచ్చి పెళ్లిళ్లకు పిలిచిపించుకుంటారు అంటూ ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Nagarjuna: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లి సందడి గురించే కనిపిస్తోంది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల పెళ్లికి ఇంకా సమయం ఉన్నా కూడా ప్రీ వెడ్డింగ్ వేడుకలు అనే పేరుతో మూడు రోజుల పాటు జాంనగర్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకలకు వచ్చిన సెలబ్రిటీల లిస్ట్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ అని తేడా లేకుండా ఎందరో సినీ సెలబ్రిటీలు.. ఈ వేడుకల్లో సందడి చేశారు. అయితే ఈ వేడుకలకు హాజరవ్వడానికి కూడా స్టార్లకు రెమ్యునరేషన్ దక్కుతుందట. ఇదే విషయంపై హీరో నాగార్జున ఒక పాత ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
డబ్బులు చెల్లిస్తారా?
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఒకరోజు కాదు.. మూడు రోజులు జరిగాయి. దీనికోసం ఎక్కడెక్కడి నుండో సెలబ్రిటీలు జాంనగర్‌కు చేరుకున్నారు. ఈ మూడు రోజులకు అయిన ఖర్చు దాదాపు రూ.1000 కోట్లు అని సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే మూడు రోజుల పాటు బిల్ గేట్స్, మార్క్ జుకెర్బెర్గ్ లాంటి బిజినెస్‌మ్యాన్‌లు, షారుఖ్, సల్మాన్, అమీర్ లాంటి సినీ యాక్టర్లు తమ డేట్స్‌ను ఫ్రీ చేసుకొని వేడుకలకు రావడం అనేది చాలా పెద్ద విషయం. దానికోసం వారికి రెమ్యునరేషన్ కూడా అందుతుందేమో అని చాలామందిలో సందేహం మొదలయ్యింది. అయితే డబున్నవారి ఇంట్లో జరిగే పెళ్లి వేడుకల గురించి నాగార్జున ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను కొందరు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు లింక్ చేస్తున్నారు.
దాదాపు రూ.1 కోటి రెమ్యునరేషన్..
‘‘పెళ్లిళ్లకు డబ్బులిచ్చి తీసుకొస్తుంటే ఏం చెప్తాం. మా పెళ్లిళ్లకు రండి మేము డబ్బులిస్తాం అంటున్నారు’’ అంటూ కొందరిని ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు నాగార్జున. అయితే ఆయన మాత్రం అలాంటి విషయాలను ఎంటర్‌టైన్ చేయలేదని, ఆయనకు అలా వెళ్లడం నచ్చదని క్లారిటీ ఇచ్చారు. ఆయన వెళ్లకపోయినా కూడా అలాంటి ఆహ్వానాలు వచ్చాయని చెప్పారు. వచ్చి 20 నిమిషాలు ఉండి వెళ్లిపోండి అంటారని తెలిపారు. ఇక అలా వెళ్లడం వల్ల ఎంత రెమ్యునరేషన్ ఇస్తారని అడగగా.. ‘‘అది చెప్పలేం. కచ్చితంగా చాలా డబ్బులే ఇస్తారనుకుంటున్నాను. హిందీ స్టార్లకు, వేరేవాళ్లకు రూ.1 కోటి రూపాయల వరకు ఇచ్చారట నాకు తెలియదు. మనవాళ్లకు అంత ఇవ్వకపోయినా కచ్చితంగా ఎంతోకొంత ఇస్తారు’’ అని నాగ్ అన్నారు.
View this post on Instagram
ముగ్గురు ఖాన్స్ డ్యాన్స్..
అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకల సందర్భంగా నాగార్జున ఒక పాత ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇది ఇన్‌డైరెక్ట్‌గా వేడుకలకు హాజరయిన స్టార్ల గురించి మాట్లాడుతున్నట్టే ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్లలో ఈ ముగ్గురు ముందు స్థానాల్లో ఉంటారు. అలాంటిది ఈ ముగ్గురిని ఒకే వేదికపై నిలబెట్టి ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు వేయించారంటే అంబానీ మామూలు వ్యక్తి కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా రూ.75 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి మరీ హాలీవుడ్ సింగర్ రిహాన్నాతో ఈ వేడుకల్లో పాటలు కూడా పాడించారు.
Also Read: అంబానీ ప్రి-వెడ్డింగ్ వేడుకలో బాలీవుడ్ బాద్‌షాకు అవమానం? షారుఖ్‌ను పక్కకు పొమ్మన్నారా? వీడియో వైరల్