అన్వేషించండి

Nagarjuna: ధనుష్, శేఖర్ కమ్ముల కోసం ఖాకీ చొక్కా వేసిన నాగార్జున!

Nagarjuna Role In Kubera Movie: ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కుబేర'. అందులో కింగ్ నాగార్జున ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ ఏమిటనేది రివీల్ అయ్యింది.

కోలీవుడ్ స్టార్, ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ధనుష్ (Dhanush) హీరోగా సెన్సిబుల్ సినిమాల డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తీస్తున్న సినిమా 'కుబేర' (Kubera Movie). ఇందులో టాలీవుడ్ కింగ్, పాన్ ఇండియా యాక్టర్ అక్కినేని నాగార్జున మరో హీరో. ప్రజెంట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో కింగ్ క్యారెక్టర్ ఏమిటనేది రివీల్ అయ్యిందని ఫిలిం నగర్ టాక్.

'కుబేర' సినిమాలో పోలీసుగా చేస్తున్న నాగార్జున!
Nagarjuna Turns Cop for Kubera Movie: ఇప్పటి వరకు లవ్ స్టోరీలు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు, యూత్ ఫుల్ సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల... 'కుబేర'తో రూట్ చేంజ్ చేశారు. ఫస్ట్ టైమ్ ఆయన యాక్షన్ ఫిలిం చేస్తున్నారు. ముంబై మురికివాడలు, ధారవి నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జునను పోలీసుగా చూపిస్తున్నారట. నాగార్జున పోలీస్ అంటే తెలుగు ప్రేక్షకులకు 'శివమణి' గుర్తుకు వస్తుంది. అందులో పూరి జగన్నాథ్ బాగా చూపించారు. మరి, శేఖర్ కమ్ముల ఎలా చూపిస్తారో?

'కుబేర'లో ఖాకీ చొక్కా వేసి నాగార్జున ఏం చేశారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నాగార్జునది మాఫియా డాన్ రోల్ అని మొదట ప్రచారం జరిగినా అందులో నిజం లేదట. హీరో రోల్ విషయానికి వస్తే... ధారవికి చెందిన యువకుడిగా ధనుష్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు టాక్.

Also Readవద్దమ్మా... బ్యాక్ నుంచి ఫోటోలు, వీడియోలు వద్దమ్మా - ముంబై పాపరాజీ వర్సెస్ హీరోయిన్ల గొడవేంటి?


'కుబేర' షూటింగ్ ప్రజెంట్ హైదరాబాద్ సిటీలో జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం యూనిట్ బ్యాంకాక్ వెళ్లి వచ్చింది. అక్కడ కీలకమైన సన్నివేశాలు షూటింగ్ చేసి వచ్చారు. ఇప్పుడు హైదరాబాదులో ధనుష్, నాగార్జునతో పాటు ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తీస్తున్నారట.

'కుబేర' చిత్రాన్ని  నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో... సోనాల్ నారంగ్ సమర్పణలో శేఖర్ కమ్ములకు చెందిన అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్.

Also Read'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా


అందరూ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత చేస్తున్న సినిమా!
'కుబేర' సినిమాకు ముందు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన  'ఫిదా', 'లవ్ స్టోరీ' బాక్సాఫీస్ బరిలో భారీ విజయాలు సాధించాయి. అయితే, ఆ రెండూ రొమాంటిక్ సినిమాలు. ఇప్పుడు తీస్తున్నది యాక్షన్ సినిమా. మరి, ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో? సంక్రాంతికి సక్సెస్ ఫుల్ సినిమా 'నా సామి రంగ' తర్వాత నాగార్జున నటిస్తున్న సినిమా ఇది. ధనుష్ కూడా సంక్రాంతికి తమిళంలో భారీ వసూళ్లు సాధించిన 'కెప్టెన్ మిల్లర్' సినిమా చేశారు. అది తెలుగులో ఆలస్యంగా విడుదల అయ్యింది. కానీ, అంత సక్సెస్ కాలేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget