అన్వేషించండి

Nagababu Twitter: వివాదస్పద ట్వీట్‌, రెండు రోజులకే నాగబాబు ట్విట్టర్‌ ఖాతా డిలీట్‌ - అసలేం జరిగిందంటే!

Nagababu Twitter Deleted: ఎన్నికల తర్వాత చేసిన మెగాబ్రదర్‌ నాగబాబు ట్వీట్‌ ఎంతటి రచ్చలేపిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌ చేసిన రెండు రోజులకే ఆయన ఎక్స్ ఖాతా డిలీట్‌ చేయడం గమనార్హం.

Nagababu Deactivated His Twitter Account After a Cryptic Post: ఓ వివాదస్పద ట్వీట్‌ తర్వాత మెగా బ్రదర్‌ నాగబాబు ఎక్స్‌ అకౌంట్‌ మాయం అయ్యింది. నాగబాబు తన ఎక్స్‌ అకౌంట్‌ని డిలిట్‌ చేశాడు. ప్రస్తుతం దీనిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎందుకు ఆయన తన ఎక్స్‌ అకౌంట్‌ని డిలిట్‌ చేశాడు, మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందా? అంతా ఇప్పుడు దీనిపై చర్చించుకుంటున్నారు. అయితే ఈసారి ఏపీ ఎన్నికల సెగ ఫిలిం ఇండస్ట్రీకి తాకిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య అభిప్రాయ బేధాలు తలత్తెలా చేసిందా? అని ఇండస్ట్రీ, రాజకీయ వర్గాలు చర్చికుంటున్నాయి. దీనికి కారణం అందరికి తెలిసిందే.

అదే అల్లు అర్జున్‌ పవన్‌ కళ్యాణ్‌కి కాకుండా వైఎస్సార్‌ సీపీ పార్టీ అభ్యర్థి తరపు ప్రచారం చేయడమే. దానికి ముందే తన మద్దతు పవన్‌ కళ్యాణ్‌కే అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ మరుసటి రోజే నంద్యాల వెళ్లి వైఎససార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశాడు. ఇందులో బన్నీ ఉద్దేశం ఏదైనా మెగా ఫ్యాన్స్, ఫ్యామిలీ మాత్రం హర్ట్‌ అయ్యారన్నది నిజం. పోలింగ్‌ తర్వాత నాగబాబు కొణిదెల తన ఎక్స్‌లో చేసిన పోస్ట్‌ చూస్తే అదే అనిపించించింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన కూడా మావాడే' అంటూ ట్వీట్‌ వదిలాడు.

నాగబాబుకు ఫ్యాన్స్ కౌంటర్

ఈ ట్వీట్‌ బన్నీని ఉద్దేశించినట్టు ఉండటంతో ఫ్యాన్స్‌ బాగా హార్ట్‌ అయ్యారు. పోలింగ్‌ రోజు బన్నీ దీనిపై క్లారిటీ కూడా ఇచ్చాడు. తాను ఏ పార్టీకి సపోర్టు కాదని, అన్ని పార్టీలకు న్యూట్రల్‌ అనన్నాడు. తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసమే నంద్యాల వెళ్లానని స్పష్టం చేశాడు. అయినా కూడా నాగబాబు ఈ ట్వీట్‌ చేయడం వేనక అంతర్యం ఏంటని బన్నీ ఫ్యాన్స్‌ మండిపడ్డారు. ఈ నాగబాబు చేసిన ఈ పోస్ట్‌ ట్విట్టర్‌లో రచ్చ లేపింది. బన్నీ ఫ్యాన్స్‌ ముక్కుముడిగా ప్రతి ట్వీట్‌ చేస్తూ నాగబాబుకు కౌంటర్‌ ఇస్తున్నారు. బన్నీని పరోక్షంగా తమ వాడు కాదు అనడం సరైనది కాదని,  మరే అయితే ఎన్నికల ముందే ఈ ట్వీట్‌  ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గతంలో అల్లు అర్జున్‌ జనసేనకు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వలేదా? పరాయి వాడైతే ఎందుకు అంత సాయి చేస్తారంటూ గుర్తుచేస్తున్నారు.Nagababu Twitter: వివాదస్పద ట్వీట్‌, రెండు రోజులకే నాగబాబు ట్విట్టర్‌ ఖాతా డిలీట్‌ - అసలేం జరిగిందంటే!

చిరంజీవి సలహా మేరకేనా?

ఇలా సోషల్‌ మీడియాలో నాగబాబుపై ట్వీట్‌ప బన్నీ ఫ్యాన్స్‌, వైఎస్సార్‌సీపీ శ్రేణులు రగడ లేపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మాత్తుగ నాగబాబు ట్విట్టర్‌ ఖాదా మాయమైంది. ఆయన ప్రోఫైల్‌ సెర్చ్‌ చూడగా ఈ అకౌంట్‌ వాడుకలో లేదు (This Account Doesn't exist) అని దర్శనం ఇచ్చింది. దీంతో ఇప్పుడిది హాట్‌టాపిక్‌గా నిలిచింది. బన్నీపై చేసిన పరోక్ష కామెంట్స్‌తో ఫ్యాన్స్‌ దాటికి నాగబాబు ఈ అకౌంట్‌ డిలిట్‌ చేశాడంటూ మళ్లీ చర్చ మొదలైంది. అయితే తాజాగా బజ్‌ ప్రకారం ఈ వ్యవహరంపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారట.  చిరంజీవి ఈ విషయమై నాగబాబుతో మాట్లాడారట. ఈ ట్వీట్‌ డిలిట్‌ చేసి ఈ వివాదాన్ని సద్దుమనిగించమని సూచన ఇచ్చారట. కానీ నాగబాబు ఏకంగా తన ట్విటర్‌ ఖాతానే డిలిట్‌ చేసి పూర్తిగా వివాదానికి చెక్‌ పెట్టాడు. 

Also Read: ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ - NTR31 టైటిల్‌ ఇదేనట!

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget