Naga Vamsi On War 2: హిందీ నిర్మాతను నమ్మాం... తప్పు జరిగింది - 'వార్ 2' రిజల్ట్, ట్రోల్స్‌పై నాగవంశీ రియాక్షన్
Naga Vamsi Latest Interview: 'వార్ 2' రిజల్ట్ గురించి నిర్మాత నాగవంశీ మరోసారి మాట్లాడారు. 'మాస్ జాతర' ప్రమోషన్లలో భాగంగా మాస్ మహారాజా రవితేజతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రోల్స్ మీద స్పందించారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) 'వార్ 2' (War 2 Movie) విడుదలకు ముందు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. 'వార్ 2' మూవీని దాదాపు వంద కోట్లు చెల్లించి మరీ కొన్నట్టుగా సమాచారం. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగవంశీ అయితే 'వార్ 2' చిత్రాన్ని పైకి లేపే ప్రయత్నంలో చాలా గట్టిగా మాట్లాడాడు. ఆ క్రమంలో హిందీ నెట్ కంటే తెలుగు నెట్, కలెక్షన్స్ ఎక్కువగా ఉండాలని ఫ్యాన్స్‌కి ఆదేశాలు ఇచ్చారు. కాలర్ ఎత్తుకునేలా సినిమా ఉంటుందని, ఎన్టీఆర్‌ను ఇది వరకు చూడనటు వంటి లుక్స్‌లో చూపించారంటూ ఇలా ఏవేవో చెప్పేశాడు.
ఇచ్చిన హైప్ వేరు... రిజల్ట్ వేరు!
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమాకు నాగవంశీ ఇచ్చిన హైపర్ వేరు. అయితే చివరకు 'వార్ 2' అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో నాగవంశీ కూడా చాలా వరకు సైలెంట్ అయిపోయాడు. 'కొత్త లోక 1' సక్సెస్ మీట్ లో స్టేజ్ మీద ఎక్కినా కూడా ఎక్కువగా మాట్లాడటం లేదు. మునుపటిలా హైపర్‌గా ఉండటం లేదు. తాజాగా నాగవంశీ 'వార్ 2' ఫలితం, ట్రోల్స్ మీద రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. 'మాస్ జాతర' ప్రమోషన్స్‌లో భాగంగా కళ్యాణ్ శంకర్ చేసిన చిట్ చాట్‌లో రవితేజ, నాగవంశీ పలు విషయాల మీద స్పందించాడు. 'వార్ 2' ఫలితం మీద నాగవంశీ రియాక్ట్ అయ్యాడు.
Also Read: సమంత కుటుంబంలో ఆ దర్శకుడు... దీపావళితో మరోసారి వార్తల్లోకి వాళ్ళిద్దరి బంధం
''నేను ఆ రోజు బాగా ఎగ్జైట్ అయ్యాను. తప్పులు అందరూ చేస్తారు కదా? మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉంటారా? నేను, ఎన్టీఆర్ అన్నా... యశ్ చోప్రా, యశ్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ల (ఆదిత్య చోప్రా)ను నమ్మాం. వాళ్ల వైపు తప్పు జరిగింది. మనం దొరికాం... మేం చేసిన సినిమా కాదు కదా... ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్‌ని నమ్మాం. తప్పు జరిగింది... దొరికాం... ట్రోల్ చేస్తున్నారు... మనం తీసిన సినిమా దొరకలేదు.. హ్యాపీ'' అంటూ నాగవంశీ చెప్పుకొచ్చాడు.
Jr NTR, తను ఆదిత్య చోప్రాను, యశ్ రాజ్ ఫిలింస్ ను నమ్మేశాం కాబట్టే WAR 2 తో నష్టపోయమన్నారు
— ABP Desam (@ABPDesam) October 21, 2025
ప్రొడ్యూసర్ నాగవంశీ. తను ఎప్పుడు దొరికిపోతాననో ఎదురు చూశారని..బయటి సినిమాతో దొరికిపోయానన్నారు నాగవంశీ.#War2 #JrNTR #Nagavamsi #Adithyachopra #Massjathara #Raviteja #abpdesam #telugunews pic.twitter.com/KvoviVPXMb
'వార్ 2' ఫలితం మీద హృతిక్ రోషన్ కూడా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకు కష్టపడటమే మన చేతుల్లో ఉంటుందని, అన్నీ చిత్రాలు హిట్ అవ్వాలని లేదని, హిట్ ఫ్లాప్ అనేది మన చేతుల్లో ఉండదంటూ హృతిక్ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
Also Read: అవును... వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి - అఫీషియల్‌గా చెప్పిన త్రివిక్రమ్ టీమ్!





















