చైతూ, సమంత ప్యాచ్ అప్ అయ్యారా? ఇన్‌స్టాలో పోస్ట్‌కి అర్థం అదేనా?
తాజాగా చైతు తన ఇన్ స్టాగ్రామ్‌లో సమంత కుక్క పిల్ల ఫోటోని పోస్ట్ చేశాడు. ఈ పోస్టు చూసిన నెటిజన్స్ చై, సామ్ మళ్లీ కలువబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
సమంత, నాగచైతన్య మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. గత కొద్ది రోజులుగా చై-సామ్ మళ్లీ కలవబోతున్నారని, విడాకులు రద్దు చేసుకొని మళ్లీ న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారనే వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. అందుకు కారణం సమంత పెంపుడు కుక్క హష్ నాగచైతన్య దగ్గర కనిపించడమే. సమంత దగ్గర హాష్, షాష్ అనే రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. అందులో హాష్ ఎప్పటినుంచో సమంత, నాగచైతన్య ఇద్దరూ కలిసి ఉన్నప్పటి నుంచి ఉంది. అది సమంత, చైతూ ఇద్దరికీ ఎంతో క్లోజ్. అయితే ఈ జంట విడిపోయాక సమంత ఆ కుక్కని తనతో పాటే తీసుకెళ్లిపోయింది. సమంత కొన్ని సార్లు తన సోషల్ మీడియాలో తన కుక్కతో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.
అయితే సమంత చైతన్య నుంచి విడిపోయిన తర్వాత హాష్ మొదటిసారి నాగచైతన్య దగ్గర కనిపించడం అందరిని షాక్‌కి గురి చేసింది. రీసెంట్గా ఓ అభిమాని కొత్త బైక్ కొనుక్కొని నాగచైతన్య కలవడానికి వెళ్లగా అక్కడ ఓ కుక్కపిల్ల చైతన్య వద్దకు వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. దాంతో అది సమంత కుక్క అని గుర్తుపట్టేసి ఫ్యాన్స్ అంతా ఆ వీడియోని ట్రెండ్ చేశారు. ఆ వీడియో చూసిన చాలామంది సమంత కుక్కపిల్ల చైతన్య దగ్గర ఎందుకు ఉంది? చై, సామ్ మళ్లీ కలిసిపోతున్నారా? అంటూ నెటిజన్స్ దీని గురించే తెగ డిస్కస్ చేశారు. ఆ డిస్కషన్‌తో చై, సామ్ కామన్ ఫ్యాన్స్ త్వరలోనే ఈ జంట కలవబోతున్నట్లు నెట్టింట కామెంట్స్ చేశారు.
ఇక ఇప్పుడు మరోసారి సమంత కుక్కపిల్ల హష్ నాగచైతన్య దగ్గర కనిపించింది. స్వయంగా చైతు ఆ కుక్కపిల్ల ఫోటోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో హష్ కారులో నాగచైతన్య ఒడిలో కూర్చుని సూర్యాస్తమయాన్ని వీక్షిస్తూ కనిపించింది. ఆ ఫోటోకి చైతు 'వైబ్'(vibe) అనే క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేశాడు. చైతు షేర్ చేసిన ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పిక్‌తో చై, సామ్ ప్యాచప్ అయి ఉండవచ్చనే ఊహాగానాలకు తెరలేపింది. దాంతో ఈ పిక్‌ని చూసిన నెటిజన్స్ కామెంట్ సెక్షన్లో నాగచైతన్యని 'మీరు సమంతతో ప్యాచప్ అయ్యారా?' అంటూ అడుగుతున్నారు.
మరో నెటిజన్ 'బహుశా సమంత ఆస్ట్రియా ట్రిప్‌కి బయలుదేరే ముందు హాష్ని చైతు దగ్గర విడిచిపెట్టి ఉంటుంది?' అని రాస్కొచ్చాడు. ఇంకో నెటిజెన్ "మీరు హష్ కోసమైనా ప్యాచ్ అప్ అవ్వండి" అంటూ కామెంట్ పెట్టాడు. ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సమంత, నాగచైతన్య నాలుగేళ్ల తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు 2021లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల తర్వాత నాగచైతన్య ఫోటోలు ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసేసింది సమంత. అయితే తాజాగా చైతో కలిసి ఉన్న ఫోటోలు మళ్లీ ఆమె ప్రొఫైల్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఇవన్నీ వారిద్దరూ కలిసిపోతున్నారనే అంశాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
Also Read : 'యాత్ర 2'లో వైఎస్సార్, జగన్ ఫస్ట్ లుక్ - ఎన్నికల సమయానికే సినిమా విడుదల
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
View this post on Instagram