అన్వేషించండి

Nag Ashwin - Kalki 2: 'కల్కి 2' ఎప్పుడు మొదలవుతుంది? - ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్

Amaran Pre Release Event: శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన 'అమరన్' దీపావళి కానుకగా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన నాగ్ అశ్విన్ 'కల్కి 2' అప్డేట్ ఇచ్చారు.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఒక క్లారిటీ ఇచ్చారు. బాక్సాఫీస్ బరిలో మన బాహుబలి సత్తా ఏమిటో ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి మొదలు పెడితేనే ముంబై వరకు మరోసారి 'కల్కి 2898 ఏడీ'తో చూపించిన ఆయన ఆ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

కల్కి 2 చేయడానికి టైం ఉంది!
Nag Ashwin On Kalki 2898 AD Part 2: 'కల్కి' సినిమాలో ప్రేక్షకులు చూసింది కొంతే... ఆ ప్రపంచంలో ఇంకా చూడాల్సిన వింతలు, విశేషాలు వీక్షకులు అందరూ ఆశ్చర్యపోయే‌‌ కథ, కథనాలు ఉన్నాయి. వాటిని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు? సీక్వెల్ ఎప్పుడు చేస్తారు? అని రెబల్ స్టార్ ఫ్యాన్స్, ఆడియన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే వాళ్లను కాస్త డిజప్పాయింట్ చేసే న్యూస్ ఇది. కాకపోతే మళ్లీ మళ్లీ అడగకుండా క్లారిటీ ఇచ్చేశారు నాగ్ అశ్విన్.

'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ చేయడానికి టైం ఉందని ఆయన స్పష్టత ఇచ్చారు. తమిళ హీరో శివ కార్తికేయన్, 'ఫిదా' నుంచి మొదలుపెడితే ఆ తర్వాత చేసిన సినిమాలతో తెలుగు అమ్మాయి అయిపోయిన సాయి పల్లవి జంటగా నటించిన సినిమా 'అమరన్'. దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.‌ ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దానికి నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో ప్రేక్షకులు కల్కి సీక్వెల్ గురించి పదేపదే అడగ్గా... ''కల్కి 2'కి చాలా టైం ఉంది చేద్దాం'' అని చెప్పారు.

'కల్కి' సీక్వెల్ చేయడానికి అంత టైం ఎందుకు?
'కల్కి 2898 ఏడీ' సినిమా విడుదలకు ముందే సీక్వెల్ కోసం కొన్ని సన్నివేశాలను చిత్రీకరణ చేసి పక్కన పెట్టారు. ఆల్రెడీ కథ లాక్ చేశారు. స్క్రీన్ ప్లే పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు. బాక్సాఫీస్ బరిలో 1000 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాకు సీక్వెల్ అంటే చాలా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. మరి, ఆ క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి సినిమా టీం ఎందుకు ట్రై చేయడం లేదు? ఆ సినిమా సీక్వెల్ చేయడానికి ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటున్నారు? అంటే... ప్రభాస్ ఇంతకు ముందు అంగీకరించిన సినిమాలు కొన్ని ఉండటమే.

Also Read: ప్రభాస్‌తో పాటు వీళ్లదీ బర్త్ డే... ఇద్దరు హీరోయిన్లు, ఆ నిర్మాత కూడా ఈ రోజే పుట్టారని తెలుసా?


'కల్కి' సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో హారర్ ఎంటర్టైనర్ 'ది రాజా సాబ్' చేయడానికి ప్రభాస్ అంగీకరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభాస్ మీద ఉంది. 'కల్కి' కంటే ముందు విడుదలై రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఆకలి తీర్చిన సినిమా 'సలార్'. ఆ సినిమా సీక్వెల్ కూడా ప్రభాస్ మొదలు పెట్టాల్సి ఉంది. హను రాఘవపూడి దర్శకత్వంలో మరొక ప్రేమకథ మొదలు పెట్టారు. హను మూవీ, 'రాజా సాబ్', 'సలార్ 2' సినిమాలు కాకుండా 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి భారీ బ్లాక్ బస్టర్స్ తీసిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో పోలీస్ స్టోరీ 'స్పిరిట్' ఓకే చేశారు. ఆ సినిమా కూడా ప్రభాస్ కంప్లీట్ చేయాలి. ఆయన చేతిలో ఉన్న సినిమాలో పూర్తి చేయాల్సిన కమిట్మెంట్లు ఎక్కువ ఉండడం వల్ల కల్కి టు సెట్స్ మీదకు వెళ్లడం ఆలస్యం కానుంది.

Also Readప్రభాస్‌కు, మిగతా హీరోలకు డిఫరెన్స్ ఏంటి? బాక్సాఫీస్ బాహుబలి ఎందుకంత స్పెషల్??

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet Decisions: పేదలకు శుభవార్త, దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు - ఉద్యోగులకు డీఏ: మంత్రి పొంగులేటి
పేదలకు శుభవార్త, దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు - ఉద్యోగులకు డీఏ: మంత్రి పొంగులేటి
Fire Accident: జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం, షాపింగ్ మాల్ దగ్ధం
Fire Accident: జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం, షాపింగ్ మాల్ దగ్ధం
Sabarimala Alert: ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు నిబంధనల సడలింపు
ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు నిబంధనల సడలింపు
Rains Update: స్థిరంగా అల్పపీడననం, ఏపీలో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
స్థిరంగా అల్పపీడననం, ఏపీలో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs NZ Test Series | WTC 2025 ఫైనల్ ఆడాలంటే టీమిండియా ఇలా చేయాల్సిందే.! | ABP DesamMS Dhoni Retention Uncapped Player IPL 2025 | తలా ధోనీ రాక కన్ఫర్మ్..క్లారిటీ ఇచ్చేసిన CSK | ABPInd vs NZ Second Test Day 3 Highlights | మూడోరోజుల్లో భారత్ కథ ముగించేసిన న్యూజిలాండ్ | ABP DesamSai Durgha Tej On His Career | ABP Southern Rising Summit 2024 లో సాయి దుర్గ తేజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet Decisions: పేదలకు శుభవార్త, దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు - ఉద్యోగులకు డీఏ: మంత్రి పొంగులేటి
పేదలకు శుభవార్త, దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు - ఉద్యోగులకు డీఏ: మంత్రి పొంగులేటి
Fire Accident: జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం, షాపింగ్ మాల్ దగ్ధం
Fire Accident: జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం, షాపింగ్ మాల్ దగ్ధం
Sabarimala Alert: ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు నిబంధనల సడలింపు
ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు నిబంధనల సడలింపు
Rains Update: స్థిరంగా అల్పపీడననం, ఏపీలో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
స్థిరంగా అల్పపీడననం, ఏపీలో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు - తెలంగాణలో పెరిగిన ఉక్కపోత
Chandrababu At Unstoppable 4: ఆరోజు కలిగిన బాధ, ఆ సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేను - అరెస్టుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆరోజు కలిగిన బాధ, ఆ సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేను - అరెస్టుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ABP Southern Rising Summit:  కేసులు పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు
కేసులు పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు
Best CNG Car Under Rs 10 Lakh: హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ వర్సెస్ టాటా పంచ్ సీఎన్‌జీ - రెండిట్లో ఏది బెస్ట్ సీఎన్‌జీ కారు?
హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ వర్సెస్ టాటా పంచ్ సీఎన్‌జీ - రెండిట్లో ఏది బెస్ట్ సీఎన్‌జీ కారు?
Anantapuram News: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం - ఆరుగురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం - ఆరుగురు మృతి
Embed widget