అన్వేషించండి

Mythri Movie Makers : అజిత్‌తో మైత్రి మూవీ మేకర్స్ సినిమా ఫిక్స్ - డైరెక్టర్ ఎవరంటే?

Ajith Kumar : టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

Thala Ajith : కోలీవుడ్ అగ్ర హీరోలు ఒక్కొక్కరుగా టాలీవుడ్ మేకర్స్ తో చేతులు కలుపుతున్న విషయం తెలిసిందే. ఈ లిస్టులో ధనుష్ మొదటి ప్లేస్ లో ఉన్నాడు. గత ఏడాది తెలుగులో స్ట్రైట్ సినిమా చేసి హిట్ కొట్టాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ధనుష్ తో తెరకెక్కించిన 'సార్' మూవీ మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. దాంతో తెలుగులో మరో క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ధనుష్ రెండవ సినిమా చేస్తున్నారు. ఈయన తర్వాత మరోసారి హీరో శివ కార్తికేయన్ జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో ప్రిన్స్ అనే సినిమా తీశాడు. అటు దళపతి విజయ్ కూడా మన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమాలో నటించాడు.

అలా టాలీవుడ్ దర్శక నిర్మాతలతో కోలీవుడ్ అగ్ర హీరోలు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో కోలీవుడ్ స్టార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలుగొందుతున్న మైత్రి మూవీ మేకర్స్ తమిళ అగ్ర హీరో అజిత్ తో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి దర్శకుడిగా అధిక్ రవి చంద్రన్ వ్యవహరించబోతున్నారట. రీసెంట్ గానే ఈయన విశాల్ తో 'మార్క్ ఆంటోనీ' అనే సినిమా తెరకెక్కించాడు. తెలుగులో అంతగా ఆడలేదు కానీ ఒరిజినల్ వెర్షన్ మాత్రం బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది.

రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీకి తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళ ఆడియోన్స్ కి కనెక్ట్ అయ్యేలా అదిక్ రవిచంద్రన్ మార్క్ ఆంటోనీ మూవీ ని తెరకెక్కించడంతో ఈ చిత్రం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు ఇదే డైరెక్టర్ అజిత్ తో సినిమా చేయబోతున్నారట. అధిక్ రవిచంద్రన్ అజిత్ కి వీరాభిమాని. ఈ విషయాన్ని ఆయనే ఎన్నోసార్లు బయటపెట్టారు. ఇప్పుడు తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో అజిత్ కుమార్‌తో మూవీని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

కానీ మొత్తానికి ఈ కాంబినేషన్ లాక్ అయినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో న్యూస్ వినిపిస్తోంది. అజిత్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా నిర్మించడం ఒక విధంగా మైత్రి నిర్మాతలకి మంచి లాభం అని చెప్పొచ్చు. ఎందుకంటే అజిత్ కి ఉన్న మార్కెట్ పరంగా చూసుకుంటే రూ.200 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది. ఒకవేళ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే 'విక్రమ్', 'జైలర్', 'లియో' కలెక్షన్స్ ని సైతం ఈజీగా బ్రేక్ చేసే కెపాసిటీ అజిత్ కి ఉందని చెప్పొచ్చు. కాగా అజిత్ తో అధిక రవిచంద్రన్ చేయబోయే సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Also Read : ఒకే స్టూడియోలో, ఒకే సమయంలో - 21 ఏళ్ల తర్వాత అనుకోకుండా కలుసుకున్న కమల్, రజినీ

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget