NTR31: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు!
'కేజిఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న NTR31 సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా అదిరిపోయే అప్డేట్ అందించారు.
‘KGF‘ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ అప్డేట్ తో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.' ఆర్ ఆర్ ఆర్' తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర'(Devara) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతున్నట్లు దర్శకుడు కొరటాల శివ తాజాగా వెల్లడించారు. అంతేకాకుండా 'దేవరా' పార్ట్-1 వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కాబోతున్నట్లు అనౌన్స్ చేసి అభిమానుల్లో జోష్ నింపారు.
ఇక ఇప్పుడు ఆ జోష్ ని రెట్టింపు చేసే మరో క్రేజీ అప్డేట్ తాజాగా బయటికి వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో పాటు బాలీవుడ్ యాక్షన్ మూవీ 'వార్ 2' షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన అనంతరం ‘KGF‘ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ ని సెట్స్ పైకి కి తీసుకెళ్ళబోతున్నాడు. 'NTR 31' పేరుతో ఇప్పటికే అనౌన్స్మెంట్ చేసిన ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ అప్డేట్ ని అందించారు మేకర్స్. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రారంభించబోతున్నట్లు నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు.
The most awaited project of @tarak9999 & #PrashanthNeel will commence in April, 2024 ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) October 5, 2023
The prestigious high-octane spectacle will create a new benchmark in Indian Cinema 💥💥#NTRNeel 🔥@NANDAMURIKALYAN @NTRArtsOfficial pic.twitter.com/CxTPchxOPz
ఈ మేరకు సినిమాని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా.." తారక్, ప్రశాంత్ నీల్(#NTRNEEL) ప్రాజెక్ట్ 2024 ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మకమైన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తుంది" అంటూ పేర్కొంది. ఈ అప్డేట్ తో తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తాజా అప్డేట్ ప్రకారం 'దేవర' పార్ట్-1 విడుదల కాగానే ఏమాత్రం విరామం తీసుకోకుండా ప్రశాంత్ నీల్ మూవీని పట్టాలెక్కించబోతున్నారు ఎన్టీఆర్. ఈలోపు ప్రశాంత్ నీల్ కూడా తను డైరెక్ట్ చేస్తున్న 'సలార్' మూవీ రెండు భాగాల షూటింగ్ ని పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
'సలార్' సీజ్ ఫైర్ పార్ట్-1 డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. సలార్ పార్ట్-1 రిలీజ్ తర్వాత వెంటనే పార్ట్-2 షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు షూటింగ్ ని పూర్తి చేసి అనంతరం ఎన్టీఆర్ మూవీతో బిజీ కానున్నారు ప్రశాంత్ నీల్. ఇక ఎన్టీఆర్ 'దేవర' విషయానికొస్తే.. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read : ఈ ఆదివారం ‘బిగ్ బాస్’లో అదిరిపోయే ట్విస్ట్, ఆ నలుగురికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ? కంటెస్టెంట్లకు షాక్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial