Mahesh Babu: సూపర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ - ముఫాసా: ది లయన్ కింగ్ ట్రైలర్ వచ్చేస్తోంది, రిలీజ్ ఎప్పుడంటే...
Mahesh Babu as Mufasa: ముఫాసా: ది లయన్ కింగ్ తెలుగు ట్రైలర్ రిలీజ్ డేట్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ముఫాసా పాత్ర సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
Mufasa: The Lion King Telugu Trailer Update: ముఫాసా: ది లయన్ కింగ్ సినిమాకు వరల్డ్ వైడ్‌గా ఎంతో ప్రేక్షకాదరణ ఉంది. 1994లో యాక్షన్ అడ్వెంచర్ వచ్చిన ఈ సినిమా 'లయన్ కింగ్'. అప్పట్లో భారీ విజయం సాధించిన ఈ సినిమాను 2019లో యానిమిమేషన్ 3Dలో తీసుకువచ్చారు. అది కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా 'ముఫాసా: ది లయన్ కింగ్' తీసుకువస్తున్నారు. అనాథ అయినా ఓ సింహం అడవికి రాజుగా ఎలా ఎదిగిందనేది ఈ చిత్రంలో చూపిస్తున్నారు.
బారీ జెంకిన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 20న భారత్‌లోని అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్టు 26న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముఫాసా పాత్రకు మహేష్ వాయిస్‌కి ఇస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
SUPERSTAR MAHESH BABU is the Telugu voice of Mufasa in Disney's visually stunning family entertainer #MufasaTheLionKing. 🤘
— Ramesh Bala (@rameshlaus) August 21, 2024
Mark your calendars for the Telugu trailer launch on 26th August at 11:07 AM. 🕚
Catch the movie roaring into theatres on 20th Dec in English, Hindi,… pic.twitter.com/1lpJb7ROjL
ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ అప్‌డేట్ రావడంతో అంతా ఖుష్ అవుతున్నారు. ట్రైలర్‌లోనే ముఫాసా పాత్రతో మహేష్ బాబు వాయిస్ వినడం కోసం అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామంటున్నారు. ఇంగ్లీష్ తో పాటు భారత్ లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్‌లు రిలీజ్ కానున్నాయి. హిందీలో ముఫాసా పాత్రకు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ చెప్పనున్నారు. ఇలా ఆయా భాషల్లోనూ స్టార్ హీరోల చేత ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు డిస్నీ హాట్ ప్లాన్ చేస్తోందట.
ఇక 2019లో వచ్చిన 'లయన్ కింగ్' 3D వెర్షన్‌కి ముఫాసా తనయుడి సింబు పాత్రకు తెలుగులో హీరో నాని వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమా SSMB29 సినిమాతో బిజీగా ఉన్నాడు. యాక్షన్, అడ్వెంచర్‌గా పాన్ వరల్డ్ వస్తున్న ఈ సినిమా కోసం మహేష్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. కొత్తలుక్ సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. ఈ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు జక్కన్న అండ్ టీం సిద్ధమవుతుంది.