By: ABP Desam | Updated at : 04 Mar 2023 06:26 AM (IST)
Edited By: Raj
Image Credit: Twitter
ఎంత మంచి కంటెంట్ ఉన్న సినిమా అయినా, భారీ బడ్జెట్ ఖర్చు చేసి తీసిన చిత్రమైనా, దానికి సరైన టైటిల్ పెట్టడం అనేది ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఏ మూవీ అయినా ప్రేక్షకుల్లోకి వెళ్ళేది టైటిల్‌తోనే కాబట్టి. జనాల్లోకి వెళ్లిపోయిన RRR & 'ప్రాజెక్ట్ K' వంటి వర్కింగ్ టైటిల్స్ నే శీర్షికలుగా ఫిక్స్ చేశారంటే, టైటిల్ ప్రాధాన్యత ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.
అందుకే ఫిలిం మేకర్స్ బాగా ఆలోచించి తమ సినిమాలకి సరిపోయే క్యాచీ 'టైటిల్స్' ను పెట్టాలని చూస్తుంటారు. ముందుగానే పలు పేర్లను రిజిస్టర్ చేయించి పెట్టుకుంటుంటారు. కానీ ఈ రోజుల్లో ఓ సినిమాకు సరిగ్గా సూట్ అయ్యే టైటిల్ పెట్టాలంటే మేకర్స్ కు కష్టమైపోతోంది.
కొందరు సెంటిమెంట్ గా అచ్చ తెలుగు పేర్లను టైటిల్స్ గా పెట్టడానికి ఆసక్తి కనబరిస్తే.. మరికొందరు ట్రెండీ ఇంగ్లీష్ టైటిల్స్ ను, తెలుగు-ఇంగ్లీష్ కలబోసిన 'టింగ్లిష్' టైటిల్స్ ను ఖరారు చేసుకుంటున్నారు. వారిలో చాలామంది క్యాచీగా ఉండేలా రెండు మూడు అక్షరాలు ఉండేలా, చిన్న చిన్న టైటిల్స్ పెడుతున్నారు.
ఇటీవల కాలంలో 'చిన్న టైటిల్స్'తో పాన్ ఇండియా హిట్లు సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' మూవీ బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబట్టి, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
రాకింగ్ స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన KGF సీక్వెల్ చిత్రం పాన్ ఇండియా వైడ్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన 'చార్లీ'.. ఆయన సోదరుడు రిషబ్ శెట్టి చేసిన 'కాంతారా' చిత్రాలు జాతీయ స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టాయి. విశ్వనటుడు కమల్ హాసన్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన 'విక్రమ్' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ సైతం 'పఠాన్' సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.
రానున్న రోజుల్లో చిన్న టైటిల్స్ తో మరికొన్ని పెద్ద సినిమాలు ప్రేక్షకులని అలరించడానికి వస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'సలార్', 'స్పిరిట్' వంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. సూపర్ స్టార్ రజినీ కాంత్ 'జైలర్', యూత్ స్టార్ అఖిల్ అక్కినేని 'ఏజెంట్', నేచురల్ స్టార్ నాని 'దసరా' సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. బన్నీ 'పుష్ప 2', తలపతి విజయ్ 'లియో' చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. షారుఖ్ ఖాన్ 'జవాన్' , 'డుంకీ' సినిమాలు చేస్తుంటే, మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 'టైగర్' చిత్రంతో రాబోతున్నారు. మరి వీటిల్లో ఏవేవి బాక్సాఫీస్ హిట్స్ గా నిలుస్తాయో చూడాలి.
Also Read : 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?
Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్