అన్వేషించండి

SS Rajamouli: రాజమౌళి కేవలం దర్శకుడే కాదు.. నిర్మాత కూడా - జక్కన్న నిర్మించిన సినిమాలేంటో తెలుసా?

SS Rajamouli: దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఇప్పుడు నిర్మాతగానూ బిజీగా మారే ప్రయత్నం చేస్తున్నారు. తనయుడు నిర్మించే సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

SS Rajamouli: భారతదేశం గర్వించగ్గ దర్శకులలో ఎస్.ఎస్. రాజమౌళి ఒకరు. ఇప్పుడు రాజమౌళి అంటే ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్ అని చెప్పాలి. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తూ, దర్శకధీరుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పడమే కాదు, వందేళ్ల ఇండియన్ సినిమాకు ఆస్కార్ కలను సాకారం చేసిపెట్టారు. అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న జక్కన్న.. ఇప్పుడు నిర్మాతగానూ బిజీగా మారిపోబోతున్నారు. ప్రెజెంటర్ గా వ్యవహరిస్తూ, తనయుడు నిర్మించే సినిమాలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలకు ఆయన కుమారుడు కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ, అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. ఇటీవల ‘ప్రేమలు’ వంటి మలయాళ డబ్బింగ్ సినిమాతో విజయవంతంగా డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి రెండు చిత్రాల్ని నిర్మిస్తున్నారు ఎస్.ఎస్ కార్తికేయ. ఈ రెండింటిలోనూ మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీటికి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 

స్నేహం ఆధారంగా రూపొందుతోన్న ఓ సినిమాకి ‘ఆక్సిజన్‌’ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ చిత్రంతో సిద్ధార్థ్‌ నాదెళ్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అలానే ఫాంటసీ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న మరో సినిమాకి ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాతో శశాంక్‌ ఏలేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ రెండు చిత్రాలు ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ పై రూపొందనున్నాయి. ఇటీవలే ఈ సినిమాలకి సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చాయి.

నిజానికి రాజమౌళి సినిమాలు నిర్మించడం ఇదేమీ మొదటిసారి కాదు. ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక పారితోషికంతో పాటుగా సినిమా లాభాల్లో వాటా తీసుకునే జక్కన్న.. గతంలో కొన్ని చిత్రాల నిర్మాణంలో భాగం పంచుకున్నారు. ఇందులో భాగంగానే 'విశ్వామిత్ర క్రియేషన్స్' అనే బ్యానర్ స్థాపించారు. దీని కోసం హీరో ప్రభాస్ కి విశ్వామిత్రుడి గెటప్ వేసి, ఫోటో షూట్ నిర్వహించారు. డార్లింగ్ ఫోటోతో లోగో డిజైన్ చేశారు. 

మొదటి ప్రయత్నంగా 2007లో రమా రాజమౌళి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), గుణ్ణం గంగరాజు లతో కలిసి 'యమదొంగ' చిత్రాన్ని నిర్మించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ మూవీ, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. అయినప్పటికీ ఎందుకనో ఈ బ్యానర్ లో మరో సినిమా చెయ్యలేదు. అయితే ఆ తర్వాత కొన్నేళ్లకు తన సన్నిహితుడు సాయి కొర్రపాటి నిర్మించిన 'అందాల రాక్షసి' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు రాజమౌళి. 

అలానే బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, అలియా భట్, కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్రహ్మాస్త్రం' అనే హిందీ సినిమాని రాజమౌళి తెలుగులో సమర్పించారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. మళ్లీ ఇప్పుడు ‘ఆక్సిజన్‌’, ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ వంటి చిత్రాలకు అగ్ర దర్శకుడు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు జక్కన్నకు ఎలాంటి విజయాలు అందిస్తాయో చూడాలి.

ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసినట్లు దర్శకుడు తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని విషయాలు వెల్లడికానున్నాయి.

Also Read: ‘పారిజాత పర్వం’ టీజర్ - కిడ్నాప్ అనేది క్రైమ్ కాదు, ఒక ఆర్ట్.. ఏం చెప్పాలనుకుంటున్నార్రా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
CAT 2024: 'క్యాట్-2024' పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి - పరీక్ష ఎప్పుడంటే?
'క్యాట్-2024' పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి - పరీక్ష ఎప్పుడంటే?
Embed widget