Mission Impossible: యాక్షన్ మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్ - చెప్పిన డేట్ కంటే ముందుగానే మిషన్ ఇంపాజిబుల్
Mission Impossible Release Date: హాలీవుడ్ నటుడు 'టామ్ క్రూజ్' ప్రధాన పాత్రలో నటించిన 'మిషన్ ఇంపాజిబుల్'. ఈ మూవీ మే 23న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించగా తాజాగా విడుదల తేదీని మార్చారు.

Tom Cruise Mission Impossible Movie New Release Date: హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ (Tom Cruise) ప్రధాన పాత్రలో నటించిన అవెయిటెడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రెకనింగ్' (Mission Impossible: The Final Reckoning). ఈ సినిమా మే 23న రిలీజ్ చేయనున్నట్లు టీం ప్రకటించింది. తాజాగా.. విడుదల తేదీని మార్చారు.
6 రోజుల ముందుగానే..
అనుకున్న టైం కంటే 6 రోజుల ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు మూవీ టీం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మే 17న మూవీ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో క్రిస్టోఫర్ మేక్ క్వారీ ఈ మూవీని తెరకెక్కించారు.
#MissionImpossible - The Final Reckoning now releases early in India.
— Paramount India (@ParamountPicsIN) April 25, 2025
New date - 17th May.
Releasing in English, Hindi, Tamil & Telugu! pic.twitter.com/rUkNCtoEic
ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న 'మిషన్ ఇంపాజిబుల్' ఫ్రాంచైజీల్లో భాగంగా రూపొందిన 8వ చిత్రం ఇది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. మూవీలో హైలీ యాట్ఎల్, సైమన్ పెగ్, వనేసా కొర్బీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటే వాడింగ్ హామ్, నిక్ ఆఫర్ మాన్, కేటీ ఓ బ్రియాన్ వంటి కొత్త వారు కూడా ఉన్నారు.
1996లో 'మిషన్ ఇంపాజిబుల్' ఫ్రాంచైజీ ప్రారంభం కాగా.. ఈ సిరీస్‌లో చివరి చిత్రంగా రూపొందిన 'ది ఫైనల్ రికనింగ్' అత్యంత ఎక్కువ నిడివి కలిగిన మూవీగా నిలవనుంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి.






















