సలార్ ఎఫెక్ట్, వారం ముందుకు జరిగిన 'మేరీ క్రిస్మస్' - కొత్త రిలీజ్ డేట్ ఇదే!
విజయ్ సేతుపతి నటించిన 'మేరీ క్రిస్మస్' మూవీని డిసెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ దానికంటే ముందుగానే అక్టోబర్ 8న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు అగ్ర హీరోల సినిమాల్లో విలన్ గానూ మెప్పిస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్'(Jawan) సినిమాలో విలన్ గా అదరగొట్టేసారు. నిడివి తో సంబంధం లేకుండా పాత్ర నచ్చితే స్టార్ డమ్ ని పక్కనపెట్టి నటించే అతి కొద్దిమంది నటుల్లో విజయ్ సేతుపతి ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ సెట్స్ పైనే ఉండడం విశేషం.
వీటిల్లో బాలీవుడ్ లో విజయ్ సేతుపతి నటిస్తున్న మూవీ 'మేరీ క్రిస్మస్'(Merry Christamas). ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. ఇందులో విజయసేతుపతి సరసన మొదటిసారి కత్రినా కైఫ్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటించింది. బాలీవుడ్లో 'బద్లాపూర్', 'అందాదున్' వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ రిలీజ్ డేట్ ను కాస్త ముందుకు జరిపారు. దాని ప్రకారం మేరీ క్రిస్మస్ ని డిసెంబర్ 15 కంటే ఓ వారం ముందుగానే అంటే అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నారు.
KATRINA KAIF - VIJAY SETHUPATHI: ‘MERRY CHRISTMAS’ TO ARRIVE ONE WEEK EARLY... 8 Dec 2023 is the new release date of #MerryChristmas, which teams #KatrinaKaif and #VijaySethupathi for the first time.#MerryChristmas - directed by #SriramRaghavan - is shot in two languages… pic.twitter.com/GPyGmCIQMI
— taran adarsh (@taran_adarsh) October 3, 2023
ఇదే విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 8న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. మొదట అనుకున్న డేట్ కి కాకుండా అక్టోబర్ 8కి సినిమాను రిలీజ్ చేయడానికి కారణం అదే నెలలో బాలీవుడ్ టాలీవుడ్ నుంచి బడా సినిమాల రిలీజ్ లు ఉండడమే. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, 'మేరీ క్రిస్మస్' ను డిసెంబర్ 15న రిలీజ్ చేయాలని అనుకున్న మాట వాస్తవం. కానీ వారం తర్వాత అంటే డిసెంబర్ 22న బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నటించిన 'డుంకి' సినిమాతో పాటు టాలీవుడ్ లో ప్రభాస్ నటించిన 'సలార్' సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండూ పెద్ద సినిమాలు కావడంతో 'మేరీ క్రిస్మస్' కి థియేటర్స్ లో కోతపడుతుందని భావించి చిత్ర యూనిట్ ఓ వారం ముందుగానే రావాలని నిర్ణయం తీసుకున్నారు.
అలా అక్టోబర్ 8 నే 'మేరీ క్రిస్మస్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టిప్స్ ఫిలిమ్స్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై రమేష్ తురాని, జయా తురాని సంజయ్ రోటరీ, గేవాల్ గార్గ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాధిక ఆప్టే, టీను ఆనంద్, అశ్విన్ కలెష్కర్, రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా హిందీ తో పాటు తమిళంలోనూ రిలీజ్ కాబోతోంది. రిలీజ్ తర్వాత సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కాస్త ఆలస్యంగా తెలుగులో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. 'జవాన్' తర్వాత విజయ్ సేతుపతి బాలీవుడ్ లో నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై కోలీవుడ్ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read : ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కంగనా - ఆసక్తికరంగా 'తేజస్' టీజర్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial