Menaka Irani: బాలీవుడ్ దర్శకురాలు ఫరాఖాన్‌కు మాతృవియోగం
Menaka Irani: బాలీవుడ్ నటి ఫరా ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి మేనకా ఇరానీ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Menaka Irani, Farah Khan’s Mother, Passes Away In Mumbai At 79: బాలీవుడ్ నటి, కొరియోగ్రాఫర్, రైటర్, డైరెక్టర్ ఫరా ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి మేనకా ఇరానీ కన్నుమూశారు. 79 ఏళ్ల మేనకా గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆమె జులై 26న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు ధృవీకరించనప్పటికీ నేషనల్ మీడియాలో మాత్రం వార్త వైరల్ అవుతుంది. కాగా.. ఫరా ఖాన్ ఇటీవల మేనకా పుట్టిన రోజు సందర్భంగా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఎమోషనల్ పోస్ట్..
మేనకా ఇరానీ ఇటీవల తన పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫరా ఖాన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “మనం మన తల్లిని ఈజీగా తీసుకుంటాం. ముఖ్యంగా నేను. కానీ, ఈ నెల రోజుల్లో తెలిసింది నేను మా అమ్మని ఎంత ప్రేమిస్తానో అని. నేను చూసిన మహిళ్లలో కల్లా.. అమ్మ చాలా ధైర్యవంతురాలు, స్ట్రాంగ్. చాలా సర్జరీలు జరిగినా ధైర్యంగా ఉంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏ మాత్రం తగ్గలేదు. హ్యాపీ బర్త్ డే అమ్మ.. నాతో గొడవ పడేందుకు సరిపడ శక్తిని కూడగట్టుకుని ఇంటికి రా అమ్మ ఐ లవ్యూ ” అంటూ పోస్ట్ పెట్టారు ఫరా ఖాన్. అది చూసిన ఫ్యాన్స్ అంతా ఎమోషనల్ అవుతున్నారు.
View this post on Instagram
ఎన్నో కష్టాలు పడి పెరిగాం.. అమ్మ బాగా కష్టపడింది..
ఫరా ఖాన్ చాలాసార్లు తన గురించి, తన తల్లి గురించి చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చారు. తండ్రి పోయిన తర్వాత తన సోదరుడు సాజిద్, తల్లి, తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్టేజ్ కి వచ్చామని చెప్పారు. “నేను సినిమా ఫ్యామిలీకి చెందిన దాన్ని. నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు మేం చాలా చాలా పేదవాళ్లం. మా డబ్బులన్నీ పోయాయి. మా నాన్న సినిమా ఫ్లాప్ అయ్యింది. మా ఫ్యామిలీ అంతా బాగా ఉన్నప్పుడు మేం మాత్రం ఇబ్బందులు పడ్డాం. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మని, సాజిద్‌ను, నన్ను మా చుట్టాలు ఆదుకున్నారు. అలా మేం కష్టాలు పడి పైకి వచ్చాం” వాళ్లు పడ్డ కష్టాలను రేడియో నషా ప్రోగ్రామ్ లో షేర్ చేసుకున్నారు ఫరా ఖాన్. ఇప్పుడు అభిమానులు వాళ్ల కష్టాలను గుర్తు చేసుకుంటున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. ఫరా ఖాన్ పిన్ని డైసీ ఇరానీ కూడా బాలీవుడ్ లో మంచి యాక్టర్. ఆమె తన కెరీర్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రారంభించారు. ‘నయా డౌర్’, ‘హ్యాపీ న్యూయర్’, ‘బందీష్’, ‘క్యా కెహన్నా’ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఫరా ఖాన్ తల్లి కూడా కొన్నిసినిమాల్లో నటించారు.