Meenakshi Chaudhary: పవన్ కళ్యాణ్‌పై బయోపిక్... టైటిల్ ఫిక్స్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' హీరోయిన్ మీనాక్షి చౌదరి
Pawan Kalyan Biopic: పవన్ కళ్యాణ్ పై బయోపిక్ బుక్ గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది 'సంక్రాంతికి వస్తున్నాం' హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈ బుక్ కు టైటిల్ కూడా ఫిక్స్ చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటేనే ఒక సునామీ. కోట్లాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆయన నెక్స్ట్ సినిమా గురించి అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఓ స్టార్ హీరోయిన్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై బయోపిక్ బుక్ రాయడం గురించి మాట్లాడడమే కాకుండా, ఏకంగా దానికి టైటిల్ కూడా పెట్టేసింది.
పవన్ కళ్యాణ్ బయోపిక్ టైటిల్ ఇదే
హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి టాలీవుడ్ మూవీ లవర్స్ కి పెద్దగా పరిచయం అక్కరలేదు. ఈ బ్యూటీ ఇప్పటిదాకా 'గుంటూరు కారం' వంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ తాజాగా 'సంక్రాంతి వస్తున్నాం' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది మీనాక్షి చౌదరి. 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. సదరు ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరిని ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు.
"ఒకవేళ మీరు గనక పవన్ కళ్యాణ్ బయోపిక్ ని రాస్తే టైటిల్ ఏం పెడతారు?" అని మీనాక్షిని అడిగారు. ఆ ప్రశ్నకు మీనాక్షి చౌదరి స్పందిస్తూ "ద గ్లాస్ ఈజ్ ఆల్వేస్ హాఫ్ ఫుల్... ఎందుకంటే పవన్ కళ్యాణ్ లోగో గ్లాస్ కదా... కాబట్టి నేను గ్లాస్ పెడతాను. ఆయనకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఆయన పొలిటికల్ జర్నీ ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. 2 టర్మ్స్ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. అయినా ఎప్పుడు నిరాశ చెందలేదు. కాబట్టి నెవర్ గివ్ అప్ అనేదానికి ఆయన ఇన్స్పిరేషన్. మీరు నమ్మేదాన్ని ఫాలో అవ్వాలి అనడానికి ఆయనే నిదర్శనం" అంటూ పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. దీంతో మెగా అభిమానులు ప్రస్తుతం ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ, వైరల్ చేసే పనిలో పడ్డారు.
If @Meenakshiioffl writes @PawanKalyan's biopic title is “ The Glass is Always Half Full ”#SankranthikiVasthunam#PawanKalyanpic.twitter.com/evyCDHScxP
— Milagro Movies (@MilagroMovies) January 21, 2025
Also Read: అఖిల్ అక్కినేని పెళ్లికి ముహూర్తం ఫిక్స్... వెడ్డింగ్ డేట్, వెన్యూ వివరాలు తెలుసా?
200 కోట్ల క్లబ్లో సంక్రాంతికి వస్తున్నాం...
2025 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేష్ హీరోగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' వంటి సినిమాలను పక్కకు నెట్టి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అతి తక్కువ సమయంలోనే ఈ మూవీ 100 కోట్ల షేర్ ను రాబట్టి రికార్డును క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ థియేటర్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. కలెక్షన్ల పరంగా 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర బృందం అఫీషియల్ గా వెల్లడించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో వెంకటేష్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారు. అలాగే ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కెరీర్ కి కూడా ఈ మూవీ హిట్ టాలీవుడ్ లో మంచి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

