'ఇండియాస్ గాట్ టాలెంట్' షోలో మాస్ మహారాజా - అక్కడా అదే ఎనర్జీ!
'టైగర్ నాగేశ్వరరావు' ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ తాజాగా ఇండియాలోనే అతిపెద్ద రియాల్టీ షో గా పేరొందిన 'ఇండియన్ గాట్' టాలెంట్ షోలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఓ సినిమా జనాలకు బాగా రీచ్ అవ్వాలంటే ప్రమోషన్స్ సరిగ్గా చేయాలి. సినిమా తీయడం ఒకెత్తు అయితే దాన్ని ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. సినిమాలో కంటెంట్ ఉన్నా దానికి సరైన ప్రమోషన్స్ లేకపోతే సినిమాపై బజ్ క్రియేట్ అవ్వదు. ఇక పాన్ ఇండియా సినిమాలకైతే ప్రమోషన్స్ కచ్చితంగా అవసరం. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రమోషన్ చేస్తే అక్కడ కూడా సినిమాకి మంచి ఆదరణ దక్కుతుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాని తూచా తప్పకుండా పాటిస్తున్నారు మాస్ మహారాజ రవితేజ. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని వంశీ కృష్ణ ఆకెళ్ళ డైరెక్ట్ చేశారు.
పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. గత కొద్ది రోజులుగా నార్త్ లో ఈ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి. ముఖ్యంగా రవితేజ ఈ మూవీ ప్రమోషన్స్ ని తన భుజాలపై వేసుకొని చేస్తున్నారు. అటు నిర్మాతలు కూడా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సినిమాలో నటించిన హీరోయిన్స్ రవితేజతో కలిసి ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
ఇప్పటివరకు మరే హీరో చేయని స్థాయిలో టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ ని నార్త్ లో రవితేజ చేస్తుండడం విశేషం. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ తో పాటు కొన్ని బాలీవుడ్ టెలివిజన్ షోలలో కూడా రవితేజ సందడి చేస్తున్నారు. రీసెంట్ గా ప్రమోషన్స్ లో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లకి కామెంటేటర్ గా కూడా మారిపోయారు. తెలుగు హీరోల్లో ఇలా క్రికెట్ మ్యాచ్ లలో ప్రమోషన్స్ చేసిన మొదటి హీరోగా రవితేజ నిలిచారు. ఇక ఇప్పుడు ఇండియాలోనే అతిపెద్ద రియాలిటీ షో గా పేరొందిన ఇండియన్ గాట్ టాలెంట్ షోలో రవితేజ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందులో రవితేజ హిందీలో మాట్లాడి ఆకట్టుకున్నారు. తనదైన స్టైల్ లో హీరోయిన్స్ తో డాన్స్ చేశారు. అలాగే పలువురు చిన్నారులతో కలిసి రవితేజ చేసిన డాన్స్ కూడా వైరల్ అవుతుంది. మొత్తం మీద నార్త్ లో ఫేమస్ అయిన ప్రతి ఒక్క స్టేజ్ ని వదలకుండా రవితేజ టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ ను చేస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ ఉంది. ఈ మూవీ తో పాటు దసరా బరిలో 'లియో', 'భగవంత్ కేసరి' లాంటి రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో రవితేజ కి 'టైగర్ నాగేశ్వరావు' ఎలాంటి రిజల్ట్ అందిస్తుంది అనేది చూడాలి. ఒకవేళ ఈ మూవీ కనుక సూపర్ హిట్ అయితే రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.
Also Read : నేను ప్రభాస్‌తో చేయబోయే సినిమా అందులో భాగం కాదు - లోకేష్ కనగరాజ్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial