Manchu Vishnu : మోహన్‌బాబును ప్రభుత్వం ఆహ్వానించినా అడ్డుకున్నారు - జగన్‌తో భేటీ తర్వాత మంచు విష్ణు ఆరోపణలు !
మోహన్ బాబుకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానాన్ని ఇవ్వలేదని మంచు విష్ణు ఆరోపించారు. సీఎం జగన్‌తో భేటీ తర్వాత ఆయనీ ఆరోపణలు చేశారు.
విశాఖలో సినిమా స్టూడియోలు నిర్మించడానికి స్థలాలను సీఎం జగన్ సినీ ప్రముఖులకు ఆఫర్ చేశారు. అయితే మంచు విష్ణు ( Manchu Vishnu ) సీఎం జగన్‌తో భేటీ తర్వాత తిరుపతిలో తమ కుటుంబం తరపున స్టూడియో ( Film Studio ) నిర్మిస్తామని ప్రకటించారు. సినీ ప్రముఖులతో సీఎంజగన్ నిర్వహించిన సమావేశానికి మోహన్ బాబును పిలువలేదని ప్రచారం జరుగుతోదంని కానీ అది నిజం కాదని విష్ణు స్పష్టం చేశారు. మోహన్‌బాబు ( Mohan babu ( సహా చాలా పెద్ద హీరోలకు ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం మోహన్‌బాబుకు అందించలేదు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్‌లో ( Film Chamber ) మాట్లాడతాం. ఆ ఆహ్వానం అందకుండా ఎవరు చేశారో తెలుసు. కానీ ఆ విషయం మేమ్ ఇంటర్నల్‌గా మాట్లాడుకుంటామని మంచు విష్ణు తెలిపారు.
Had lunch with @ysjagan anna. His knowledge on various subjects is just brilliant. 💪🏽
— Vishnu Manchu (@iVishnuManchu) February 15, 2022
సినీ పరిశ్రమలో ( Tollywood ) విభేధాలు ఉన్నాయని విష్ణు అంగీకరించారు. సీఎం జగన్‌తో భేటీ తర్వాత విష్ణు మీడియాతో మాట్లాడారు. తాను సినీ పరిశ్రమ తరపున లేదా హీరోగా మాట్లాడటానికి రాలేదని కేవలం వ్యక్తిగత హోదాలోనే మాట్లాడటానికి వచ్చానని స్పష్టం చేశారు. సీఎం జగన్‌తో ( CM Jagan ) అనేక అంశాలపై చర్చించానన్నారు. అయితే ఆ విషయాలన్నీ తాను వెల్లడించబోనన్నారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడనని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు సంబంధించి తాను మాట్లాడిన విషయాలు వేరే వేదికపై మాట్లాడతానని క్లారిటీ ఇచ్చారు.
తెలుగు ఇండస్ట్రీలో సపోర్ట్ లేకపోతే మా అధ్యక్షుడిగా ఎలా గెలుస్తానని ప్రశ్నించారు. నాపై పోటీ చేసిన వారిని చిత్తు చిత్తుగా ఓడించి.. వాళ్లకు సపోర్ట్ చేసిన వారికి జవాబు చెప్పానన్నారు. సపోర్ట్ ఎవరికి ఉందో తెలుస్తోందని... కానీ మేమంతా ఒక ఫ్యామిలీ అని అన్నారు. సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటాంమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కళ్లని మంచు విష్ణు స్పష్టం చేశారు. వైజాగ్‌లో ( Vizag ) మాకు అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిందిని.. ఫిల్మ్‌ఛాంబర్‌తో మాట్లాడి ఎప్పుడు షిప్టు అవ్వాలో నిర్ణయించుకుంటామని మంచు విష్ణు ప్రకటించారు.
ఇటివల పేర్ని నాని ( Perni Nani ) మోహన్ బాబు ఇంటికి వచ్చిన తర్వాత విష్ణు చేసిన ట్వీట్ వివాదాస్పదమయింది. ఈ క్రమంలో పేర్ని నాని ఖండించడంతో ట్వీట్‌ను డిలీట్ చేయాల్సి వచ్చింది. ఈ అంశం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిన సందర్భంలో సీఎం జగన్‌తో విష్ణు సుదీర్ఘంగా భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది.