Manchu Manoj: తన AV చూసి మంచు మనోజ్ కన్నీళ్లు - బాబాయ్‌కు ఏది ఏమైనా అండగా ఉంటానంటూ నారా రోహిత్ పోస్ట్
Nara Rohith: 'భైరవం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తన ఏవీ చూసి ఎమోషనల్‌కు గురైన మంచు మనోజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో పక్కనే ఉన్న దర్శకుడు ఆయన్ను ఓదార్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Manchu Manoj Emotional While Watching His AV: టాలీవుడ్ యంగ్ హీరోస్ మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'భైరవం'. విజయ్ కనకమేడల ఈ మూవీని తెరకెక్కించగా.. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యారు.
AV చూస్తూ..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్‌కు మూవీ జర్నీకి సంబంధించిన స్పెషల్ వీడియోను ప్లే చేశారు. దీన్ని చూసిన మనోజ్ ఎమోషనల్‌కు గురయ్యారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆయన ఈ మూవీతో ముందుకొస్తున్నారు. ఇటీవల మంచు ఫ్యామిలీలో వివాదాలతో కాస్త ఇబ్బందులకు గురి కాగా.. అన్నింటినీ తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే ఉన్న దర్శకుడు, నారా రోహిత్ మనోజ్‌ను ఓదార్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Rocking Star @HeroManoj1 turns emotional watching his AV at the #BhairavamTrailer launch event.
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) May 18, 2025
Watch live now 🔥
▶️ https://t.co/4nI7V8Ca5n #BHAIRAVAM IN CINEMAS WORLDWIDE ON MAY 30th 🔱 pic.twitter.com/1NGdwoPSPI
బాబాయ్‌కు ఏది ఏమైనా అండగా ఉంటా
ఈ సందర్భంగా మంచు మనోజ్‌ను ఉద్దేశించి నారా రోహిత్ పోస్ట్ పెట్టారు. ఏది ఏమైనా బాబాయ్‌కు అండగా ఉంటానంటూ పేర్కొన్నారు. ''భైరవం' ఈవెంట్‌ను ఎంతో స్పెషల్‌గా మార్చిన ఏలూరు ప్రజలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచు మనోజ్ బాబాయ్ ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచారు. ఆయన స్పీచ్ ఎంతో పవర్ ఫుల్, ఎమోషనల్, మనసుకు హత్తుకునేలా ఉంది. విషయం ఏదైనా నేను నీకు తోడుగా ఉంటాను బాబాయ్. ఐ లవ్ యూ' అంటూ రోహిత్ చెప్పారు.
ఈ సినిమా తన కెరీర్‌లోనే ఎంతో స్పెషల్ అని.. దర్శకుడు విజయ్ కనకమేడల అనే సరికి తనకు ఓ నమ్మకం వచ్చిందని నారా రోహిత్ అన్నారు. 'ఉగ్రం, నాంది చిత్రాలను విజయ్ అద్భుతంగా తెరకెక్కించారు. మనోజ్‌తో నాది చాలా స్పెషల్ జర్నీ. చిన్నప్పటి నుంచి మాకు పరిచయం ఉంది. మేము చాలా క్లోజ్. ఈ సినిమాతో మా బంధం మరింత పెరిగింది. నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రం భైరవం.' అని రోహిత్ తెలిపారు.
ఎప్పటికీ మోహన్ బాబు కుమారుడినే..
ఈవెంట్‌లో మంచు మనోజ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఇటీవల ఎన్నో జరిగాయని.. తనను కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబెట్టారని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ టైంలో ఫ్యాన్స్ తనకు అండగా నిలిచారని.. సపోర్ట్ చేసిన ఫ్యాన్స్, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తన కట్టె కాలే వరకూ మోహన్ బాబు కుమారుడినేనని.. చిన్నప్పటి నుంచి నీతి, న్యాయం వైపు నిలబడాలని నూరి పోసి పెంచారని.. ఇప్పుడు అదే పని చేస్తుంటే తప్పంటున్నారని చెప్పారు.






















