Upcoming Telugu Movies: హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా నుంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ వరకూ.. - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో మూవీస్ లిస్ట్
Latest Telugu Movies: ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు ఈ వారం కూడా కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. హిస్టారికల్ యాక్షన్ మూవీస్ నుంచి రొమాంటిక్ కామెడీ మూవీస్ వరకూ రిలీజ్ కాబోతున్నాయి.

Upcoming Telugu Movies OTT Releases In May Fourth Week 2025: ప్రతీ వారంలానే ఈ వారం కూడా పలు కొత్త మూవీస్ థియేటర్స్, ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా నుంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ వరకూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే..
అక్షయ్ కుమార్ 'కేసరి చాప్టర్ 2'
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా 'కేసరి చాప్టర్ 2'. ఇటీవల హిందీలో విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ తెలుగులోనూ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 23న సురేశ్ ప్రొడక్షన్స్ ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించగా.. ఆర్.మాధవన్, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ, అనంతర పరిణామాల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.
విజయ్ సేతుపతి 'ఏస్'
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఏస్'. ఈ రొమాంటిక్ క్రైమ్ కామెడీ మూవీని అర్ముగ కుమార్ దర్శకత్వం తెరకెక్కించగా.. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. తమిళంతో పాటు తెలుగులో ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు.
కొత్త యాక్టర్స్‌తో
కొత్త యాక్టర్స్ రుత్విక్, ఇక్రా ఇద్రిసి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'వైభవం'. ఈ మూవీతోనే సాత్విక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
భూల్ చుక్ మాఫ్
బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'భూల్ చుక్ మాఫ్'. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ నెల 9న రిలీజ్ కావాల్సిన మూవీని 16న నేరుగా 'అమెజాన్ ప్రైమ్' ఓటీటీలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే, ఆ తర్వాత మళ్లీ పరిస్థితులు సద్దుమణిగాయని ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.
కేసరి వీర్
సునీల్ శెట్టి, సూరజ్ పాంచోలి, వివేక్ ఒబెరాయ్, ఆకాంక్ష శర్మ కీలక పాత్రల్లో నటించిన హిస్టారికల్ యాక్షన్ మూవీ 'కేసరి వీర్'. ఈ నెల 16న రిలీజ్ కావాల్సిన మూవీ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీల్లోకి వచ్చే మూవీస్/వెబ్ సిరీస్‌లు
- అమెజాన్ ప్రైమ్ వీడియో - మోటార్ హెడ్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్ - మే 20), డయానే వారెన్ (ఇంగ్లిష్ మూవీ - మే 20), ది లెజెండ్ ఆఫ్ ఓచి (ఇంగ్లిష్ మూవీ - మే 20), ది ట్రబుల్ విత్ జెస్సికా (ఇంగ్లిష్ మూవీ - మే 20), వెర్మిగ్లియో (ఇంగ్లిష్ మూవీ - మే 20), అభిలాషం (మలయాళం మూవీ - మే 23), చీచ్ అండ్ చాంగ్ లాస్ట్ (ఇంగ్లిష్ మూవీ - మే 23).
- నెట్ ఫ్లిక్స్ - కేర్ బియర్స్ (ఇంగ్లిష్ మూవీ - మే 19), స్నీకీ లింక్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్ - మే 21), రియల్ మెన్ (ఇటాలియన్ సిరీస్ - మే 21), ఫియర్ స్ట్రీట్ (ఇంగ్లిష్ మూవీ - మే 22), సైరెన్స్ (ఇంగ్లిష్ సిరీస్ - మే 22), స్కేర్ క్రో (మే 22), హ్యామీ మండేస్ (మే 22), ఎయిర్ ఫోర్స్ ఎలైట్ (ఇంగ్లిష్ మూవీ - మే 23), ఫర్ గాట్ యూ నాట్ (చైనీస్ సిరీస్ - మే 23)
- జియో హాట్ స్టార్ - ల్యాండ్ మ్యాన్ (వెబ్ సిరీస్ - మే 21), హార్ట్ బీట్ 2 (తెలుగు సిరీస్ - మే 22), ఫైండ్ ది ఫర్జీ (హిందీ రియాల్టీ షో - మే 23)
- ఈటీవీ విన్ - కథాసుధ - కాలింగ్ బెల్, నాతి చరామి






















