Mana Shankara Vara Prasad Garu Release Date: వరప్రసాద్ గారు రిలీజ్ డేట్ చెప్పేశారు... సంక్రాంతి లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన చిరంజీవి!
MSG Movie Release Date: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సంక్రాంతి బరిలో ఎప్పుడు వస్తుందో చెప్పేశారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకుడిగా వరుస విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) రూపొందిస్తున్న కుటుంబ కథా చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu Movie) సంక్రాంతి బరిలో ఈ సినిమా విడుదల కానున్నట్లు గతంలో చెప్పారు. ఇవాళ విడుదల తేదీని వెల్లడించారు.
జనవరి 12న వరప్రసాద్ గారు వస్తారు!
Mana Shankara Vara Prasad Garu Release Date: జనవరి 12వ తేదీన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు. సంక్రాంతి పండక్కి రెండు రోజుల ముందు థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమాను సోమవారం విడుదల చేస్తున్నారు. దీని వల్ల ఏడు రోజుల లాంగ్ వీకెండ్ వస్తుంది. పండగ సీజన్ ఫుల్ క్యాష్ చేసుకోవడానికి చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదల ప్లాన్ చేస్తున్నట్టు అర్థం అవుతుంది.
View this post on Instagram
Sankranti 2026 Telugu movies release dates: సంక్రాంతి బరిలో ఐదారు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో మొదటి సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న 'ది రాజా సాబ్'. జనవరి 9న ఆ హారర్ ఎంటర్టైనర్ థియేటర్లలోకి రానుంది. అదే రోజున దళపతి విజయ్ హీరోగా రూపొందుతున్న 'జన నాయకుడు' కూడా విడుదల కానుంది. జనవరి 12న చిరు సినిమా వస్తుంది. ఇక జనవరి 14వ తేదీన నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి', శివ కార్తికేయన్ 'పరాశక్తి' విడుదల కానున్నాయి. మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సైతం సంక్రాంతి బరిలో దిగుతుంది. దాని విడుదల తేదీ ఇంకా అనౌన్స్ చేయలేదు.
వెంకటేష్ బర్త్ డే స్పెషల్ లుక్ రిలీజ్!
డిసెంబర్ 13వ తేదీన వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు చెప్పింది. అలాగే సినిమాలో లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్యారెక్టర్ వెంకీ చేస్తే బాగుంటుందని స్వయంగా చిరంజీవి గారు సలహా ఇచ్చినట్లు అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
View this post on Instagram
చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో కేథరిన్ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. మురళీధర్ గౌడ్, వీటివి గణేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు వస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.
Also Read: Akhanda 2 Movie Review - 'అఖండ 2' రివ్యూ: బాలకృష్ణ రుద్రతాండవం - బోయపాటి శ్రీను ఎలా తీశారంటే?




















