Malaika Arora - Arjun Kapoor : మలైకా, అర్జున్ కపూర్ బ్రేకప్ - డిఫరెంట్ పోస్టులతో క్లారిటీ ఇస్తున్న జంట
Malaika Arora - Arjun Kapoor: బాలీవుడ్ కపుల్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోయారంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో వీరిద్దరూ కాస్త డిఫరెంట్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను షేర్ చేశారు.
Malaika Arora - Arjun Kapoor Breakup: మామూలుగా సినీ సెలబ్రిటీల్లో విడాకులు, బ్రేకప్ అనేవి కామన్ అని అంటుంటారు. అది పూర్తి నిజం కాదని ప్రూవ్ చేసే జంటలు ఉన్నా కూడా విడిపోతూ అది నిజమే అని ప్రూవ్ చేసే జంటలే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఆ లిస్ట్‌లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ కూడా చేరారు. ఈ ఇద్దరికీ పెళ్లి అవ్వకపోయినా చాలా ఏళ్లుగా డేటింగ్‌లో ఉంది ఈ జంట. ఇక త్వరలోనే మలైకా, అర్జున్ పెళ్లి పీటలెక్కనున్నారని కూడా పలుమార్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంతలోనే వీరిద్దరి బ్రేకప్ గురించి బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతలో వీరిద్దరూ ఇన్‌డైరెక్ట్ పోస్టులతో బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చినట్టుగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు..
మలైకా అరోరా, అర్జున్ కపూర్ డేటింగ్‌లో ఉన్నంతకాలం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఎప్పటికప్పుడు వీరిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు, ఏయే దేశాలను చుట్టేస్తున్నారు లాంటి వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటూ ఉండేవారు. ఇక బ్రేకప్ విషయాన్ని ఓపెన్‌గా సోషల్ మీడియాలో అనౌన్స్ చేయకూడదు అనుకున్నారో ఏమో.. ఇన్‌డైరెక్ట్‌గా తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో డిఫరెంట్ కోట్స్‌ను షేర్ చేశారు. ముందుగా మలైకా అరోరా.. తన ఫాలోవర్స్‌కు గుడ్ మార్నింగ్ చెప్తూ.. ఒక డిఫరెంట్ కోట్‌ను షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్.. అర్జున్ కపూర్‌తో బ్రేకప్‌కు సంబంధించిందే అని ఫాలోవర్స్ చర్చించుకుంటున్నారు.
అలాంటివాళ్లు కొందరే..
‘‘ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద వరం ఏంటంటే మనల్ని ప్రేమిస్తూ సపోర్ట్ చేసే మనుషులు మనతో ఉండడం. వాళ్లని కొనలేము, వాళ్ల స్థానంలోకి వేరేవాళ్లను తీసుకురాలేము. అందరి జీవితంలో అలాంటివాళ్లు కొందరే ఉంటారు’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసింది మలైకా అరోరా. మలైకా 1998లోనే సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్లిద్దరికీ 2002లో అర్హాన్ ఖాన్ అనే కుమారుడు కూడా పుట్టాడు. 2017లో అర్బాజ్‌తో విడిపోయిన తర్వాత అర్జున్‌తో డేటింగ్ ప్రారంభించింది ఈ సీనియర్ బ్యూటీ. మరోవైపు అర్జున్ కూడా బ్రేకప్ రూమర్స్‌పై ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇన్‌డైరెక్ట్‌గా స్పందించాడు.
రెండే ఛాయిస్‌లు..
‘‘మనకు జీవితంలో రెండే ఛాయిస్‌లు ఉంటాయి. మనం మన గతానికి బంధీలుగా ఉండవచ్చు లేదా భవిష్యత్తులో ఎదురయ్యే అవకాశాలను అందుకోవచ్చు’’ అంటూ అర్జున్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. అర్జున్ షేర్ చేసిన ఈ స్టోరీ చూస్తుంటే మలైకా స్టోరీకి ఇన్‌డైరెక్ట్‌గా రిప్లై ఇచ్చినట్టుగా ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. మలైకా అరోరా, అర్జున్ కపూర్ మధ్య 12 ఏళ్ల తేడా ఉంది. పైగా మలైకాకు ఒకసారి పెళ్లయ్యి విడాకులు కూడా అయ్యింది. అయినా కూడా వీరిద్దరూ రిలేషన్‌లో అవేమీ అడ్డు రాలేదు. ఈ విషయంలో వారిని ఎవరైనా ట్రోల్ చేసినా గట్టిగానే సమాధానం ఇచ్చేవారు. అలాంటిది ఇప్పుడు వీరి బ్రేకప్‌కు కారణం ఏమిటోనని బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.
Also Read: బాలీవుడ్‌లో మరో బ్రేకప్ - ఐదేళ్ల బంధానికి ముగింపు పలికిన మలైకా, అర్జున్..!