అన్వేషించండి

Mahesh Babu: ముందే ఫిక్స్ అయ్యా, చివరి సినిమా ఇదే కావచ్చు - మహేశ్ బాబు

Mahesh Babu: ‘గుంటూరు కారం’తో మహేశ్ బాబు డ్యాన్స్ మామూలుగా లేదని ఫ్యాన్స్ అంటున్నారు. థియేటర్లలో మహేశ్ వేసిన ప్రతీ స్టెప్‌ను ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేశారు. తాజాగా దీనిపై హీరో స్పందించారు.

Mahesh Babu: మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’కు ఆడియన్స్ దగ్గర నుంచి మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి. కానీ చూసిన ప్రేక్షకులంతా కలిసికట్టుగా మహేశ్ బాబు వన్ మ్యాన్ షో అని, డ్యాన్స్ విషయంలో బాబు విశ్వరూపం చూపించాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేశ్ బాబు నటించిన దాదాపు ప్రతీ కమర్షియల్ సినిమాలో ఒక డ్యాన్స్ నెంబర్ ఉన్నా కూడా.. సూపర్ స్టార్ ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేయడం మొదటిసారి అని అంటున్నారు. ఇక తన డ్యాన్స్‌కు వస్తున్న ప్రశంసలపై మహేశ్ మొదటిసారి స్పందించారు. అంతే కాకుండా శ్రీలీలతో డ్యాన్స్ చేసిన ఎక్స్‌పీరియన్ ఎలా ఉందో కూడా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.

బాగా చేయాలి అనుకున్నాం

‘‘నేను, త్రివిక్రమ్ ముందు నుంచి ఒకటి అనుకున్నాం. ఈ సినిమాలో రెండు, మూడు పాటలు అయితే చాలా బాగా చేయాలి అని ఫస్ట్ నుంచే ఫిక్స్ అయ్యాం. దీని తర్వాత ఎప్పుడు రెగ్యులర్‌గా సినిమాకు పాటలు చేస్తామో తెలియదు. నేను డ్యాన్స్ నెంబర్స్ చేసే చివరి సినిమా ఇదే అవ్వొచ్చు. రెగ్యులర్‌గా సినిమాకు పాటలు మళ్లీ ఇలా వస్తాయో లేదో తెలియదు. అందుకే దీనికోసం నేను మనస్ఫూర్తిగా ప్రయత్నించాలని అనుకున్నాను. రెండు పాటలు అయితే చాలా బాగా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ముందుగా ఇంట్రడక్షన్ సాంగ్ గురించి శేఖర్ మాస్టర్‌తో డిస్కషన్ చేశాం. రీహార్సెల్స్ చేశాం. చాలా బాగా వచ్చింది’’ అంటూ డ్యాన్స్ గురించి తను ముందే ఫిక్స్ అయిన విషయాన్ని బయటపెట్టారు మహేశ్ బాబు.

టెన్షన్ వచ్చేసింది

‘గుంటూరు కారం’లో ఉన్న రెగ్యులర్ పాటల్లో మాత్రమే కాకుండా ‘నెక్లెస్ గొలుసు’ అనే బిట్ సాంగ్‌లో కూడా మహేశ్ బాబు డ్యాన్స్ ఇరగదీశారు. దానిపై కూడా ఈ హీరో స్పందించారు. ‘‘నెక్లెస్ గొలుసు ముందే చేశాం. అది ఎలా చేస్తానా అని అప్పటివరకు ఒక ఆలోచన ఉంది. ఈ అమ్మాయితో నెక్లెస్ గొలుసు ఎలా చేయాలి, ఏంటి అనుకున్నాను. నేను, త్రివిక్రమ్.. ఇలా ఒక ఐటెమ్ అయితే ఉండాలని అనేసుకున్నాం. చెప్పవే చిరుగాలి సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత అమమాయి డ్యాన్స్ చేస్తుంది, దాని దగ్గర నుంచి నెక్లెస్ గొలుసుకు వెళ్తుంది. అమ్మాయి వచ్చి చేసేస్తాను అంది. ఫైనల్‌గా షూటింగ్‌కు వచ్చాక ఈ అమ్మాయితో ఎలా చేయాలి అని టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ అంటే అసలు ఎలా ముందుకు వెళ్తాం అని’’ అంటూ నెక్లెస్ గొలుసు షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకున్నారు మహేశ్.

కలెక్షన్స్ విషయంలో జోరు

జనవరి 12న ‘గుంటూరు కారం’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్, మహేశ్ బాబు హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కానీ మూవీ మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. టాక్ ఎలా ఉన్నా.. ‘గుంటూరు కారం’ కలెక్షన్స్ మాత్రం ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేశాయి. మహేశ్ డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్.. అన్నీ ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇస్తున్నాయి. ఇక ‘గుంటూరు కారం’ అయిపోవడంతో తరువాత.. రాజమౌళి సినిమాపై ఫోకస్ చేయనున్నారు మహేశ్. అందులో తమ ఫేవరెట్ హీరో ఏ లుక్‌తో కనిపిస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: నేను స్మోక్ చేయను, నేను కాల్చింది బీడీ కాదు.. దానికో ప్రత్యేకత ఉంది - మహేశ్ బాబు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
Embed widget