By: ABP Desam | Updated at : 20 Apr 2022 12:52 PM (IST)
'సర్కారు వారి పాట'లో మహేష్ బాబు
Sarkaru Vaari Paata Update: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata Movie) విడుదలకు మరో మూడు వారాలు మాత్రమే టైమ్ ఉంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి, ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారు? సాంగ్స్ ఎప్పుడు విడుదల చేస్తారు? అని అప్‌డేట్స్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ (SSMB Fans) వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక గుడ్ న్యూస్.
Sarkaru Vaari Paata Trailer On May 1st Week: మే తొలి వారంలో 'సర్కారు వారి పాట' ట్రైలర్ విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ తెలియజేసింది. సినిమాలో రెండు పాటలు 'కళావతి', 'పెన్నీ' విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడో సాంగ్ గురించి ఈ రోజు రాత్రి లోపు అప్‌డేట్ (Sarkaru Vaari Paata Thrid Single Update) ఇస్తామని తెలిపారు. సో... సూపర్ స్టార్ ఫ్యాన్స్ సందడి చేయడానికి రెడీ అయిపోవచ్చు.
Yes.
— Mythri Movie Makers (@MythriOfficial) April 20, 2022
Update by Today night.
— Mythri Movie Makers (@MythriOfficial) April 20, 2022
Producer Ravi Shankar on Mahesh Babu's Sarkaru Vaari Paata: 'అంటే సుందరానికి' టీజర్ విడుదల కార్యక్రమంలో 'సర్కారు వారి పాట' సినిమా గురించి మాట్లాడిన నిర్మాత రవిశంకర్ "మే 12న 'సర్కారు వారి పాట'తో వస్తున్నాం. చాలా పెద్ద హిట్ కొడుతున్నాం. ఏమాత్రం తగ్గదు" అని చెప్పారు.
Also Read: అంటే నాని నవ్వించాడు, నజ్రియాతో పులిహోర కలిపాడు! 'అంటే సుందరానికి' టీజర్ చూశారా?
మహేష్ బాబు సరసన కీర్తీ సురేష్ (Keerthy Suresh) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. ఈ సినిమాకు ఎస్. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు.
Also Read: మంగళ సూత్రం ఏది? నుదుట సింధూరం ఎక్కడ? - ఆలియాపై ట్రోలింగ్ షురూ
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Mythri Movie Makers (@mythriofficial)
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్‌డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
Stock Market News: శుక్రవారం డబ్బుల వర్షం! రూ.5.5 లక్షల కోట్లు ఆర్జించిన ఇన్వెస్టర్లు, సెన్సెక్స్ 1163+
CM KCR Tour : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ గురి, నేటి నుంచి వరుస పర్యటనలు
Nikhat Zareen Profile: ఓవర్నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్ది 12 ఏళ్ల శ్రమ!
Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి