Sarkaru Vaari Paata Title Song: వెపన్స్ లేని వేట, 'సర్కారు వారి పాట' , హీరో క్యారెక్టర్ చెప్పే పాట
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ నేడు విడుదల చేశారు.
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'సర్కారు వారి పాట'. ఈ రోజు టైటిల్ సాంగ్ విడుదల చేశారు. ఆల్రెడీ విడుదలైన టీజర్‌లో థీమ్ మ్యూజిక్‌గా వినిపించిన సంగీతం ఈ పాట లోనిదే. ఆల్రెడీ 'సర్కారు వారి పాట' నుంచి 'కళావతి...', 'పెన్నీ...' సాంగ్స్ విడుదల అయ్యాయి. వాటితో పోలిస్తే... టైటిల్ సాంగ్ ఫుల్ మాసీగా, కమర్షియల్ ఫ్లేవర్‌లో సాగింది.
'అల్లూరి వారి బేటా, వెపన్స్ లేని వేట, మాడు పగులునట...' అంటూ అనంత శ్రీరామ్ రైమింగ్ లో లిరిక్స్ రాశారు. హారికా నారాయణ్ సాంగ్ పాడారు. ఎస్. తమన్ సంగీతం అందించారు. హీరో క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ చెప్పే విధంగా ఈ పాటను రూపొందించారు.
Also Read: తల్లి కాబోతున్న సునీత? ఇన్ డైరెక్టుగా హింట్ ఇచ్చారా?
ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తీ సురేష్, డ్యాన్సర్లపై చిత్రీకరించిన పాటతో షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మే 12న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు.
Also Read: సివిల్ కోర్టు జడ్జ్ మీద కేసుకు వర్మ రెడీ - ఆర్జీవీ వర్సెస్ నట్టి కుమార్ గొడవలో కొత్త ట్విస్ట్
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.