Mahesh Babu Reviews Bheemla Nayak: పవన్ కల్యాణ్ - 'భీమ్లా నాయక్'పై మహేష్ ప్రశంసల జల్లు
సూపర్ స్టార్ మహేష్ బాబుకు 'భీమ్లా నాయక్' సినిమా నచ్చింది. ఆయన సినిమా చూడటంతో పాటు హీరోలపై ప్రశంసల జల్లు కురిపించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు పబ్లిక్‌లో పెద్దగా కలిసినట్టు కనిపించరు. కానీ, ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ' భీమ్లా నాయక్' సినిమా విడుదల అయిన సందర్భంగా అది మరోసారి బయట పడింది. పవన్ మీద, ఆయనతో పాటు మరో హీరోగా నటించిన రానా మీద ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన సినిమా 'భీమ్లా నాయక్'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించిన, సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇటీవల మహేష్ బాబు చూశారు. సినిమా తనకు నచ్చిందని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
"భీమ్లా నాయక్ సినిమా ఇంటెన్స్ గా ఉంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఎలక్ట్రిఫయింగ్ ఫిల్మ్. పవన్ కల్యాణ్ ఎంత అద్భుతంగా నటించారో... నిప్పులు చెరిగే ఫామ్ లో ఉన్నారు. డానియల్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి సంచనలం సృష్టించారు. ఎప్పటిలా త్రివిక్రమ్ బ్రిలియంట్ గా రాశారు. ఇటీవల కాలంలో చక్కటి రచన అని చెప్పాలి. నా ఫెవరెట్ కెమెరామ్యాన్ రవి కె. చంద్రన్ విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. తమన్ మ్యూజిక్ మనకి గుర్తు ఉంటుంది. టీమ్ అందరికీ కంగ్రాట్స్" అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
Also Read: 'భీమ్లా నాయక్' రివ్యూ: కమర్షియల్ కిక్ ఇచ్చే నాయక్! సినిమా ఎలా ఉందంటే?
మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి త్వరలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. దానికి కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: నేనొక బ్రిడ్జ్ మాత్రమే, క్లారిటీ ఇచ్చిన త్రివిక్రమ్
#Trivikram's writing is sharp and brilliant as always... The best in recent times.
— Mahesh Babu (@urstrulyMahesh) February 26, 2022
Stunning visuals by @dop007.. one of my favourite lensmen!! Lastly, the music score by @MusicThaman haunts you and leaves you spellbound!! Sensational!!
— Mahesh Babu (@urstrulyMahesh) February 26, 2022
Congratulations to @saagar_chandrak, @vamsi84 and the entire team!! @MenenNithya @iamsamyuktha_ @SitharaEnts