Rashmika Mandanna : రష్మిక మందన్న మూవీ రిలీజ్‌కి అడ్డంకులు... 'ఛావా' మూవీని విడుదల కానివ్వమంటూ మంత్రి హెచ్చరిక
Rashmika Mandanna : విక్కీ కౌశల్, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న పీరియాడికల్ హిందీ డ్రామా 'ఛావా' మూవీలో కొన్ని సీన్స్ డిలీట్ చేయకపోతే మూవీని రిలీజ్ కానివ్వమని టీంకు వార్నింగ్ ఇచ్చారు.

Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉంది. 'పుష్ప 2' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఈ బ్యూటీ నటిస్తున్న కొత్త మూవీ 'ఛావా'. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా తాజాగా వివాదంలో చిక్కుకుంది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను కట్ చేస్తేనే గాని రిలీజ్ కానివ్వం అంటూ హెచ్చరిస్తున్నారు.
అసలు వివాదం ఏంటంటే...?
రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ అమ్మడు నటిస్తున్న కొత్త సినిమా 'ఛావా'. ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా వేగవంతం చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా 'ఛావా' మూవీ హిస్టారికల్ డ్రామాగా రూపొందుతోంది. అయితే మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న సందర్భంగా ఇప్పటికే ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కానీ ఆ ట్రైలర్ లో ఉన్న కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మరాఠీలు 'ఛావా' సినిమాపై నిరసనలు వ్యక్తం చేస్తూ, మూవీ రిలీజ్ ని ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఉదయ్ సమంత్ 'ఛావా' మూవీ మేకర్స్ పై విరుచుకుపడ్డారు. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని, కాబట్టి మూవీని రిలీజ్ కాకుండా బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ "మూవీ రిలీజ్ కు ముందే డైరెక్టర్ చరిత్రకారులను సంప్రదిస్తే మంచిది. శంబాజీ మహారాజ్ గురించి సరిగ్గా తెలుసుకొని ఆయనను గౌరవప్రదంగా తెరపైకి తీసుకురావాలి. శంభాజీ మహారాజ్ సాధించిన విజయాలపై సినిమాను తీయడం అనేది మంచి విషయమే. కానీ సినిమా తీయడంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడం మంచిది. ఆ అభ్యంతరకర సీన్స్ ను డిలీట్ చేయకపోతే మూవీని రిలీజ్ కాకుండా అడ్డుకుంటాం" అని ఆయన హెచ్చరించారు.
వివాదానికి ఆజ్యం పోసిన ఆ ఒక్క సీన్
ఇక 'ఛావా' వివాదానికి మెయిన్ రీజన్ ఏమిటంటే... ఒక డాన్స్ సీన్. ట్రైలర్ లో రష్మిక మందన్న. విక్కీ కౌశల్ కలిసి డాన్స్ చేస్తున్నారు. ఆ సీన్ పై మరాఠీ ప్రజలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, మహారాజు బహిరంగంగా డాన్స్ చేస్తున్న ఆ సీన్ ఆయన వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉందని అంటున్నారు. సినిమాలో పట్టాభిషేకం తర్వాత మహారాజు డాన్స్ చేస్తున్నట్టుగా చూపించిన ఆ సీన్లను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో శంబాజీ భార్య మహారాణి యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న కనిపిస్తోంది. ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ ఒక్క సీన్ వల్ల కొన్ని మరాఠా సంఘాలు పూణే, ముంబై వంటి ప్రాంతాల్లో 'ఛావా' మూవీ రిలీజ్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. మరి ఈ నిరసన సెగ తగిలి మూవీలో మేకర్స్ మార్పులు చేర్పులు చేస్తారా? లేదంటే ఇవన్నీ పట్టించుకోకుండా రిలీజ్ చేస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Also Read: రామ్ చరణ్ సినిమా నుంచి ఏఆర్ రెహ్మాన్ తప్పుకొన్నాడా... ఇండస్ట్రీ హాట్ న్యూస్, నిజం ఏమిటంటే?





















