అన్వేషించండి

Tamannaah: ముద్దా? అంతకంటే ఎక్కువే చేస్తా, ‘లస్ట్ స్టోరీస్-2’ కోసం రూటు మార్చిన తమన్నా?

తమన్నా నటించిన తాజా చిత్రం 'లస్ట్ స్టోరీస్ 2'. నెట్ ఫ్లిక్స్ లో జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో విడుదలైన ప్రమోషన్ వీడియోలో తమన్నా చేసిన ఘాటు వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

ఐదు ఏళ్ల క్రితం వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో నాలుగు కథలుంటాయి. ఈ నాలుగు కథలు ఒకదానితో మరొకదానికి అస్సలు సంబంధం ఉండదు. ప్రేమ, వ్యామోహం, శృంగారం లాంటి సబ్జెక్ట్స్ తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. అంతేకాదు, పచ్చి బూతులు, బోల్డ్ సన్నివేశాలతో బాలీవుడ్ లో గతంలో ఎప్పుడూ లేని సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ లో ఇలాంటి స్టోరీతో సినిమా ఎప్పుడూ రాలేదని చెప్పుకోవచ్చు. కియారా అద్వానీ, విక్కీ కౌశల్, భూమి ఫడ్నేకర్, మనీషా కొయిరాల, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో అద్భుత ఆదరణ దక్కించుకుంది.

మాటల్లో ఘాటు పెంచిన తమన్నా

చాలా కాలం తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. ‘లస్ట్ స్టోరీస్-2’ పేరుతో ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన 'కాస్ట్ స్టోరీ' పేరుతో ప్రమోషన్ వీడియో విడుదల అయ్యింది. అందులో తమన్నా ఘాటు మాటలతో ఆశ్చర్యపరిచింది. తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి ఈ చిత్రంలో గట్టిగానే రొమాన్స్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ ప్రమోషన్ వీడియోలో సైతం ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. విజయ్ వర్మతో ముద్దులే కాదు, అంతకంటే ఎక్కువే చేయగలను అంటూ అందరినీ షాక్ కి గురి చేసింది. హైదరాబాదీ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం గురించి తమన్నా ఈ మధ్యే ఆమె మౌనం వీడింది. తనతో ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని చెప్పుకొచ్చింది. “చాలా మంది అమ్మాయిలు తమను అర్థం చేసుకునే భర్త వస్తే బాగుంటుందని భావిస్తారు. నేను కూడా అలాగే అనుకున్నాను. అలాగే విజయ్ నా ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. అంతేకాదు, నా గురించి ఎల్లవేళలా కేరింగ్ తీసుకునే వ్యక్తిగా ఉన్నాడు. అతడి ప్రేమ పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఏదో ఒకరోజు ఇద్దరి ప్రపంచం ఒకటే అవుతుంది. ఇద్దరి మధ్యనున్న బంధం చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నాను” అని తమన్నా వెల్లడించింది. 

‘లస్ట్ స్టోరీస్-2’ ట్రైలర్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే

ఇక రీసెంట్ గా విడుదలైన ‘లస్ట్ స్టోరీస్-2’ ట్రైలర్ చూస్తుంటే తొలిపార్ట్ కు మించి బోల్డ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కారు కొనేముందు టెస్ట్ డ్రైవ్ చేసినట్లు పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా అంటూ సీనియర్ నటి నీనా గుప్తా చెప్పిన డైలాగ్  ఈ సినిమాలో ఎంత బోల్డ్ కంటెంట్ ఉందో అని. మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో భాగం అవడంతో ఈ ఆంథాలజీ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. టీజర్ లో పెద్దగా బోల్డ్ షాట్స్ ఏమి చూపించలేదు కానీ, తొలిపార్టులో సగం బోల్డ్ ఉన్నా ఈ సినిమా స్రీమింగ్ అయిన క్షణాల్లోనే మిలియన్ల వ్యూస్ ను రాబడుతుంది. కాజోల్ కు సంబంధించిన స్టోరీ బాగా ఉండబోతుందని తెలుస్తుంది. స్టోరీస్ 2'లో కాజోల్, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, అమృతా సుభాష్, అంగద్ బేడీ, తిలోత్తమా షోమే నటించారు. 

జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ 

నాలుగు కథల సమాహారంగా 'లస్ట్ స్టోరీస్ 2'ను తెరకెక్కించారు. ఫస్ట్ సీజన్ కూడా అంతే! ఒక్కో కథకు ఒకొక్కరు దర్శకత్వం వహించారు. 'లస్ట్ స్టోరీస్ 2'లో కథలకు సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ దర్శకులు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికలో జూన్ 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.  

Read Also: లైవ్‌లోనే కపిల్ శర్మ సహనటుడి ఆత్మహత్య యత్నం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్పార్లమెంంట్‌కి రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లతో ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
Embed widget