Liger Trailer Review: విజయ్ దేవరకొండను తన్నిన రమ్యకృష్ణ, కొట్టిన రోనిత్ రాయ్, హీరోయిన్ కిడ్నాప్ - 'లైగర్' ట్రైలర్‌లో ఇవి గమనించారా?
Liger Movie Detailed Review - Trailer Talk: విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన 'లైగర్' ట్రైలర్ విడుదలైంది. అందులో మీరు ఈ విషయాలు గమనించారా?
Liger Trailer Observation: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం 'లైగర్'. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్‌కు పూరి జగన్నాథ్ మార్క్ మేనరిజమ్స్ యాడ్ అవ్వడంతో ట్రైలర్ మాసీగా ఉంది. దానికి గ్లామర్ టచ్ కూడా ఇచ్చారు. కథేంటి? అనేది క్లారిటీగా చెప్పలేదు. అయితే, ఒక ఛాయ్ వాలా ఇంటర్నేషనల్ బాక్సర్ ఎలా అయ్యాడనేది బేసిక్ లైన్ అనేది తెలుస్తోంది. ట్రైలర్‌లో ఎక్కువ డైలాగులు లేకుండా ర్యాప్ సాంగ్‌తో పూరి జగన్నాథ్ కథ మీదకు దృష్టి వెళ్లనివ్వకుండా చేశారు. అయితే... నిశితంగా గమనిస్తే కొన్ని అంశాలు ట్రైలర్‌లో ఉన్నాయి. అవి ఏంటో చూస్తే...
యాటిట్యూడ్ కా బాప్... విజయ్ దేవరకొండ!
'లైగర్' ట్రైలర్‌లో అందర్నీ ఎక్కువ ఆకర్షించే అంశం... రింగ్‌లో విజయ్ దేవరకొండ చూపించే యాటిట్యూడ్. చిట్టి నిక్కర్‌లో ఆయన చిన్న డ్యాన్స్ మూమెంట్ చేస్తారు చూడండి. పూరి మార్క్ హీరో స్టైల్ ప్లస్ విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ మిక్స్ కావడంతో కొత్తగా ఉంది. అదొక్కటే కాదు... ట్రైలర్ మొత్తం పూరి మార్క్ హీరో యాటిట్యూడ్ మైంటైన్ చేశారు విజయ్ దేవరకొండ.
ఛాయ్ స్టాల్ టు ఇంటర్నేషనల్ ఫైట్
విజయ్ దేవరకొండ బాక్సర్ రోల్ చేస్తున్నారనేది తెలిసిందే. బాక్సర్ కావడానికి ముందు... ఆయనొక ఛాయ్ వాలా కుమారుడు. డీసీఎం (ట్రక్)లో రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ ముంబై రావడం చూపించారు పూరి. బీచ్ పక్కన పుట్‌పాత్ మీద తల్లీకొడుకులు కూర్చోవడం, స్ట్రగుల్స్ సినిమాలో చూడొచ్చు.
ఫైట్స్ ఎన్ని ఉన్నాయి?
'లైగర్'లో ఫైట్స్ ఎన్ని ఉన్నాయి? మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ రింగ్‌లో ఫైట్స్ పక్కన పెడితే... ఛాయ్ బండి దగ్గర మార్కెట్‌లో ఒక ఫైట్, మెట్రో ట్రైన్‌లో మరో ఫైట్, నాన్‌ఛాక్ స్టైల్‌లో మరో ఫైట్, గ్యాంగ్‌తో మరో ఫైట్... రింగ్‌లోవి తీసేస్తే మరో నాలుగు ఫైట్స్ పక్కా ఉంటాయి.
పూరి మార్క్ మదర్ రమ్యకృష్ణ!
పూరి జగన్నాథ్ సినిమాలు చూస్తే... మహిళల పాత్రలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. 'ఇడియట్'లో జయసుధ, 'లోఫర్'లో రేవతి, 'గోలీమార్'లో రోజా, 'పోకిరి'లో సుధ... చెబుతూ వెళితే చాలా మంది ఉన్నారు. ఆయా పాత్రల కంటే ఒక మెట్టు ఎత్తులో రమ్యకృష్ణ రోల్ ఉండబోతుందని 'లైగర్' ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఒక షాట్‌లో విజయ్ దేవరకొండను రమ్యకృష్ణ తన్నే సీన్ కూడా ఉంది. పవర్‌ఫుల్‌గా చూపిస్తూనే... రమ్యకృష్ణ క్యారెక్టర్‌లో షేడ్స్ చూపించారు పూరి. చిన్న పిల్లలతో డ్యాన్స్ చేయడం దగ్గర నుంచి కొడుకును కొట్టడం ఆడియన్స్‌లో కూర్చుని 'కొట్టారా సాలే' అనడం వరకూ... భిన్నమైన భావోద్వేగాలు చూపించారు రమ్యకృష్ణ.
విజయ్ దేవరకొండను రోనిత్ రాయ్ కూడా కొట్టేశారు!
విజయ్ దేవరకొండ బాక్సింగ్ సెషన్స్ కూడా ట్రైలర్‌లో చూపించారు. హీరోని రోనిత్ రాయ్ కొట్టే సీన్స్ ఉన్నాయి. అలాగే, ఒక చోట కంట్రోల్ చేసే సీన్ కూడా ఉంది.
హీరోయిన్ కత్తి ఎందుకు తీసింది?
హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ పుట్టడం సహజం! అయితే... పూరి సినిమాల్లో ప్రేమ కొంచెం డిఫరెంట్ కదా! 'లైగర్' ట్రైలర్‌లో అనన్యా సీన్స్ చూస్తే ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. కత్తి తీయడం, హీరోకి వార్నింగ్ ఇవ్వడం, అమెరికాలో వెతకడం వంటివి చూస్తే... సినిమాలో అనన్యా పాండేకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లభించినట్టు ఉంది.
అనన్యాను ఎవరు కిడ్నాప్ చేశారు?
పూరి జగన్నాథ్ సినిమాల్లో లవ్ ట్రాక్స్ డిఫరెంట్ అండ్ టిపికల్‌గా ఉంటాయి. ఈ సినిమాలో కూడా అటువంటి లవ్ ట్రాక్ ఆశించవచ్చు. అయితే... ట్రైలర్ చూస్తే, ఎడారి లాంటి ప్రదేశంలో తీసిన సీన్, ఇంట్లో హీరో హీరోయిన్స్ మధ్య సీన్స్ ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. అయితే... అనన్యా పాండేను కిడ్నాప్ చేస్తున్న సీన్ కూడా ఉంది.
కొట్టకుండా అలా పడిపోయాడేంటి?
'పక్కా కమర్షియల్'లో సినిమాలో ఫైట్స్ ఎలా తీస్తారనేది చూపిస్తూ కామెడీ చేశారు. ఇది కామెడీ కాదు గానీ... 'లైగర్' ట్రైలర్ 0.25 స్పీడ్‌లో పెట్టుకుని చూస్తే, ఒక చోటు బాక్సింగ్ రింగ్‌లో విజయ్ దేవరకొండ కాలితో కొడతాడు. కానీ, ఎదుటి వ్యక్తికి అది తగలదు. కానీ, కింద పడతాడు. సిల్వర్ స్క్రీన్ మీద మరీ అంత స్లోగా పెట్టుకుని ఎవరూ చూడరు కనుక పర్వాలేదు. ఓటీటీలో విడుదలైన తర్వాత ఇటువంటివి మీమ్ మెటీరియల్ అయ్యే అవకాశం ఉంది.
'టెంపర్' వంశీ, విష్ణు రెడ్డి అండ్ 'గెటప్' శ్రీను
హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, అనన్యా పాండేతో పాటు ప్రధాన తారలు రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మైక్ టైసన్ కాకుండా 'లైగర్' ట్రైలర్‌లో మరికొందరు ఉన్నారు. వాళ్ళను మీరు గమనించారా? రింగ్‌లో విష్ణు రెడ్డి బాక్సర్‌గా కనిపించారు. పూరి 'ఇస్మార్ట్ శంకర్'లోనూ అతడు నటించారు. ఇంకా 'టెంపర్' వంశీ, 'గెటప్' శ్రీను కూడా ఈ సినిమాలో ఉన్నారు.
Also Read : మీకు మా అయ్య, తాత తెల్వదు! అయినా సరే ఏంది ఈ రచ్చ - ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే విజయ్ దేవరకొండ స్పీచ్
లాస్ట్ బట్ నాట్ లీస్ట్... మైక్ టైసన్!
లాస్ట్‌లో మైక్ టైసన్ గురించి చెబుతున్నాం అనుకోవద్దు... 'లైగర్' ట్రైలర్‌లో కూడా ఆయన్ను లాస్ట్‌లో చూపించారు. చివర్లో వచ్చినా... ఒక్క డైలాగ్‌తో చింపేశారు. 'నువ్వు ఫైటర్ అయితే నేను ఏంటి?' అని మైక్ టైసన్ చెప్పడం, గట్టిగా నవ్వడం ప్రేక్షకులు గమనించేలా ఉంది.
Also Read : అంచనాలు ఆకాశాన్ని అందుకునేలా చేసిన పూరి - విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ వచ్చేసింది