Laila OTT Release: ఆ ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'లైలా' - ముందుగానే స్ట్రీమింగ్ అవుతుందా?
Laila OTT Platform: మాస్ కా దాస్ విశ్వక్ లేడీ గెటప్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'లైలా'. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

Vishwak Sen's Laila Streaming On Amazon Prime Video: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), ఆకాంక్ష శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన 'లైలా' (Laila) వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చింది. విశ్వక్ లేడీ గెటప్‌లో వన్ మ్యాన్ షో చేసినప్పటికీ ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీకి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా.. సాహు గారపాటి నిర్మించారు. 'లైలా' ఓటీటీ రైట్స్‌ను 'అమెజాన్ ప్రైమ్' (Amazon Prime) వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు అమెజాన్‌లో రిలీజ్ కావాల్సి ఉండగా.. టాక్ దృష్ట్యా అంతకంటే ముందుగానే 'లైలా' స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలోనే మూవీ స్ట్రీమింగ్ కావొచ్చని మూవీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అసలు కథేంటంటే..?
అప్పటి చిత్రాల నుంచి ఇప్పటివరకూ హీరోలు లేడీ గెటప్స్ వేసిన సినిమాలు ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే, తాజాగా విశ్వక్ లేడి గెటప్‌లో నటించిన 'లైలా' మూవీ సైతం ఆయన నటనకు మంచి మార్కులే పడినా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఇక కథలోకి వెళ్తే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సోనూకు (విశ్వక్ సేన్) ఓ బ్యూటీ పార్లర్ ఉంటుంది. చిన్నప్పుడే చనిపోయిన తన తల్లి నేర్పిన విద్యతో, ఆమె జ్ఞాపకంలా హీరో ఈ పార్లర్ నిర్వహిస్తుంటాడు. అతని మేకప్ స్టైల్ మహిళలకు ఎంతో నచ్చుతుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను ముందుండి ఆదుకునే హీరోకి ఓ ఎస్సై భార్య విషయంలో అనుకోని సమస్యలు చుట్టుముడతాయి. అలాగే, ఓ మహిళకు వేసిన మేకప్ సైతం అతన్ని సమస్యల్లోకి నెడుతుంది. దీంతో 'లైలా'గా మారిన సోను ఆ సమస్యలను ఎలా అధిగమించాడు..?, హీరోయిన్‌తో అతని పరిచయం, లేడీ గెటప్ నుంచి ఎలా బయటపడ్డాడు.? అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Also Read: చిరంజీవితో సాయి దుర్గా తేజ్ సినిమా... మామా అల్లుళ్ళ సందడి చూసేందుకు రెడీ అవ్వండమ్మా!
విడుదలకు ముందే వివాదాలు
మరోవైపు, 'లైలా' సినిమాను విడుదలకు ముందే వివాదాలు వెంటాడాయి. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడం, లేడీ గెటప్‌లో విశ్వక్ నటించడం వంటివి సినిమాపై బజ్‌ను పెంచేశాయి. ఇదే ఈవెంట్‌లో నటుడు 30 ఇయర్స్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి. ఆయన సినిమాలో మేకల సత్యం క్యారెక్టర్ గురించి చెబుతూ.. మూవీ షూటింగ్ సమయంలో మొదట 150 మేకలు ఉన్నాయని.. చివరికి లెక్కిస్తే సరిగ్గా 11 ఉన్నాయని కామెంట్ చేశారు. దీనిపై తమ పార్టీని పరోక్షంగా టార్గెట్ చేశారంటూ వైసీపీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా 'బాయ్ కాట్ లైలా' అంటూ ట్రెండ్ చేశారు. దీనిపై స్పందించిన హీరో విశ్వక్, నిర్మాత సాహు గారపాటి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. అటు, నటుడు పృథ్వీ సైతం సారీ చెబుతూ నెట్టింట ఓ వీడియో విడుదల చేశారు.
Also Read: మంచు విష్ణుకు ప్రభాస్ ఛాన్స్ ఇస్తారా? - 'స్పిరిట్'లో సందీప్ రెడ్డి వంగా తీసుకుంటారా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

