అన్వేషించండి

Thalapathy 69: విజయ్‌ చివరి మూవీ అప్‌డేట్‌ వచ్చేసింది - ఆసక్తి పెంచుతున్న సినిమా పోస్టర్‌, ఆయన పొలిటికల్‌ ఎంట్రీకి ఇది శ్రీకారమా?

Thalapathy 69 Movie Announced: తమిళ స్టార్‌ హీరో విజయ్‌ చివరి మూవీ దళపతి 69పై (Thalapathy 69) అధికారిక ప్రకటన ఇచ్చింది మూవీ టీం. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌ మూవీపై ఆసక్తి పెంచుతుంది. 

Thalapathy 69 Movie Update: అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ అప్‌డేట్‌ వచ్చింది. తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ చివరి మూవీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. దళపతి 69 టైటిల్‌ పోస్టర్‌తో ఈ క్రేజ్‌ ప్రాజెక్ట్‌ని అనౌన్స్‌ చేసింది కేవీఎన్‌ ప్రొడక్షన్‌ సంస్థ. ఈ బ్యానర్లోనే దళపతి 69 (Thalapathy 69) మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాకు హెచ్‌‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల చివరి అధ్యాయానికి శ్రీకారం అంటూ కె.వి.ఎన్‌ ప్రొడక్షన్స్‌ దళపతి స్పెషల్‌ వీడియోతో అప్‌డేట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆయన చివరి మూవీ దళపతి 69పై సెప్టెంబర్‌ 14న సాయంత్రం 5 గంటలకు బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా ఉంటుందని ప్రకటించింది. ఇక చెప్పినట్టు నేడు సాయంత్రం మూవీపై అధికారిక ప్రకటన ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్‌ చూస్తుంటే రాజకీయాల్లోకి వెళుతున్న విజయ్‌ ఈ సినిమా మరింత ప్లస్‌ అయ్యేలా కనిపిస్తుంది. చేతిలో టార్చ్‌ పట్టుకుని ఉన్న ఈ పోస్టర్‌కి ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చారు. "ప్రజాస్వామ్యం టార్చ్ బేరర్ త్వరలో వస్తాడు(The Torch bearer of ధDemocracy Arriving soon)" పోస్టర్‌లో క్యాప్షన్‌ ఇచ్చారు.

చూస్తుంటే ఆయన రాజకీయ ఆరంగేట్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను కథను రెడీ చేసినట్టు తెలుస్తోంది. పోస్టర్‌లోని ఉన్న క్యాప్షన్‌, జ్యోతిని చూస్తుంటే ఇది పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ సాగే కథని అర్థమైపోతుంది. ఎంత ప్రతిష్టాత్మకంగా రాబోతోన్న ఈ సినిమా పోస్టర్‌ మాత్రం అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది. అంతేకాదు ఈ పోస్టర్‌ క్యాప్షన్‌ తమిళ ప్రజల్లో ఆసక్తిని రేకిస్తుంది. ఆయన చివరి సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందని, డైరెక్టర్‌ హెచ్‌ వినోద్‌ ఈ సినిమాను ఏ రేంజ్‌లో ప్లాన్‌ చేశాడా? అంచనాలు వేసుకుంటున్నారు. 

Also Read: హిట్‌ జోడీ రిపీట్‌ - విజయ్‌ సరసన ఆ స్టార్‌ హీరోయిన్‌? - కీలక పాత్రలో ఆ సీనియర్‌ నటి!

ఇదిలా ఉంటే విజయ్‌ రాజకీయాల్లోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆయన తన పొలిటికల్‌ పార్టీ పేరు మార్చి కొత్త ప్రకటించారు. అంతేకాదు తన పార్టీ ద్వారా పేద ప్రజలకు ఆర్థిక సాయం చేయడం వంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు తన పొలిటికల్‌ ఎంట్రీపై దృష్టి పెట్టారు విజయ్‌. 2026 ఎన్నికల్లో ఆయన పోటీ కూడా చేయబోతున్నాడు. ఆ దిశగా విజయ్‌ తన కెరీర్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో  సినిమాలకు పూర్తిగా స్వస్తీ చెప్పి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తన 69వ సినిమాను ప్రకటించాడు.

 

అయితే ఇదే ఆయన చివరి చిత్రం కేవీఎన్‌ ప్రొడక్షన్‌ సంస్థ స్పష్టం చేసింది. ఇది విజయ్‌ చివరి అధ్యాయానికి శ్రీకారం అంటూ దళపతి 69 సినిమాను నేడు అధికారిక ప్రకటించింది కేజీయన్‌ సంస్థ. అయితే ఈ సినిమాను పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కస్తున్న తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ చూస్తుంటే అర్థమైపోతుంది. ఇదే ఆయన చివరి చిత్రం కావడం Thapathy 69పై ఫ్యాన్స్‌, ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కేవీఎన్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో వెంకట్‌ కే నారాయణ్‌ నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక త్వరలోనే ఈ సినిమాలోని మిగతా తారాగణం, ఇతర వివరాలు మేకర్స్‌ ప్రకటించనున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget