Andhra King Thaluka: 'ఆంధ్ర కింగ్ తాలూకా' సెట్స్‌లోకి సూపర్ స్టార్ - హీరోకి ఫ్యాన్‌కు మధ్య స్టోరీ ఏంటో?
Upendra: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా తాజాగా కన్నడ స్టార్ ఉపేంద్ర జాయిన్ అయ్యారు.

Upendra In Andhra King Thaluka Movie Shooting Set: ఎనర్జిటిక్ హీరో రామ్ లేటెస్ట్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఈ మూవీకి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేం పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
షూటింగ్ సెట్స్‌లోకి సూపర్ స్టార్
మూవీలో ఉపేంద్ర.. సూపర్ స్టార్ 'సూర్య కుమార్' రోల్‌లో కనిపించనున్నారు. ఇటీవల టైటిల్ గ్లింప్స్‌లో ఆయన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సూపర్ స్టార్ ఫ్యాన్‌గా రామ్ కనిపించనున్నారు. సినిమాలో ఉపేంద్ర (Upendra) పాత్రకు చాలా ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ షెడ్యూల్‌లోనే కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ జరగనుందని సమాచారం.
Also Read: అల్లు అర్జున్, అట్లీ మూవీకి డిఫరెంట్ టైటిల్ - అంత మంది హీరోయిన్లా?, అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..
టైటిల్ గ్లింప్స్.. గూస్ బంప్స్
హీరో రామ్ బర్త్ డే సందర్భంగా ఇటీవల టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. థియేటర్ వద్ద ఉపేంద్ర భారీ కటౌట్ పెట్టగా.. రామ్ సైకిల్‌పై గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు. క్రౌడ్ మధ్య కౌంటర్ వద్ద టికెట్స్ తీసుకుంటూ ఉపేంద్ర పోస్టర్ ముందు రామ్.. 'ఆంధ్ర కింగ్ తాలూకా' అంటూ కేకలు వేయడం ఫ్యాన్ బేస్‌ను కళ్లకు కట్టినట్లు చూపించింది. 'ఆంధ్ర కింగ్'.. స్టార్ హీరో సూర్య అభిమానిగా రామ్ కనిపించనున్నారు. సాగర్ రోల్‌లో రామ్ నటిస్తుండగా.. ఆయన సరసన మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. హీరో, ఫ్యాన్‌కు మధ్య జరిగే కొన్ని ఆసక్తికర సంఘటనల నేపథ్యంలో మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తుండగా.. ఓ అందమైన లవ్ స్టోరీ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Our 'SURYA KUMAR' is here 💥💥@nimmaupendra joins the sets of Energetic Star @ramsayz ’s #AndhraKingTaluka for a key schedule ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) May 24, 2025
Shoot in full swing. Stay tuned for more exciting updates.
▶️ https://t.co/kw9BbCA8vc#BhagyashriBorse @filmymahesh @MythriOfficial… pic.twitter.com/MaZUj6LO3Z
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మూవీలో రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూవీకి
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, పీఆర్వో: వంశీ-శేఖర్.
ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్‌లో విభిన్న కథనాలతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో క్రేజ్ సంపాదించుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్. ఇప్పుడు 'ఆంధ్ర కింగ్ తాలూకా'తో ఓ హీరోకే బిగ్ ఫ్యాన్‌గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఆయన ఖాతాలో సరైన హిట్ పడలేదు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ మూవీతో మంచి హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.






















