Director Adhik Ravichandran Wedding : తమిళ నటుడు ప్రభు కుమార్తెతో యంగ్ డైరెక్టర్ పెళ్లి - హాజరైన విశాల్!
Vishal : తమిళ యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి హీరో విశాల్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Kollywood Director Adhik Ravichandran Wedding : కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. ప్రముఖ తమిళ నటుడు ప్రభు కుమార్తెతో అదిక్ రవిచంద్రన్ పెళ్లి ఘనంగా జరిగింది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ జరిగిన ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా తమిళ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్య అధిక్ రవిచంద్రన్ తో ప్రేమలో ఉన్నట్లు గతంలోని వార్తలొచ్చాయి. డిసెంబర్ 15 శుక్రవారం ఉదయం అదిక్ రవిచంద్రన్, ఐశ్వర్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వివాహానికి హాజరై తమ శుభాకాంక్షలు అందజేశారు. ఇక ఈ వివాహ వేడుకలో విశాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదిక్ రవిచంద్రన్ ఐశ్వర్యల వివాహానికి హాజరైన విశాల్ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్ చేశాడు. "మై డార్లింగ్ అదిక్, నా సోదరి ఐశ్వర్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభిస్తున్న మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అధిక్.. నా సోదరిని ఒక యువరాణిలా చూసుకో" అంటూ విశాల్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కొత్త జంటకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
So damn happy for u my darling Adhik and my dearest sister Aishwarya on your wedding today and starting a new chapter in your lives and u hav the universe s blessings and especially your parents prabhu sir and punitha aunty's positivity and blessings now. Coming to the point,… pic.twitter.com/Vucqwch3J0
— Vishal (@VishalKOfficial) December 15, 2023
కాగా 2015లో విడుదలైన 'త్రిష ఇల్లాన నయనతార' అనే సినిమాతో దర్శకుడిగా మారిన అదిక్ రవిచంద్రన్ 'దబాంగ్ 3' తమిళ వెర్షన్ కి డైలాగ్స్ రాశారు. ఇక ఏడాది విశాల్ తో తెరకెక్కించిన 'మార్క్ ఆంటోనీ' మూవీతో దర్శకుడిగా మొదటి విజయాన్ని అందుకున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ కోలీవుడ్ లో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. త్వరలోనే కోలీవుడ్ స్టార్ అజిత్ తో సినిమా చేయబోతున్నాడు. ఇక ఐశ్వర్య విషయానికి వస్తే.. తమిళనటుడు ప్రభు కుమార్తె అయిన ఈమెకి గతంలోనే పెళ్లి జరిగింది. కునాల్ అనే యువకుడుతో 2009లో ఈమె వివాహం జరగగా.. కొన్ని ఏళ్లకే వీరి మధ్య మనస్పర్ధలు వచ్చి వీరి బంధం విడాకులతో ముగిసింది.
ఆ తర్వాత ఐశ్వర్య తన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటుంది. గత కొద్ది నెలలుగా దర్శకుడు అధిక రవిచంద్రన్ తో ఐశ్వర్య రిలేషన్షిప్ మైంటైన్ చేస్తూ వచ్చింది. ఫైనల్ గా ఈ జంట ఇది కుటుంబ సభ్యుల అంగీకారంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక తమిళ నటుడు ప్రభు తెలుగువారికి సుపరిచితమే. చంద్రముఖి, డార్లింగ్, ఆరెంజ్, శక్తి, బెజవాడ, ఒంగోలు గిత్త, దరువు సినిమాలతో ఈయన తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ఈయనకి కూతురితో పాటూ విక్రమ్ ప్రభు అనే కొడుకు కూడా ఉన్నాడు. కోలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ ప్రభు ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నాడు.
Also Read : 'యానిమల్' పైరసీని ఎంకరేజ్ చేస్తున్న మహేష్ బాబు నిర్మాత!?