అన్వేషించండి

Suriya : ఆ మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్ చూసి ఫిదా అయ్యా - చెర్రీ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా : సూర్య

Suriya : కోలీవుడ్ అగ్ర హీరో సూర్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ నటన పై ప్రశంసలు కురిపించాడు.

Kollywood Actor Suriya About Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'RRR' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా అద్భుత నటన కనబరిచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతో గ్లోబల్ వైట్ గా పాపులర్ అయిన చరణ్ అదే పాపులారిటీ మెయింటైన్ చేసేలా తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. చరణ్ యాక్టింగ్ కి ఫిదా అయిన వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా చేరిపోయారు. తాజాగా రామ్ చరణ్ గురించి సూర్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

చరణ్ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయడానికైనా రెడీ - సూర్య

తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య రామ్ చరణ్ నటన పై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు చరణ్ సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఈ మేరకు సూర్య మాట్లాడుతూ.. "రామ్ చరణ్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా 'రంగస్థలం' సినిమాలో చరణ్ యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా. ఒకవేళ నాకు చరణ్ తో వర్క్ చేస్తే ఛాన్స్ వస్తే తన సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయడానికి అయినా నేను రెడీగా ఉన్నాను" అంటూ తెలిపాడు. దీంతో చరణ్ పై సూర్య చేసిన కామెంట్స్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 

'కంగువా' డబ్బింగ్ షురూ

కోలీవుడ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'కంగువా' డబ్బింగ్ మొదలయ్యింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణసంస్థలు యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ నటి దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ జనవరిలో పూర్తయింది. తాజాగా డబ్బింగ్ మొదలుపెట్టినట్టు చిత్ర ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. ఈ చిత్రంలో సూర్య ఐదు విభిన్న పాత్రల్లో అలరించబోతున్నారు. ఎప్పుడూ విభిన్నమైన పాత్రలనే ఎంచుకునే సూర్య ఈసారి ఏకంగా ఒకే చిత్రంలో ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతుండటంతో ఆడియన్స్ సైతం ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ వరల్డ్ చిత్రంగా ఈ మూవీ పది భాషల్లో విడుదల కానుంది.

'గేమ్ ఛేంజర్' షూటింగ్ ఎంత వరకు వచ్చిందంటే..

'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 70 నుంచి 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం పెండింగ్ వర్క్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారట. ఈ క్రమంలోనే 'గేమ్ ఛేంజర్' షూటింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం.. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో సినిమాకు సంబంధించి కీలక షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ నిర్మించిన ఓ ప్రత్యేక సెట్ లో షూటింగ్ చేస్తున్నారట. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ అన్బరివ్ నేతృత్వంలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మార్చి తొలివారం వరకూ ఈ చిత్రీకరణ ఉంటుందని తెలిసింది.

Also Read : నా వయస్సు ఇంకా 23 - సమంత పోస్ట్ వైరల్, ఆమె బరువెంతో తెలిస్తే షాకవుతారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Metro Phase2: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2- మళ్లీ మొదటికొచ్చిన సమస్య, ఆ విషయంపై మెట్రో అధికారులు అభ్యంతరం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2- మళ్లీ మొదటికొచ్చిన సమస్య, ఆ విషయంపై మెట్రో అధికారులు అభ్యంతరం
AP Group 2 Exams: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro Phase2: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2- మళ్లీ మొదటికొచ్చిన సమస్య, ఆ విషయంపై మెట్రో అధికారులు అభ్యంతరం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2- మళ్లీ మొదటికొచ్చిన సమస్య, ఆ విషయంపై మెట్రో అధికారులు అభ్యంతరం
AP Group 2 Exams: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Viral News: గుంటూరులో ఫ్రీగా చికెన్ బిర్యానీ, కోడి కూర - రద్దీని కంట్రోల్ చేయలేక గేట్లు మూసివేసిన నిర్వాహకులు
గుంటూరులో ఫ్రీగా చికెన్ బిర్యానీ, కోడి కూర - రద్దీని కంట్రోల్ చేయలేక గేట్లు మూసివేసిన నిర్వాహకులు
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
IND vs PAK Champions Trophy: భార‌త్ వైపే మొగ్గు.. జ‌ట్టులో చాలా కలిసొచ్చే అంశాలు.. పాక్ లో అవి కొర‌వ‌డ్డాయి.. మాజీ క్రికెట‌ర్
భార‌త్ వైపే మొగ్గు.. జ‌ట్టులో చాలా కలిసొచ్చే అంశాలు.. పాక్ లో అవి కొర‌వ‌డ్డాయి.. మాజీ క్రికెట‌ర్ విశ్లేష‌ణ‌
Embed widget