Kishkindhapuri: పిల్లలు, గుండె ధైర్యం లేని వారు మూవీకి రావొద్దు - 'కిష్కిందపురి' టీం రిక్వెస్ట్
Kishkindhapuri Censor Certificate: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'కిష్కిందపురి' ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి పిల్లలు దూరంగా ఉండాలని టీం తెలిపింది.

Bellamkonda Sai Sreenivas's Kishkindhapuri Gets A Certificate: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'కిష్కిందపురి'. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, లుక్స్, ట్రైలర్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'A' సర్టిఫికెట్...
తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకోగా ఎలాంటి కట్స్ లేకుండా 'A' సర్టిఫికెట్ జారీ చేసినట్లు మూవీ టీం తెలిపింది. 'అత్యంత భారీ రూపంలో న్యూ ఏజ్ హార్రర్‌తో అరుస్తూ భయపడేందుకు రెడీగా ఉండండి.' అంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు చిన్న పిల్లలకు అనుమతి లేదని మూవీ టీం స్పష్టం చేసింది. పిల్లలు, గుండె ధైర్యం లేని వారు సినిమాకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
#Kishkindhapuri is certified 🅰️ with zero cuts 🥶
— Shine Screens (@Shine_Screens) September 5, 2025
Get ready to scream and get scared with NEW-AGE HORROR in its most massive form ❤🔥
KIDS & THE FAINT HEARTED, STAY AWAY 🚫#KishkindhapuriTrailer ICYMI
▶️ https://t.co/s4gHRwbrte#Kishkindhapuri GRAND RELEASE WORLDWIDE ON… pic.twitter.com/eaPgxATnEb
Also Read: 'ఘాటీ' రివ్యూ: క్రిష్ నుంచి పుష్ప, దసరా రేంజ్ రస్టిక్ యాక్షన్... అనుష్క సినిమా హిట్టా? ఫట్టా?
హారర్ థ్రిల్లర్స్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా రోజుల తర్వాత అనుపమ పరమేశ్వరన్ 'కిష్కింధపురి'లో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ దెయ్యం పాత్రలో భయపెట్టబోతున్నారు. ట్రైలర్‌లో ఆమె లుక్ నిజంగానే భయపెడుతోంది. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుక్ కూడా అదిరిపోయింది. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించగా... అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందించారు.
స్టోరీ అదేనా?
ఓ గ్రామంలో పాడుబడిన బంగ్లా అందులో దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం సాగుతుంది. దెయ్యాలపై ఇంట్రెస్ట్ ఉన్న వారిని ఓ గ్రూప్‌గా ఆ బంగ్లాలోకి ఓ యువతి యువకుడు ఘోస్ట్ వాక్ టూర్ ప్రోగ్రాం కింద తీసుకెళ్తారు. ఆ బంగ్లాలో దెయ్యం లాంటివి ఏమీ లేవని అనుకునే ఆ గ్రూపులోని వ్యక్తులకు నిజంగా దెయ్యం ఉన్న భయానక ఎక్స్‌పీరియన్స్ ఎదురవుతుంది. 'ఊరికి ఉత్తరాన, దారికి పశ్చిమాన, పశ్చిమ దిక్కున ప్రేతాత్మలు, అన్నీ పేరు వినగానే తూర్పునకు తిరిగే ప్రదేశం.' అంటూ ట్రైలర్‌లో భారీ ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
తమను నమ్మి వచ్చిన వారిని ఆ యువకుడు ఎలా కాపాడాడు? అసలు ఆ బంగ్లాలో దెయ్యం ఉందా? ఉంటే ఆ గతం ఏంటి? ఊరికి ఏదైనా శాపం ఉందా? గైడ్‌గా వచ్చిన యువతి దెయ్యంలా ఎందుకు మారింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. అనుపమ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గతంలో 'రాక్షసుడు' మూవీలో నటించగా హిట్ అందుకుంది. ఇప్పుడు ఇద్దరి కాంబోలో వస్తోన్న రెండో మూవీ అది కూడా హారర్ మిస్టరీ థ్రిల్లర్ కావడంతో మరోసారి హిట్ ఖాయమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.





















