Kiara Advani Sidharth Malhotra: పేరెంట్స్‌గా మారిన స్టార్ కపుల్ - పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వాణీ
Kiara Advani: స్టార్ కపుల్ కియారా సిద్ధార్థ్ మల్హోత్ర తల్లిదండ్రులు అయ్యారు. ముంబయిలోని రిలయన్స్ ఆస్పత్రిలో కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

Kiara Advani Sidharth Malhotra Couple Blessed With Baby Girl: హీరోయిన్ కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపుతులు తల్లిదండ్రులు అయ్యారు. ముంబయిలోని రిలయన్స్ ఆస్పత్రిలో కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ కపుల్‌కు సోషల్ మీడియా వేదికగా విషెష్ వెల్లువెత్తుతున్నాయి.
2023 ఫిబ్రవరి 7న కియారా, సిద్ధార్థ్ రాజస్థాన్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ సినిమాల్లో నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న తాము పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు.
Also Read: రాజమౌళి రూటులో నీల్, సుక్కు నడుస్తారా? ఆ సినిమాలు మళ్ళీ థియేటర్లలోకి వస్తాయా?
'షేర్షా' మూవీతో పరిచయం
2014లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు కియారా అద్వానీ. 'భరత్ అనే నేను' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియారా తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ చిత్రాల్లో నటించారు. 2021లో 'షేర్షా'లో సిద్ధార్థ్, కియారా కలిసి నటించారు. అక్కడి నుంచి వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇటలీలోని రోమ్‌లో సిద్ధార్థ్ తనకు లవ్ ప్రపోజ్ చేసినట్లు కియారా తెలిపారు. 'కాఫీ విత్ కరణ్' సీజన్ 8లో భాగంగా తన లవ్ స్టోరీని పంచుకున్నారు కియారా. 2023లో ఫిబ్రవరి 7న కుటుంబ సభ్యుల సమక్షంలో రాజస్థాన్ జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ వీరి వివాహ వేడుకకు వేదిక అయ్యింది.
ప్రస్తుతం కియారా 'వార్ 2' మూవీలో నటించగా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా రూపుదిద్దుకుంటున్న 'పరమ్ సుందరి' ఈ నెల 25న రిలీజ్ కానుంది. అలాగే, అరునాభ్ దర్శకత్వంలో 'వివాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్'లోనూ సిద్ధార్థ్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు.





















