Khaleja Re Release Collections: రికార్డ్ కోసం 'ఖలేజా' కలెక్షన్స్ పెంచారా? నిజంగా 'గబ్బర్ సింగ్'ను బీట్ చేయలేదా?
Khaleja vs Gabbar Singh: 'గబ్బర్ సింగ్' రీ రిలీజ్ కలెక్షన్స్ బీట్ చేయడం ఇప్పట్లో కుదిరే పని కాదా? రికార్డు కోసం 'ఖలేజా' కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేశారా?అంతే తప్ప సినిమా అంత కలెక్ట్ చేయలేదా?

'గబ్బర్ సింగ్' వర్సెస్ 'ఖలేజా'... అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్స్‌లో చాలా అంటే చాలా స్పెషల్ ఫిల్మ్స్. మహేష్ బాబులో కామెడీ టైమింగ్‌ను 'ఖలేజా' ద్వారా త్రివిక్రమ్ శ్రీనివాస్ బయటకు తీస్తే... స్క్రీన్ మీద తమ అభిమానులు కోరుకునే విధంగా పవన్ కళ్యాణ్‌ను చూపించి వాళ్ళ ఆకలి తీర్చారు హరీష్ శంకర్. ఇప్పుడు ఈ రెండు సినిమాలలో ఏది గొప్ప? అనే డిస్కషన్ మొదలు అయింది. అది కంటెంట్ పరంగా కాదు... కలెక్షన్స్ విషయంలో!
రికార్డు కోసమే 'ఖలేజా' రీ రిలీజ్ కలెక్షన్ పోస్టర్...
రియల్‌గా 'గబ్బర్ సింగ్'ను బీట్ చేయలేదా??
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 30న 'ఖలేజా' సినిమాను రీ రిలీజ్ చేశారు. థియేటర్లలో అభిమానుల సందడి సోషల్ మీడియాలో చాలా మంది చూసే ఉంటారు. ఓ అభిమాని అయితే ఏకంగా పామును తీసుకువెళ్లాడు. సినిమాలో సీన్లు రీ క్రియేట్ చేశారు చాలా మంది. సినిమా మీద ఎటువంటి నెగెటివిటీ లేదు. రీ రిలీజ్ కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. మొదటి రోజు సుమారు రూ. 4.30 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం.
'గబ్బర్ సింగ్' విషయానికి వస్తే... గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన (సోమవారం) పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేశారు. ఆదివారం రాత్రి ప్రీమియర్ షోస్ వేయడంతో పాటు సోమవారం భారీ ఎత్తున విడుదల చేశారు. రీ రిలీజ్ కలెక్షన్స్ పరంగా 'గబ్బర్ సింగ్' సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. వీక్ డేలో విడుదలైనా... మొదటి రోజు ఎనిమిది కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్య పోయేలా చేసింది.
'ఖలేజా' రీ రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ నాలుగు నుంచి నాలుగున్నర కోట్లు కావడంతో... 'గబ్బర్ సింగ్' రీ రిలీజ్ రికార్డ్స్ బీట్ చేయడం ఇప్పట్లో మరొక సినిమా వల్ల కాదని ట్రేడ్ పోర్టల్స్ పోస్ట్ చేశాయి. అయితే అనూహ్యంగా శనివారం సాయంత్రానికి 'ఖలేజా' రీ రిలీజ్ కలెక్షన్స్ రూ. 8.26 కోట్లు అని పోస్టర్ వచ్చింది. ఆల్ టైమ్ రికార్డ్ అని వేశారు. ఆ పోస్టర్ మీద తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ పోస్టర్ రికార్డ్స్ సాధించామని చెప్పుకోవడం కోసం వేశారని, వాస్తవానికి అంత కలెక్షన్స్ రాలేదని సెటైర్లు పడుతున్నాయి. రీ రిలీజ్ కలెక్షన్స్ ఎక్కువ మంది ట్రాక్ చేయరు. అందువల్ల ఫేక్ పోస్టర్ పడిందని డిస్కషన్ మొదలైంది.
కొత్త సినిమాల కంటే థియేటర్లలో విడుదలైన రీ రిలీజ్ సినిమాలు చూసేందుకు అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'భైరవం' కంటే శుక్రవారం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'ఖలేజా' రీ రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువ. అందుకే శుక్రవారం కాకుండా వీక్ డేస్‌లో రీ రిలీజులు చేస్తే బాగుంటుందని 'భైరవం' సక్సెస్ మీట్‌లో మంచు మనోజ్ చెప్పినది.





















