అన్వేషించండి

Suriya: బ్లాక్ బస్టర్ కొట్టి పదేళ్ళు... 'వీరభద్రుడు'తో సూర్య విశ్వరూపం చూపిస్తాడా?

Karuppu Release Date: 'వీరభద్రుడు' (తమిళంలో 'కరుప్పు')తో గురువారం (మే 14న) థియేటర్లలోకి వస్తున్నారు సూర్య. ఈ సినిమాతో విశ్వరూపం చూపిస్తారా? బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్‌డమ్ అందుకుంటారా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సూర్య 'సింగం 3' తర్వాత సరైన హిట్ లేక సతమతమవుతున్నారు.
  • 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలు ఓటీటీకి వెళ్లాయి.
  • రోలెక్స్ పాత్రకు వచ్చిన స్పందన హీరో పాత్రలకు రాలేదు.
  • కొత్త సినిమా 'వీరభద్రుడు'తో సూర్య కమ్ బ్యాక్ ఇస్తారా?

తమిళ చిత్రసీమలో శివకుమార్ తనయుడిగా సూర్య (Suriya Sivakumar) అడుగు పెట్టినప్పటికీ... కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ తర్వాత తరంలో విజయ్, అజిత్ వంటి స్టార్స్ సరసన చేరారు. ఆయనకు 2000 నుంచి 2014 మధ్య కాలంలో వరుసగా విజయాలు వచ్చాయి. సక్సెస్ స్ట్రీక్ మైంటైన్ చేశారు. కానీ, ఆయన గత కొన్ని ఏళ్లుగా సరైన విజయాలు లేక సతమతం అవుతున్నారు. ఇప్పుడు 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు')తో అయినా సక్సెస్ కొడతారా? బ్లాక్ బస్టర్ కొట్టి తన స్టార్‌డమ్ తిరిగి పొందుతారా? అనేది చూడాలి.  

సింగమ్ తర్వాత సూర్యకు సరైన హిట్ ఎక్కడ?
తమిళంలో సూర్య స్టార్ హీరో. అయితే... ఆయనకు 'గజినీ' తెలుగులో స్టార్ డమ్ తీసుకు వచ్చింది. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. 'సింగం' సిరీస్ అయితే తెలుగు, తమిళ భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 'సింగమ్ 3' తర్వాత సూర్యకు సరైన విజయం రాలేదు.

ఓటీటీలకు వెళ్ళిన రెండు సూర్య హిట్ సినిమాలు!
'సింగమ్ 3' తర్వాత సూర్య అసలు సరైన సినిమా చేయలేదా? అంటే చేశారు. కానీ, ఆ రెండు సినిమాలు ఓటీటీల్లోకి వెళ్ళాయి. 'ఆకాశమే నీ హద్దురా' (తమిళంలో 'సూరరై పొట్రు'), 'జై భీమ్' మంచి సినిమాలే. కరోనా వల్ల థియేటర్లు బంద్ అవ్వడంతో ఆ రెండూ ఓటీటీల్లోకి వచ్చాయి. ఒకవేళ థియేటర్లలోకి వచ్చి ఉంటే భారీ విజయాలు సాధించేవి. దాంతో సూర్య రెండు థియేట్రికల్ హిట్స్ మిస్ అయ్యారు. 

రోలెక్స్ చూపించిన ఇంపాక్ట్ హీరోగా చూపించలేదు!
'సింగమ్ 3' సినిమా 2017లో విడుదలైంది. ఆ తర్వాత సూర్య హీరోగా నటించిన ఆరు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన 'కంగువ' డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన 'రెట్రో' కూడా అంతే. ఆ రెండిటితో సూర్య ప్రయోగాలు చేశారని అనుకున్నా... అంతకు ముందు 'గ్యాంగ్', 'ఎన్.జి.కే' సినిమాలు ఫ్లాపే.

Also Read: కమల్‌ వల్ల కాలేదు... రజనీ రాలేదు... 60 ఏళ్ళ ద్రావిడ ప్రభుత్వాలను విజయ్ ఎలా ఓడించాడు? సక్సెస్ ఫార్ములా ఏంటి?

లోక నాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలో ఆయన అతిథి పాత్ర రోలెక్స్ చేశారు. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. హీరోగా చేసిన క్యారెక్టర్లు ఏవీ ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించలేదు. దాంతో సూర్య థియేట్రికల్ మార్కెట్ కూడా కొంత పడింది. మరి, ఇప్పుడు 'వీరభద్రుడు'తో హిట్ కొడతారా? లేదా? అనేది చూడాలి.

సుమారు 20 ఏళ్ళ తర్వాత సూర్యతో త్రిష ఫిల్మ్!
ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన 'కరుప్పు' (తెలుగు 'వీరభద్రుడు')ను ఫ్యాన్స్ కోసం చేసినట్టు సూర్య చెబుతున్నారు. ఇందులో ఆయన న్యాయవాది శరవణన్ పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్రకు మరొక పేరు 'కరుప్పు'. గ్రామ దైవం, న్యాయ రక్షకుడు కరుప్పుస్వామి స్ఫూర్తితో రూపొందించారు. ఈ సినిమా సూర్య మాస్ ఇమేజ్‌, స్టార్‌డమ్‌ను సెలబ్రేట్ చేసేలా ఉంటుందని అభిమానులకు దర్శకుడు భరోసా ఇచ్చారు.

Also Read: ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి

'వీరభద్రుడు'లో సుమారు 20 ఏళ్ల తర్వాత త్రిష, సూర్య మళ్ళీ జంటగా నటించారు.  మరి, ఈ మాస్ ఎంటర్‌టైనర్... సామాజిక సందేశంతో కూడిన సినిమా ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి. 'విక్రమ్'తో కమల్ హాసన్, 'జైలర్'తో రజనీకాంత్ ఎలా కమ్ బ్యాక్ ఇచ్చారో... సూర్య కూడా బాక్సాఫీస్ బరిలో అటువంటి కమ్ బ్యాక్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి.

Suriya Upcoming Movies: 'వీరభద్రుడు' తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'విశ్వనాథన్ అండ్ సన్స్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మలయాళ దర్శకుడు మరియు జిత్తు మాధవన్‌తో మరొక సినిమా అంగీకరించారు. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

Also ReadSA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి?

Frequently Asked Questions

సింగమ్ 3 తర్వాత సూర్యకు సరైన విజయం ఎప్పుడు వచ్చింది?

సింగమ్ 3 తర్వాత సూర్యకు సరైన విజయం రాలేదు. ఆయన నటించిన 'ఆకాశమే నీ హద్దురా' (సూరరై పొట్రు), 'జై భీమ్' సినిమాలు కరోనా కారణంగా ఓటీటీల్లో విడుదలయ్యాయి.

సూర్య 'రోలెక్స్' పాత్రకు వచ్చిన స్పందన హీరోగా వచ్చిన పాత్రలకు ఎందుకు రాలేదు?

కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలో సూర్య అతిథి పాత్ర 'రోలెక్స్' కు విపరీతమైన స్పందన వచ్చింది. కానీ, హీరోగా నటించిన పాత్రలు ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించలేకపోయాయి.

'వీరభద్రుడు' (కరుప్పు) సినిమాకు సంబంధించిన ప్రధాన అంశాలు ఏమిటి?

'వీరభద్రుడు'లో సూర్య న్యాయవాది శరవణన్ పాత్రలో కనిపిస్తారు, దీనికి 'కరుప్పు' అని మరో పేరుంది. ఈ సినిమా సూర్య మాస్ ఇమేజ్‌ను సెలబ్రేట్ చేసేలా ఉంటుందని దర్శకుడు తెలిపారు.

సూర్య, త్రిష సుమారు 20 ఏళ్ల తర్వాత 'వీరభద్రుడు' సినిమాలో కలిసి నటిస్తున్నారా?

అవును, 'వీరభద్రుడు' సినిమాలో సుమారు 20 ఏళ్ల తర్వాత సూర్య, త్రిష మళ్ళీ జంటగా నటిస్తున్నారు.

'వీరభద్రుడు' తర్వాత సూర్య రాబోయే సినిమాలు ఏమిటి?

'వీరభద్రుడు' తర్వాత సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'విశ్వనాథన్ అండ్ సన్స్' తో పాటు మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్‌తో మరో సినిమాలో కనిపించనున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Mahendragiri Varahi : మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!
మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!
Pyaar Prema Kalyanam OTT : ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Venkatesh AK47 : చిట్టిబాబుగా వెంకటేశ్ - ఆదర్శ కుటుంబంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్
చిట్టిబాబుగా వెంకటేశ్ - ఆదర్శ కుటుంబంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget