అన్వేషించండి

Hamare Baarah Movie: 'హమారే బారా' మూవీపై కొనసాగుతున్న దుమారం, విడుదలపై నిషేధం విధించిన ప్రభుత్వం

'హమారే బారా' సినిమాపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముస్లీంల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటక సర్కారు ఈ మూవీ విడుదలను నిషేధించింది.

Hamare Baarah Movie Controversy: ముస్లీం మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బేస్ చేసుకుని తెరకెక్కిన తాజా చిత్రం ‘హమారే బారా‘. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ చిత్రం ముస్లీం మహిళలను, ఇస్లాం మతాన్ని కించపరిచేలా ఉందంటూ ముస్లీంలు రగడ చేస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా విడుదలపై ఇప్పటికే బాంబే హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా కర్నాటక సర్కారు కూడా ఈ సినిమా విడుదలపై నిషేధం విధిచింది.

కోర్టు చిక్కుల్లో ‘హమారే బారా‘ చిత్రం

కమల్ చంద్ర దర్శకత్వం వహించిన ‘హమారే బారా‘ సినిమాలో అన్నూ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. కొద్ది వారాల క్రితమే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. అప్పటి నుంచి ఈ సినిమాపై వివాదం కొనసాగుతోంది. ఈ సినిమా తెరకెక్కించిన విధానాన్ని తప్పుబడుతూ కొంత మంది ముస్లీంలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం విడుదలపై స్టే విధించింది. జూన్ 14 వరకు రిలీజ్ చేయకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 10కి వాయిదా వేసింది. ఈ చిత్రంలో ఇస్లాంను కించపరచడంతో పాటు చెడుగా చిత్రీకరించాని పిటీషనర్ ఆరోపించారు. మరోవైపు ఈ సినిమాకు ఇప్పటికే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసింది. కొన్ని డైలాగులకు కట్ చెప్తూ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఇదే విషయాన్ని సెన్సార్ బోర్డు కోర్టుకు తెలిపింది. 

‘హమారే బారా‘ సినిమా విడుదలను నిషేధించిన కర్నాటక సర్కారు

తాజాగా ‘హమారా బారా‘ సినిమా విషయంలో కర్నాటక సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా విడుదలను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. కర్ణాటక సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1964లోని సెక్షన్ 15 (1), 15 (5) ప్రకారం, ఆ రాష్ట్రంలో  విడుదలను బ్యాన్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మత సామరస్యానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంగానే ఈ సినిమా ప్రదర్శనపై నిషేధం విధిస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం తెలిపింది.   

ఏ మతాన్ని చెడుగా చూపించలేదు- చిత్రబృందం

‘హమారే బారా‘ సినిమాపై వస్తున్న విమర్శలపై చిత్రబృందం స్పందించింది. ఈ సినిమాలో ఏ మతం గురించి, వ్యక్తుల గురించి చెడుగా చూపించలేదని వెల్లడించింది. సినిమా చూడకముందే ఓ నిర్ణయానికి రావడం సరికాదని ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన అన్నూ కపూర్ వెల్లడించారు. “దయచేసి ‘హమారే బారా‘ సినిమా గురించి చెడుగా ప్రచారం చేయకండి. ఈ సినిమాను చూసిన తర్వాత మీ అభిప్రయాన్ని చెప్పండి. ఈ సినిమాలో మతాలను, వ్యక్తులను కించపరచలేదు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడవచ్చు. మహిళా సాధికారత గురించి చెప్పడంతో పాటు జనాభా నియంత్రణ గురించి ఈ సినిమాలో వివరించాం” అని తెలిపారు. మరోవైపు తమకు హత్యా బెదిరింపులు వస్తున్నాయని ‘హమారే బారా‘ చిత్రబృందం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సినిమా జూన్ 7న విడుదల కావాల్సి ఉన్నా పలు వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ చిత్రంలో అన్నూ కపూర్, పార్థ్ సమతాన్, అశ్విని కల్సేకర్, మనోజ్ జోషి, పరితోష్ త్రిపాఠి, రాహుల్ బగ్గా కీలక పాత్రలు పోషించారు.  

Read Also: పవన్ చెప్పులు మోసిన భార్య.. వీడియో వైరల్, అన్నా లెజినోవాకు సలాం చేస్తున్న నెటిజన్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Embed widget