అన్వేషించండి

Devara Ka Jigra: ఎన్టీఆర్, ఆలియాతో కరణ్ జోహార్... ఒకరికి తోడు మరొకరు, ఇద్దరికీ లాభమే!

Jr NTR - Alia Bhatt: 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, ఆలియా భట్ నటించారు. అయితే, ఆ సినిమాలో వాళ్లిద్దరూ జంట కాదు. కానీ, ఆ సినిమాతో స్నేహం ఏర్పడింది. అందుకే ఒకరికి తోడుగా మరొకరు వచ్చారు.

ఇప్పుడు ఇండియా అంతటా 'దేవర' మేనియా నెలకొంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముంబై వెళ్లినప్పటి నుంచి అటు సినిమా సర్కిల్స్, ఇటు సోషల్ మీడియా... అంతటా ఆయనే కనిపిస్తున్నారు. ఆయన్ను కలవడానికి దర్శకులు అమితాసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ను ఆలియా భట్ కలిశారు. అదీ ఎందుకో తెలుసా?

ఎన్టీఆర్, ఆలియాతో స్పెషల్ ఇంటర్వ్యూ
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'లో ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించారు. వాళ్లిద్దరి మధ్య సన్నివేశాలకు కథకు కీలకంగా నిలిచాయి. ఆ సినిమాలో వాళ్లిద్దరూ జంటగా నటించలేదు. కానీ, ఆ సినిమాతో మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు ఇద్దరు మిత్రులు ఒకరి తోడుగా మరొకరు నిలిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 

'దేవర' సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వస్తోంది. ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులకూ ఆ సంగతి తెలుసు. మరి, అలియా భట్ సినిమా? ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ ఫిల్మ్ 'జిగ్రా' అక్టోబర్ 11న థియేటర్లలోకి రానుంది. ఆ రెండు సినిమాల పబ్లిసిటీ కోసం ఎన్టీఆర్, ఆలియాను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంటర్వ్యూ చేశారు. అదీ సంగతి! ఆలియా భట్ ఉండటంతో హిందీ ప్రేక్షకుల్లో ఎక్కువ మందికి ఎన్టీఆర్ 'దేవర' తెలుస్తుంది. ఎన్టీఆర్ వల్ల సౌత్ ప్రేక్షకులకు 'జిగ్రా' గురించి తెలుస్తుంది. ఇద్దరికీ ఈ ఇంటర్వ్యూ లాభమే.

Also Read: అవును... మేం విడిపోయాం - ఆర్తితో విడాకులు కన్ఫర్మ్ చేసిన జయం రవి

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yuvasudha Arts (@yuvasudhaarts)

ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేసిన సందీప్ రెడ్డి వంగా
'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఎన్టీఆర్ మధ్య సమావేశం జరిగింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ కాంబినేషన్‌లో సినిమా వస్తే బావుంటుందని అభిమానులు ఆశించారు. సినిమా చేసే అంశమై ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరిగాయి. అయితే... అదొక్కటే కాదు, 'దేవర' విడుదల కోసం ఎన్టీఆర్‌ను సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ చేశారని తెలిసింది.

కపిల్ శర్మ కామెడీ షోలో ఎన్టీఆర్, జాన్వీ సందడి
'దేవర' ట్రైలర్ విడుదల ముందు రెండు రోజుల పాటు నార్త్ ఇండియాలో సినిమా పబ్లిసిటీ కోసం ఎన్టీఆర్ ముమ్మరంగా ఇంటర్వ్యూలు ఇచ్చారని తెలిసింది. అలాగే, ఫేమస్ హిందీ టీవీ కమెడియన్ 'కపిల్ శర్మ' కామెడీ షోలోనూ పాల్గొన్నారని తెలిసింది. 'ఆర్ఆర్ఆర్' విడుదల సమయంలోనూ ఎన్టీఆర్ ఆ కామెడీ షోకి వెళ్లారు. ఇప్పుడు ఆయనతో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, సినిమాలో కీలక పాత్ర చేసిన సైఫ్ అలీ ఖాన్ సైతం ఉన్నారని తెలిసింది.

Also Read'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'


కొరటాల శివ దర్శకత్వం వహించిన 'దేవర' చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కె నిర్మించారు. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై సినిమా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.

టాప్ హెడ్ లైన్స్

Swathi Wedding: దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Ravi Mohan: అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?
అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?
Dug Dug OTT : ఆ ఊరికి బైకే దేవుడు - ఓటీటీలోకి సడన్‌గా సెటైరికల్ కామెడీ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆ ఊరికి బైకే దేవుడు - ఓటీటీలోకి సడన్‌గా సెటైరికల్ కామెడీ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Swathi Wedding: దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Telangana Man Buys Bike With 10 Rupee Coins: చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
Hybrid SUV Range: 1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
US Iran News: ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
Embed widget