Hero Yash: కిరాణ షాపుకు వెళ్లిన పాన్ ఇండియా స్టార్ యష్ - అక్కడ ఏం కొన్నాడో తెలుసా?
Rocking Star Yash: తాజాగా కన్నడ హీరో రాకింగ్ స్టార్ యష్ చర్చనీయాంశం అయ్యాడు. భార్య కోసం అతడు చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. భార్య కోరిక తీర్చడం కోసం..
![Hero Yash: కిరాణ షాపుకు వెళ్లిన పాన్ ఇండియా స్టార్ యష్ - అక్కడ ఏం కొన్నాడో తెలుసా? Kannada Hero Yash Buy Ice Candy at Kirana Shop For His Wife Radhika And Daughter Hero Yash: కిరాణ షాపుకు వెళ్లిన పాన్ ఇండియా స్టార్ యష్ - అక్కడ ఏం కొన్నాడో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/18/74cd8271a04cbeb59b4d23f687a191fb1708197674240929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Yash At Kirana Shop: సెలబ్రిటీల లైఫ్ అంటే సామాన్య ప్రజలకు సెలబ్రిటీల లైఫ్ ఎప్పుడు ఆసక్తి చూపిస్తుంటారు. వారు వాడే బ్రాండ్స్ నుంచి వారు తిని ఫుడ్ వరకు ప్రతి దానిపై ఫోకస్ పెడుతుంటారు. ఈక్రమంలో వారు ఏం చేసిన అది చర్చనీయాంశం అవుతుంది. ఇక సెలబ్రిటీలు సాధారణం బయట ఎక్కడైన కనిపించారంటే ఇంకా అక్కడ ప్రజలు గుమికూడుతారు. వారిని తమ సెల్‌ఫోన్లో బంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా కన్నడ హీరో రాకింగ్ స్టార్ యష్ చర్చనీయాంశం అయ్యాడు. భార్య కోసం అతడు చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. భార్య కోరిక తీర్చడం కోసం అతడు సాధారణ కిరాణ కొట్టుకు వెళ్లాడు.
దీన్ని అక్కడ ఉన్న ఫొటో తీస్తున్నారు. అంత పెద్ద స్టార్ హోదా ఉన్నప్పటికీ సామాన్యుడిలా కిరాణం కొట్టుకు వెళ్లడం చూసి అంతా అందరిని సర్‌ప్రైజ్ అవుతున్నారు. కాగా యష్ ఇటీవల తన భార్య, ప్రముఖ నటి రాధిక పండిట్, కూతురు ఐరాతో కలిసి కర్ణాటకలోని భత్కల్ జిల్లా షిరాలీలో ఉన్న ప్రసిద్ధ చిత్రపూర్ మఠాన్ని సందర్శించాడు. ఈ క్రమంలో ఆయన భార్య రాధిక తనకు ఐష్ క్యాండీ తినాలని ఉంది అడిగిందట. దీంతో భార్య కోరిక తీర్చడం కోసం అక్కడే ఉన్న కిరాణ కొట్టు ముందు ఆగాడు. అక్కడ కూతురు, భార్య కోసం క్యాండీ కొంటున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక యష్ క్యాండీ కొంటుండగా రాధిక ఆ పక్కనే కూర్చోని క్యాండీ తింటూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
Rocking Star Yash purchases ice candy for his wife Radhika from a small grocery shop.
— Manobala Vijayabalan (@ManobalaV) February 17, 2024
Despite huge stardom, #Yash remains simple and humble
This is during their recent… pic.twitter.com/YTRW6av6xJ
మరోవైపు యశ్ తన కుటుంబంతో కలిసి చిత్రపూర్ మఠాన్ని సందర్శించేందుకు వచ్చాడని తెలిసి పరిసర ప్రాంతాల్లోని అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. సెల్ఫీలు, ఫోటోల ఎగబడ్డారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఫ్యాన్స్‌ను నియంత్రించారు. అయితే యష్ ఎప్పుడు సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడనే విషయం తెలిసిందే. స్టార్‌డమ్‌కు దూరంగా సాధారణ జీవితాన్ని జీవించడమే అతడికి ఇష్టం. యష్ ఇంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటానికి ఇది ఒక కారణం అని చెప్పోచ్చు. యశ్ అతి సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చి స్టార్‌గా ఎదిగాడు. సీరియల్స్ యాక్టింగ్ కెరియర్ మొదలుపెట్టి సినీ పరిశ్రమలో సూపర్ స్టార్‌గా మారాడు. యశ్ తండ్రి బస్సు డ్రైవర్ అనే విషయం తెలిసిందే.
కాగా యశ్ ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘టాక్సిక్’ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా అతడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే యష్ ప్రశాంత్ నీల్ కేజీయఫ్ చిత్రాలతో నేషనల్ స్టార్ అయిపోయాడు. అప్పటి కన్నడ వరకే ఉన్న అతడి క్రేజ్ కేజీయఫ్‌తో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లింది. కేజీయఫ్ సీక్వెల్స్ బ్లాక్‌బస్టర్ కావడంతో యష్ దేశ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కేజీయఫ్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఇమేజ్ సొంతం చేసుకున్న అతడు నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తి నెలకొంది. ఇక అతడి ఏ రేంజ్‌లో బిజీగా అయిపోతాడా? ఫ్యాన్స్ అంతా అంచనాలు వేసుకున్నారు. కానీ అందుకు భిన్నంగా యష్ ఇప్పటి వరకు ఎలాంటి భారీ ప్రాజెక్ట్‌కు సంతకం చేయకపోవడం గమనార్హం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)