Kangana Ranaut: ఆ హీరో పెదాలు పగిలేలా ముద్దుపెట్టిన కంగనా? హృతిక్ తర్వాత అతనా అంటూ క్వీన్ సెటైర్!
కంగనా రనౌత్ గతంలో నటించిన ఓ సినిమాలో ముద్దు సీన్ గురించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై తాజాగా కంగనా సెటైరికల్ గా స్పందిందించి అంతే కాదు...
Kangana Ranaut: బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదొక వివాదంలో చిక్కుకుంటుంది. ఆమె బహిరంగంగానే చేసే వ్యాఖ్యలే కాకుండా సోషల్ మీడియాలో కూడా చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడూ చర్చనీయాంశమవుతాయి. తాజా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఆమె నటించిన ఓ సినిమాలో ముద్దు సీన్ గురించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై తాజాగా కంగనా సెటైరికల్ గా స్పందిందించి అంతే కాదు సంబంధంలేని హృతిక్ రోషన్ ను కూడా ఇందులోకి లాగడంతో ఆమె పోస్ట్ కొత్త చర్చకు దారితీస్తోంది.
‘రివాల్వర్ రాణి’ మూవీ ముద్దు సీన్ పై స్పందించిన కంగనా..
ఇటీవల ఓ వార్తా సంస్థ ‘రివాల్వర్ రాణి’ సినిమాలోని ముద్దు సన్నివేశం గురించి వార్తను ప్రచురించింది. ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో కంగనా వీర్ దాస్ ను ముద్దు పెట్టుకుంటుంది. అయితే ఆ సన్నివేశంలో కంగనా రనౌత్.. వీర్ దాస్ పెదవుల నుంచి రక్తం వచ్చేలా ముద్దుపెట్టిందంటూ ఆ వార్తలో పేర్కొన్నారు. దీనిపై కంగనా రనౌత్ తన స్టైల్ లో స్పందించింది. ఈ మేరకు ఆ వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ ఓ నోట్ ను కూడా రాసుకొచ్చింది. ‘‘హృతిక్ రోషన్ తర్వాత నేను దాడి చేసింది వీర్ దాస్ పైనా. ఇది ఎప్పుడు జరిగింది?’’ అంటూ ఫన్నీ ఎమోజీలను యాడ్ చేసింది.
హృతిక్ రోషన్ పేరు ప్రస్తావించడంతో..
అయితే కంగనా రనౌత్ ‘రివాల్వర్ రాణి’ లో ముద్దు సీన్ పై స్పందించడం వరకూ బానే ఉంది. కానీ ఇందులోకి హృతిక్ రోషన్ పేరును ప్రస్తావించడంతోనే ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. కావాలనే కంగనా హృతిక్ పేరును ప్రస్తావించిందని అంటున్నారు పలువురు నెటిజన్స్. అయితే గతంలో 2016 - 2017 ఆ సమయంలో హృతిక్ కు కంగనాకు మధ్య పెద్ద వార్ నే నడించింది. ఆమె హృతిక్ తో డేటింగ్ చేశానని బహిరంగంగా ప్రకటించింది అయితే దాన్ని హృతిక్ రోషన్ ఖండించారు. అలాంటివేమీ జరగలేదని అదంతా కేవలం ఆరోపణలేనని తేల్చి చెప్పారు. ఇలా వారి మధ్య మాటల యుద్దం కొన్నాళ్ల పాటు సాగింది. తాజాగా మళ్లీ ఈ వ్యవహారంలో కంగనా హృతిక్ రోషన్ పేరు లాగడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. మరి దీనిపై హృతిక్ రోషన్ స్పందిస్తారో లేదో చూడాలి.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న కంగనా..
కంగనా రనౌత్ ప్రస్తుతం ‘తేజస్’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ తేజస్ గిల్ అనే పైలట్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోంది. సర్వేష్ మేవారా దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ అక్టోబర్ 20 న విడుదల కానుంది. దీనితో పాటు కంగనా ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇందులో ఆమె మాజీ ప్రధాని దివంగత నేత ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో కంగనా స్వీయ దర్శకత్వంలో నటిస్తోంది. అలాగే ‘చంద్రముఖి 2’ మూవీలో కూడా కంగనా నటిస్తోంది.
Also Read: చావు భయంతో నిద్రలేని రాత్రులు - ఆ సీన్స్ కోసం 2 నెలలు శ్రమించా: ఎం.ఎం.కీరవాణి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial