Project K: ‘ప్రాజెక్ట్ కె’లో విలన్ పాత్రకు కమల్ అంత డిమాండ్ చేశారా? అసలు నిజం ఇది!
స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న భారీ మూవీ ‘ప్రాజెక్ట్ కె’లో విలన్ గా కమల్ హాసన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. విలన్ పాత్ర కోసం కమల్ కు నిర్మాత అశ్విని దత్ భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట.
Project K: టాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్త సినిమా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను రోజురోజుకూ పెంచేస్తున్న ప్రాజెక్టుల్లో హీరో ప్రభాస్ నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా ఒకటి. ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. ఈ భారీ మూవీలో విలన్ గా కమల్ హాసన్ నటిస్తున్నారనే వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడీ మూవీలో కమల్ హాసన్ నటిస్తున్నారనే వార్తల ప్రచారంతో మూవీ పై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.
కమల్ హాసన్ కు రూ.150 కోట్ల ఆఫర్ నిజమేనా?
‘ప్రాజెక్ట్ కె’ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతీ అంశంపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీలో విలన్ గా కమల్ హాసన్ ను అనుకున్నారట. విలన్ పాత్ర కోసం కమల్ కు భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట నిర్మాత అశ్విని దత్. ఈ ఒక్క పాత్ర కోసం ఏకంగా రూ. 150 కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వాస్తవానికి ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఎందుకంటే దీనిపై కమల్ ఇంకా దీనిపై క్లారిటీ ఇవ్వలేదని, త్వరలో మళ్లీ కమల్ తో చర్చలు జరిపి దీనిపై స్పష్టత ఇస్తామని మూవీ టీమ్ పేర్కొంది.
ఇప్పటికే కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అందేకే కమల్ ను ఈ సినిమాలోకి తీసుకుంటే చాలా ప్లస్ అవుతుందనేది మూవీ టీమ్ మాట. అయితే దీనిపై చిత్ర దర్శక, నిర్మాతలు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ‘ప్రాజెక్ట్ కె’ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి జనవరి 12 న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఆ తేదీ నాటికి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయా అనేదే కాస్త ప్రశ్నార్థంగా మారింది. షూటింగ్ లో ఏ మాత్రం ఆలస్యం జరిగినా మూవీ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ముందు అనుకున్నట్టుగానే మూవీను అదే రోజు రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. ఇక ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ కంపోజర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Read Also: కొడుకును ఫ్లైట్ ఎక్కించేందుకు కన్నతండ్రి ఆవేదన, కంటతడి పెట్టిస్తున్న ‘విమానం‘ ట్రైలర్