Kinnerasani OTT Release Date: డైరెక్టుగా ఓటీటీలోకి 'కిన్నెరసాని' - విడుదల ఎప్పుడంటే?
కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన 'కిన్నెరసాని' సినిమా డైరెక్టుగా ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది.
కళ్యాణ్ దేవ్ (Kalyaan Dhev) కథానాయకుడిగా నటించిన సినిమా 'కిన్నెరసాని' (Kinnerasani Movie). నాగశౌర్య 'అశ్వథ్థామ' చిత్రానికి దర్శకత్వం వహించిన రమణ తేజ తెరకెక్కించిన చిత్రమిది. రజనీ తళ్లూరి, రవి చింతల నిర్మాతలు. రామ్ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో ఎస్.ఆర్.టి ఎంటర్‌టైన్‌మెంట్స్, శుభమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పుడీ సినిమా డైరెక్టుగా ఓటీటీలో విడుదల కానుంది.
'జీ 5' ఓటీటీలో జూన్ 10న 'కిన్నెరసాని' విడుదల కానుంది (Kinnerasani Movie Premieres 10th June only on ZEE5). నేడు ఆ విషయాన్ని 'జీ 5' సంస్థ వెల్లడించింది. సుమారు ఐదు నెలల క్రితమే 'కిన్నెరసాని' ట్రైలర్ విడుదల చేశారు. థియేటర్లలో సినిమా విడుదల చేయాలనుకున్నారు. ఏమైందో... ఏమో... ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
Also Read: 'విక్రమ్' రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన థ్రిల్లర్ సినిమా 'కిన్నెరసాని'. 'కారణం లేని ప్రేమ, గమ్యం లేని ప్రయాణం చాలా గొప్పవి కదా', 'ఆగదు ఈ అన్వేషణ, ఒక ప్రాణం తీసేంత వరకూ', 'నీకో రహస్యం చెప్పనా? ఇది కథ కాదు, ఇందులోని ప్రతి అక్షరం నిజం' వంటి డైలాగులు సినిమాపై ఆసక్తి పెంచాయి. షీతల్, కషిష్ ఖాన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.
Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే?
View this post on Instagram