Kalki 2898 AD Update: 'కల్కి' నుంచి ఊహించని అప్‌డేట్ - ప్రభాస్ పాత్రను పరిచయం చేసిన టీం, అదిరిపోయిన 'డార్లింగ్' కొత్త లుక్
Kalki 2898 AD: ప్రభాస్ కల్కీ మూవీ నుంచి ఊహించని సర్‌ప్రైజ్ అందింది. మహాశివరాత్రి కానుకగా అదరిపోయే అప్‌డేట్ ఇచ్చిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ చేసింది మూవీ టీం. ప్రభాస్ న్యూలుక్ నెక్ట్స్ లెవల్ అంతే..
Kalki 2898 AD New Update: 'డార్లింగ్' ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్ వచ్చేసింది. శివరాత్రి సందర్భంగా 'కల్కి 2898 ఏడీ' నుంచి మూవీ ఎదైనా స్పెషల్ అప్‌డేట్ ఉంటుందేమో అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఫ్యాన్స్ ఏమాత్రం నిరాశపడకుండ 'కల్కి' టీం తాజాగా అదిరిపోయే అప్‌డేట్ వదిలింది. ఇది చూసి మూవీ లవర్స్ ఫుల్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. అప్‌డేట్ కోసం వేయిట్ చేశాము. కానీ, ఈ రేంజ్‌లో సర్‌ప్రైజ్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటున్నారు. ఇంతకి కల్కీ టీం ఇచ్చిన అప్‌డేట్ చూస్తే మీరు కూడా అవాక్కవ్యాల్సిందే.
ఎందుకంటే అలాంటి ఇలాంటి అప్‌డేట్ కాకుండా ఏకంగా ప్రభాస్ పాత్రను పరిచయం చేసింది 'కల్కి' టీం. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రభాస్ కొత్త లుక్ చూసి స్టన్ అవుతున్నారు. "కాశీ యొక్క భవిష్యత్తు వీధుల నుండి 'భైరవ'ను పరిచయం చేస్తున్నాం. #Kalki2898AD" అంటూ మూవీ నుంచి కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో ప్రభాస్ రోల్ చాలా కొత్తగా ఉందని, కొత్త లుక్ అయితే నెక్ట్స్ లెవల్ అంటున్నారు. ప్రస్తుతం కొత్త అప్‌డేట్ మూవీ ఓ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేస్తుంది.
From the future streets of Kasi, Introducing 'BHAIRAVA' from #Kalki2898AD.#Prabhas #Kalki2898ADonMay9 @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/GzJyO3V5iQ
— Kalki 2898 AD (@Kalki2898AD) March 8, 2024
కాగా 'కల్కి 2898 ఏడీ' నుంచి అప్‌డేట్ వచ్చి చాలాకాలం అవుతుంది. మూవీ టీం కూడా ఫ్యాన్స్ ఆశించిన రేంజ్‌లో కొత్త కబురు ఏం రావడం లేదు. దీంతో శివరాత్రికి అయినా ఏదైనా స్పెషల్ అప్‌డేట్ ఉంటుందని ఆశించారు. శివరాత్రికి కల్కి టీం సర్‌ప్రైజ్ చేస్తుందంటూ నెల రోజులు ముందు నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, శివరాత్రి దగ్గరపడుతుండటం, కల్కి టీం నుంచి ఆఫీషియల్‌గా ఎలాంటి ప్రచారం కూడా రాలేదు. దీంతో శివరాత్రికి ఎలాంటి అప్‌డేట్ లేదంటూ రెండు రోజుల నుంచి ప్రచారం మొదలుపెట్టారు. కానీ దీనిపై కల్కి టీం కూడా స్పందించకపోవడం ఫ్యా్న్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు. ఇక ఈ శివరాత్రికి కూడా ఎలాంటి అప్‌డేట్ లేనట్టేనా? అని అంతా నిరాశ పడ్డారు. అయితే కల్కి టీం మాత్రం సైలెంట్ ప్రభాస్ కొత్త లుక్, పాత్రను పరిచయం చేసి డబుల్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం కల్కి నయా పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది.
'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె శా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా.. విశ్వ నటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఇంతకముందెన్నడూ చూడని యోధుడి లుక్ తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా ప్రమోషన్స్ చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్, దిశా పటానీలపై చిత్రీకరిస్తున్నది ఓ రొమాంటిక్ సాంగ్ అని.. ఇది ఈ మూవీలోని చివరి సాంగ్ అని టాక్ నడుస్తోంది. ఇక మహా శివరాత్రి నుంచి ప్రమోషన్స్ షురూ చెయ్యాలని భావించిన మూవీ టీం.. ప్రభాస్ క్యారెక్టర్ పరిచయంతో ప్రమోషన్స్ షూరూ చేసింది.