అన్వేషించండి

Kalki 2898: RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘కల్కీ 2898 AD’ - క్రేజ్ మామూలుగా లేదుగా!

'క‌ల్కీ'.. డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ అంతా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ట్రైల‌ర్ అదిరిపోయింది. ఇప్పుడు ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే వార్త‌ ఇది. 'కల్కీ' సినిమా 'ఆర్ ఆర్ ఆర్' రికార్డు బ‌ద్ద‌లు కొట్టింది.

Kalki 2898 Breaks RRR RRR’s Record: డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన 'క‌ల్కీ 2898 ఏడి' సినిమా కోసం ఆయ‌న ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. జూన్ 27 ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? అని లెక్క‌లు వేసుకుంటున్నారు. కేవ‌లం డార్లింగ్ ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు.. సినిమా ల‌వ‌ర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. కార‌ణం సినిమా మీద క్రియేట్ అయిన హైప్. పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ ఒక రేంజ్ లో ఉన్నాయి. అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. దీంతో సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు చాలామంది. సినిమా చూసేందుకు విప‌రీత‌మైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు RRR రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. 

రికార్డు బ‌ద్ద‌లు.. 

రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'RRR' సినిమా రిలీజ్ కి ముందే క‌లెక్ష‌న్లలో దూసుకుపోయింది. ప్రీ సేల్స్ భారీగా వ‌చ్చాయి. అయితే, ఇప్పుడు 'RRR' ని క్రాస్ చేసింది 'క‌ల్కీ'. ఓవ‌ర్ సీస్ లో 'కల్కీ' ప్రీ సేల్స్ స్టార్ట్ అయిపోయాయి. ప్రీ సేల్స్ విష‌యంలో 'RRR' రికార్డును బ్రేక్ చేసింది 'క‌ల్కీ'. నార్త్ అమెరికాలో ఇప్ప‌టికే మిలియ‌న్ డాల‌ర్ల ప్రీ సేల్ బిజినెస్ జ‌రిగింది. మిలియ‌న్ డాల‌ర్ ప్రీ సేల్ క్రాస్ అయిన మొద‌టి ఇండియ‌న్ సినిమాగా 'క‌ల్కీ' రికార్డులకి ఎక్కింది. అయితే, త‌ర్వ‌లోనే అది కాస్తా రెండు మిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇంకా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో అని అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

విప‌రీత‌మైన క్రేజ్.. 

నిజానికి 'క‌ల్కీ 2898' అనే టైటిల్ ప్ర‌కటించిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. తెలుగులో వ‌స్తున్న మొద‌టి సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్ కావ‌డంతో అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌భాస్ ఈ సినిమాలో కొత్త‌గా క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ లో సినిమాపై క్రేజ్ పెరిగింది. 'బాహుబ‌లి' త‌ర్వాత చాలా గ్యాప్ తో 'స‌లార్' హిట్ అందుకుంది. ఆ హిట్ త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో 'క‌ల్కీ 2898' కూడా భారీ హిట్ కొట్టాల‌ని కోరుకుంటున్నారు ప్ర‌తి ఒక్క‌రు. 

భారీ బ‌డ్జెట్ తో.. 

'క‌ల్కీ' సినిమా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఈసినిమాపై ప్ర‌త్యేక దృష్టి సారించారు. వైజయంతీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అశ్వనీ దత్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాని దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కించారు. భారీ వీఎఫ్ఎక్స్ తో ఈ సినిమాని తెర‌కెక్కించారు. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూన్ 27న రిలీజ్ కానుంది. 

పాన్ ఇండియా సినిమా.. పాన్ ఇండియా స్టార్స్.. 

క‌ల్కీ 2898 పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో కూడా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ప్ర‌భాస్ ప్ర‌ధాన పోషించ‌గా  అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, బ్ర‌హ్మానందం, రాజేంద్ర ప్రసాద్, ప‌సుప‌తి, శోభ‌న‌, మృణాల్ ఠాకూర్ త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ డైరెక్ట‌ర్. 

ఆక‌ట్టుకున్న ట్రైల‌ర్.. 

'క‌ల్కీ 2898 ఏడీ' ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను తెగ ఆక‌ట్టుకుంది. ట్రైల‌ర్ సినిమాపై భారీగా అంచ‌నాల‌ను పెంచేసింది. దానికి తోడు నాగ్ అశ్విన్ అండ్ టీమ్ ప్లాన్ చేసిన వెరైటీ  ప్ర‌చార కార్య‌క్ర‌మాలు, ఎలివేష‌న్స్ అంద‌రిలో ఇంట్రెస్ట్ క‌లిగిస్తున్నాయి. బుజ్జి అనే కారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్ర‌భాస్ ఆ కారులో ఎంట్రీ ఇవ్వ‌టం లాంటివి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. దీంతో సినిమా కోసం ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు అంద‌రూ. చూడాలి మ‌రి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుందో. ఇంకెన్ని రికార్డులు బ‌ద్ద‌లుకొడుతుందో.  

Also Read: హీరోయిన్ అవుతానంటే నవ్వారు, కలలు కనడానికి వయసుతో సంబంధం లేదు - చాందిని చౌదరీ

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Honda Shine 125: రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Honda Shine 125: రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget