అన్వేషించండి

Kalinga Teaser: ‘కళింగ’ టీజర్ - తన చెవిని తానే కోసుకు తినేసే అమ్మాయి.. అసలు ఆ అడవి కథేంటి? ఆ గుహలో ఎవరున్నారు?

Kalinga Teaser: ధృవ వాయు దర్శకత్వం వహించడంతో పాటు తానే హీరోగా నటించిన ‘కళింగ’ సినిమా టీజర్ తాజాగా విడుదలయ్యింది. ఈ టీజర్ చూస్తుంటే గ్రామంలోని మూఢనమ్మకాల నేపథ్యంలో తెరకెక్కిన మూవీ అని అర్థమవుతోంది.

Kalinga Teaser Out Now: ఒక గ్రామం, అక్కడి ప్రజలు, వారి నమ్మకాలు.. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అవుతున్నాయి. అందుకే ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న చిత్రాలను ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ముందుకొస్తున్నారు. ఆ లిస్ట్‌లో మరో తెలుగు సినిమా యాడ్ అవ్వనుంది. అదే ‘కళింగ’. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలయ్యింది. టీజర్‌ను బట్టి చూస్తేనే ఈ సినిమాలో ఎన్నో డిస్టర్బింగ్ సీన్స్ ఉన్నాయని అర్థమవుతోంది. ‘కళింగ’ను ధృవ వాయు డైరెక్ట్ చేయడం మాత్రమే కాకుండా ఇందులో తానే హీరోగా నటించి అందరినీ ఆశ్చర్యపరచనున్నాడు.

సంపద చుట్టూ కథ..

‘కళింగ’ టీజర్ ఓపెన్ చేయగానే ఒక దట్టమైన అడవి, అందులో పారే జలపాతం కనిపిస్తాయి. చీకట్లో తన మనవరాలు మల్లిని వెతుక్కుంటూ వెళ్తాడు ఒక తాత. అప్పుడే తన మనవరాలు.. తన చెవిని తానే కోసుకొని తినడం చూసి భయపడి పారిపోతాడు. అలా టీజర్ మొదట్లోనే ఈ సినిమా ఏ రేంజ్‌లో డిస్టర్బింగ్‌గా ఉండబోతుందో చూపించాడు ధృవ వాయు. ఆ తర్వాత అదే తాత ఆ అడవి కథ ఏంటో వివరిస్తాడు. ‘‘చీకటి అడవిలో నీకొక కథ చెప్తా.. ఒక రాజ్యాన్ని ఒక రాజు పాలించేవాడు. ఆ వంశం నుంచి తీసుకొచ్చిన సంపద ఈ అడవిలో ఎక్కడో ఉంది’’ అంటూ కథను ముగిస్తాడు.

తాగుబోతు హీరో..

‘కళింగ’ టీజర్‌లో గ్రామంలో నివసించే అల్లరి యువకుడి పాత్రలో ధృవ వాయు పరిచయమవుతాడు. ఏదో పీడకల రావడంతో తను ఉలిక్కిపడి లేస్తాడు. ‘‘వాడు తాగుబోతే. అలాంటి వాడికి నా బిడ్డను ఇచ్చి పెళ్లి చేయమంటున్నావా’’ అంటూ హీరోయిన్ తండ్రి చెప్పే డైలాగ్‌తో హీరో క్యారెక్టర్ ఏంటో ఆడియన్స్‌కు క్లారిటీ వస్తుంది. అప్పుడే పద్దు అనే పాత్రలో హీరోయిన్ ప్రగ్యా నయన్ ఎంట్రీ ఇస్తుంది. హీరో, హీరోయిన్ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అడవిలో ఒక పూజను పూర్తి చేసిన తర్వాత ‘‘ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడొద్దు’’ అని పూజారి చెప్పినా అది వినకుండా ఒక వ్యక్తి తిరిగిచూస్తాడు. దీంతో ఏదో శక్తి వారందరినీ వెంటాడుతుంది.

ఇదొక పద్మవ్యూహం..

‘కళింగ’ టీజర్‌లో ‘‘ఈ పొలిమేర కథేంటి’’ అని ఒక వ్యక్తి అడగగా.. ‘‘సంస్థానం అనేది ఒక పద్మవ్యూహం. అందులోకి వెళ్లడమే తప్పా రావడం ఉండదు’’ అని మరొక వ్యక్తి చెప్తాడు. ఈ టీజర్‌లో భయపెట్టే షాట్స్ ఎక్కువగా ఉన్నాయి. చేతబడి చక్రంలో బొమ్మ, శవాన్ని పాతిపెట్టే ముందు జరిగే పూజలు, గుహలో రహస్యం.. ఇలాంటి షాట్స్.. ‘కళింగ’ టీజర్‌లో చాలానే ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే స్టోరీ ఏంటో రివీల్ చేయకపోయినా ఈ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేయడంలో ధృవ వాయు సక్సెస్ అయ్యాడని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఈ టీజర్ చివర్లో ఒక వింత ఆకారం గుహ నుంచి బయటికి రావడం కూడా చూపించారు మేకర్స్. కానీ అదేంటో స్పష్టంగా చూపించలేదు.

Also Read: ‘ఖేల్ ఖేల్ మే’ ట్రైలర్ విడుదల - ఈ గేమ్ చాలా డేంజర్, కపుల్స్ మాత్రం అస్సలు ఆడొద్దు!

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget