అన్వేషించండి

Kajal Aggarwal: ‘ఇండియన్ 2’లో నా పాత్ర అలాంటిది, అందుకే నీల్‌ను షూటింగ్స్‌కు తీసుకువెళ్లను - కాజల్ అగర్వాల్

Kajal Aggarwal: టాలీవుడ్‌లోని సీనియర్ హీరోయిన్స్‌లో కాజల్ అగర్వాల్ ఒకరు. త్వరలో కమల్ హాసన్ సరసన ‘ఇండియన్ 2’లో కనిపించనున్న కాజల్.. ఆ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.

Kajal Aggarwal: టాలీవుడ్‌లో చందమామగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. తన తర్వాత ఎంతోమంది కొత్త హీరోయిన్లు వచ్చినా.. పెళ్లయ్యి, బిడ్డకు జన్మనిచ్చినా కూడా టాలీవుడ్‌లో కాజల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. త్వరలోనే ‘సత్యభామ’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అనేక ఇంటర్వ్యూలో పాల్గొంటున్న కాజల్.. పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటోంది. ఈ ఇంటర్వ్యూల్లో తన ప్రొఫెషనల్‌తో పాటు పర్సనల్ లైఫ్ విషయాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

సీరియస్ రోల్..

‘సత్యభామ’ సినిమాలో ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది కాజల్ అగర్వాల్. అయితే ఈ సినిమాలో పోలీస్ స్టేషన్‌ను, పోలీస్ పాత్రలను కాస్త డిఫరెంట్‌గా చూపించారని కాజల్ చెప్పుకొచ్చింది. ఇంతకు ముందు తను చేసిన పోలీస్ పాత్రలు చాలా కామెడీగా ఉన్నాయని, సత్యభామ మాత్రం చాలా సీరియస్ రోల్ అని చెప్పింది. కమల్ హాసన్‌తో కలిసి నటిస్తున్న ‘ఇండియన్ 2’ పైన కూడా కాజల్ స్పందించింది. ‘‘నాకు ఈ సినిమా అవకాశం నాలుగేళ్ల క్రితమే వచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత వచ్చి అవకాశం కాదు. కాకపోతే ఇదంతా ఇంత త్వరగా జరుగుతుందని నేను అనుకోలేదు. సినీ పరిశ్రమ అంటే ఇంతే. ఎప్పుడు ఏది జరగాలని రాసిపెట్టుంటుందో అప్పుడు అది జరుగుతుంది’’ అని తన తెలిపింది.

ఫ్యామిలీ సపోర్ట్..

‘‘బిడ్డ పుట్టగానే సినిమాను చేయడం నాకు సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నా చుట్టూ నన్ను సపోర్ట్ చేసే ఫ్యామిలీని నేను ఏర్పాటు చేసుకోగలిగాను. ఇండియన్ 2ను పూర్తిచేయడానికి నా భర్త కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు’’ అని తన కుటుంబం గురించి గర్వంగా చెప్పింది కాజల్. ‘‘షూటింగ్ సెట్‌లో కూడా అందరూ సపోర్ట్ చేసేవారు. నీల్.. సెట్స్‌కు రాకపోయినా.. మేము ఏ సిటీలో షూటింగ్ చేస్తే అక్కడ ఉండేవాడు. ఇప్పటివరకు నేను ఎక్కడికి వెళ్లినా నీల్ నాతోనే ఉన్నాడు. తను ఇంకా చిన్నపిల్లవాడే కాబట్టి సెట్స్‌కు తీసుకెళ్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయని నేను తీసుకెళ్లను. నా వర్క్ గురించి అర్థం చేసుకోవడానికి నీల్ ఇంకా చిన్నపిల్లవాడే’’ అని తెలిపింది కాజల్.

ఛాన్స్ ఇవ్వలేదు..

‘‘కమల్ హాసన్, శంకర్‌తో పనిచేయడం చాలా బాగుంది. ఇండియన్ 2లో నా పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది, అది చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది’’ అని చెప్పుకొచ్చింది కాజల్. కమల్ హాసన్‌తో పనిచేయడం కష్టంగా అనిపించిందా అని అడగగా.. ‘‘ఆయన నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. చాలా అర్థం చేసుకుంటారు. అందరూ సౌకర్యంగా ఉండేలా చూసుకుంటారు’’ అని కమల్ హాసన్‌ను ప్రశంసించింది. ఇండియన్ 2లోని పాత్ర కోసం తను చేసిన ప్రిపరేషన్స్ గురించి ప్రశ్నించగా.. ‘‘నేను ఈ సినిమా కోసం కళరిపైయట్టు, గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను. స్వాతంత్ర్యం ముందుకు జరిగే కథ ఇది. మిగతాది సినిమా ప్రమోషన్స్ సమయంలో చెప్తాను. ఇండియన్ 2 కోసం నేను పడిన కష్టం.. సత్యభామకు కూడా పనికొచ్చింది’’ అని బయటపెట్టింది కాజల్ అగర్వాల్.

Also Read: సేల్స్ పర్సన్‌గా మారిన దీపికా పదుకొనె - సొంత బ్రాండ్ కోసం బేబీ బంప్‌తో ప్రమోషన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget