Kajal Aggarwal: ప్రెగ్నెన్సీ తర్వాత కాజల్ అగర్వాల్ ఎలా ఉన్నారో చూశారా? బొద్దుగా, ముద్దుగా...
కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎలా ఉన్నారో చూశారా? సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫోటోలు పోస్ట్ చేశారు.
Kajal Aggarwal Latest Photos: 'ఇంత అందంగా ఎలా పుట్టావ్?' - కాజల్ అగర్వాల్ ఫోటో కింద ఓ నెటిజన్ పోస్ట్ చేసిన కామెంట్. ఇంకొకరు ఆమె చాలా అందంగా ఉన్నారని కామెంట్ చేశారు. 'వింటేజ్ కాజల్ ఈజ్ బ్యాక్' అని మరొకరు. ఈ విధంగా సుమారు 2000 కామెంట్స్.
కాజల్ అగర్వాల్ మూడు వారాలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత... ఆ బిడ్డకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అయితే, ప్రెగ్నెన్సీ తర్వాత కాజల్ ఎలా ఉన్నారు? అనే ప్రశ్నకు లేటెస్ట్ ఫోటోలు ఆన్సర్ ఇచ్చాయి.
కాజల్ కొంచెం ముద్దుగా, ఇంకొంచెం బొద్దుగా ఉన్నారు. సాధారణంగా డెలివరీ తర్వాత మహిళలు బరువు పెరుగుతాయి. కాజల్ కూడా బరువు పెరిగినట్టు తెలుస్తోంది. అలాగని, ఆమె మరీ బొద్దుగా లేరు. గర్భధారణకు ముందు ఎలా ఉన్నారో... అలాగే ఉన్నట్లు కనిపిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాల్లో నటించారు. మళ్ళీ ముఖానికి ఎప్పుడు మేకప్ వేసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Also Read: 'విక్రమ్' రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram
కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ (Gautam Kitchlu) దంపతులకు ఈ ఏడాది ఏప్రిల్ 19న అబ్బాయి పుట్టాడు. బాబుకు 'నీల్' అని నామకరణం చేశారు. గత ఏడాది గౌతమ్ కిచ్లూతో కాజల్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే?
View this post on Instagram