Kadaisi Vivasayi actress Murdered: మద్యం మత్తు నటి ప్రాణం తీసింది, చంపింది ఆమె కొడుకే
Kadaisi Vivasayi actress Murdered: మద్యం మత్తులో మనిషి ఏం చేస్తాడో అతనికే తెలీదు. మత్తులో జోగేందుకు వాళ్లు ఎంతకైనా తెగబడతారు. తల్లి అనే విషయం మర్చిపోయిన కొడుకు...
Kadaisi Vivasayi actress Murdered: మద్యం మత్తులో మనిషి ఏం చేస్తాడో అతనికే తెలీదు. మత్తులో జోగేందుకు వాళ్లు ఎంతకైనా తెగబడతారు. తల్లి అనే విషయం మర్చిపోయిన కొడుకు, డబ్బుల కోసం ఒక తమిళ నటిని చంపేశాడు. మద్యం మత్తులో కత్తితో పొడిచి దారుణానికి పాల్పడ్డాడు.
కొడుకే హంతకుడు..
విజయసేతుపతి నటించిన సూపర్ హిట్ సినిమా 'కడైసి వివాహాయి'. ఈ సినిమాలో నటించిన కాసమ్మాళ్ హత్యకు గురైంది. ఫిబ్రవరి 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురై జిల్లా ఉసిలంపట్టి సమీపంలోని అనయ్యూర్‌లో వారి ఇంట్లో ఆమె హత్యకు గురైంది. కాసమ్మాళ్ కొడుకు నామకోడి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నామకోడికి పెళ్లై పిల్లలు ఉన్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆయన దాదాపు 15 ఏళ్లుగా భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నాడు. తల్లితోనే ఉంటున్నాడు. అయితే, మద్యానికి బానిసైన నామకోడి.. ప్రతి రోజు తల్లితో గొడవ పడేవాడని స్థానికులు చెప్పారు. అలా ఫిబ్రవరి 4న ఇద్దరు గొడవపడ్డారని, కాసమ్మాళ్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో.. ఆవేశంగా ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు నామకోడి.
పోలీసుల అదుపులో నిందితుడు..
కాసమ్మాళ్ హత్యకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హంతుకుడైన ఆమె కొడుకును అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. కత్తిని స్వాధీనం చేసుకున్నామని, దాన్నే కోర్టులో సాక్ష్యంగా ఇచ్చామని చెప్పారు. కాసియమ్మాళ్, పాల్సామి దంపతులకు నిందితుడు నామకోడితో సహా ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.
'కడైసి వివాహాయి' సినిమాలో విజయ్ సేతుపతి తల్లిగా నటించారు కాసమ్మాళ్. 2022లో రిలీజైన ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఎం.మణికండాని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యోగిబాబు, నల్లంది తదితరులు నటించారు. రైతుల జీవితాలు ఎలా ఉంటాయి? అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు. ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన నల్లంది సినిమాకి రిలీజ్ కి ముందే మరణించారు. ఫిబ్రవరి 1, 2022న ఆయన మరణించారు. కాగా.. ఈ సినిమాకి ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది.
Also Read: హాలీవుడ్ రేంజిలో ‘గామి‘ మేకింగ్, స్టన్నింగ్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్