అన్వేషించండి

Suchitra Krishnamoorthi: నాకు ఎవరినీ నగ్నంగా చూడాలని లేదు, అందుకే పారిపోయి వచ్చేశాను - ఆ పార్టీలపై సుచిత్ర కృష్ణమూర్తి వ్యాఖ్యలు

Suchitra Krishnamoorthi: ‘కభీ హా కభీ నా’లో నటించిన సుచిత్ర కృష్ణమూర్తి.. తాజాగా ఫారిన్‌లో చక్కర్లు కొడుతూ అనుకోకుండా ఒక బాడీ పాజిటివిటీ పార్టీకి వెళ్లింది. దానిపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.

Suchitra Krishnamoorthi About Body Positivity Parties: సినీ పరిశ్రమలో పార్టీలు కామన్. చాలామంది నటీనటులు ఓపెన్‌గానే ఈ పార్టీలకు అటెండ్ అవుతుంటారు. ఈ పార్టీల్లో ఏం జరుగుతుంది, ఏంటి అనే వివరాలు పెద్దగా బయటికి తెలియకపోయినా.. ప్రేక్షకుల్లో మాత్రం ఎప్పటికప్పుడు దీని గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. బాలీవుడ్‌లో అయితే ఈ కల్చర్ ఎప్పటినుండో ప్రారంభమయ్యింది. కానీ ఒక బాలీవుడ్ భామ మాత్రం న్యూడ్ పార్టీల గురించి చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘కభీ హా కభీ నా’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సుచిత్ర కృష్ణమూర్తి.. తాజాగా న్యూడ్ పార్టీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విదేశాల్లో పార్టీ..

‘కభీ హా కభీ నా’తో హీరోయిన్‌గా గుర్తింపు సాధించిన సుచిత్ర కృష్ణమూర్తి ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. కానీ ఆ మూవీ తెచ్చిన పాపులారిటీ మాత్రం తనను ఇంకా స్టార్‌గానే నిలబెట్టింది. ఇక తరచుగా ట్రిప్స్‌కు వెళ్లే సుచిత్ర.. తాజాగా ఫ్రెండ్స్‌తో కలిసి లండన్‌కు వెళ్లింది. అక్కడ తెలియక ఒక న్యూడ్ పార్టీకి వెళ్లిన ఆమె.. దానిపై స్పందిస్తూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ‘‘తాజాగా బెర్లిన్‌లో బాడీ పాజిటివిటీ, నేకెడ్ పార్టీకి అటెండ్ అయ్యాను. నాకు వెంటనే ఒక కోట్ గుర్తొచ్చింది.. నీ మెదడు బయటపడిపోయేంత ఓపెన్‌గా ఉండకు అని. ఎప్పటికీ నేను ఒక దేశీ అమ్మాయినే. వెంటనే స్నానం చేయాలి. గాయత్రి మంత్రం చదవాలి’’ అని అన్నారు.

పారిపోయి వచ్చేశాను..

ఇప్పుడు మాత్రమే కాదు ఇంతకు ముందు కూడా చాలాసార్లు తనకు బాడీ పాజిటివిటీ పార్టీలు నచ్చవు అని, తను అసలు సిసలైన దేశీ అమ్మాయిని అని వ్యాఖ్యలు చేసింది సుచిత్ర కృష్ణమూర్తి. ‘‘ఇలాంటి విషయాలు ఇక్కడ చాలా చాలా కామన్. అసలు ఈ పార్టీల ముఖ్య ఉద్దేశ్యం బాడీ పాజిటివిటీని పెంచడం. అందుకే నేను కూడా ఎక్స్‌పీరియన్స్ చేద్దామని వెళ్లాను. నా ఫ్రెండ్‌కు ఫ్రెండ్ అయిన వ్యక్తికి చెందిన బార్‌లో ఈ పార్టీ జరిగింది. అందుకే నన్ను కూడా గెస్ట్ లిస్ట్‌లోకి యాడ్ చేశారు. నేను అక్కడికి వెళ్లాను కానీ కాసేపట్లోనే పారిపోయి వచ్చేశాను. ఎందుకంటే నేను చాలా దేశీ అమ్మాయిని. నాకు ఎవరినీ నగ్నంగా చూడాలని లేదు’’ అని తెలిపింది.

మజా వచ్చింది..

తను వెళ్లిన బాడీ పాజిటివిటీ పార్టీ రాత్రంతా జరుగుతుందని, కానీ తను మాత్రం 20 నిమిషాలకే పారిపోయి వచ్చేశానని వివరించింది సుచిత్ర కృష్ణమూర్తి. ‘‘కానీ అక్కడ జరిగేది అంతా మంచి ఉద్దేశ్యంతోనే. అది ఒక పాజిటివ్, ఫన్ ఈవెంట్. అది అస్సలు అసభ్యకరంగా లేదు. కానీ ఇండియన్స్‌గా మనం శరీరానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రతీది దాచిపెట్టుకోవాలి, సర్దుకోవాలి. అక్కడ చాలామంది ఉన్నారు కానీ ఆ పార్టీకి ఆహ్వానిస్తేనే వెళ్లాలి. అది పబ్లిక్ ఈవెంట్ కాదు. నాకు కూడా మజా వచ్చింది కానీ నేను దేశీ అమ్మాయిని’’ అని చెప్పింది సుచిత్ర. ఆమె హీరోయిన్‌గా మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించింది.

Also Read: ప్రభాస్‌కు అది జుజుబీ, కానీ నాకు అలా కాదు - అమితాబ్ బచ్చన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget